వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు బయటకొచ్చిన రాయల్ వశిష్ఠ: 38 రోజుల తరువాత: సాధించిన ధర్మాడి టీం..! (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

బయటకు వచ్చిన వశిష్ట బోటు

తూర్పు గోదావరి జిల్లా నదిలో మునిగి 50 మందిని పొట్టన పెట్టుకున్న రాయల్ వశిష్ఠ బోటు బయటకు వచ్చింది. సెప్టెంబర్ 15న విహార యాత్రం కోసం వచ్చిన వారితో బయల్దేరిన బోటు కచ్చలూరు వద్ద నీటి సుడి గుండంలో చిక్కుకుంది. భారీగా బరువు ఉంటంతో బోటు కిందనే అనేక మంది చిక్కుకుని మరణించారు. 38 రోజులుగా ఈ బోటును తీసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే, ప్రభుత్వం స్థానికంగా ధర్మాడి సత్యం టీంకు బోటు వెలికితీత బాధ్యతలు అప్పగించారు.

అనేక దఫాలుగా ప్రయత్నించి విఫలమైన ధర్మాడి టీం.. ఎట్టకేలకు బోటును నీటి పైకి తీసుకొచ్చారు. బోటు పూర్తిగా ధ్వంసం అయింది. ఇంకా..12 మంది జాడ తెలియకపోవటంతో వారి శరీరాలు ఏ పరిస్థితుల్లో బోటులో ఉన్నాయనే చర్చ మొదలైంది. నీటి అడుగుభాగం నుండి రోప్ ల సహకారంతో బయటకు లాగారు. 200 అడుగులు లోపల ఉన్న ఈ బోటును ఎట్టకేలకు బయటకు తీసారు.

Dharmadi satyam team success in found the boat capsized in River Godavari and brought up to out side

బయట పడ్డ రాయల్ వశిష్ఠ బోటు..
సెప్టెంబ్ 15న నిబంధనలను ఉల్లంఘించి పర్యాటకులను 90 మంది వరకు పర్యాటకులను ఎక్కించుకొని రాయల్ శశిష్ఠ బోటు పాపికొండల వైపు వెళ్తూ నీట మునిగింది. గోదావరి లో భారీ నీటి ప్రవాహం తో పాటుగా సుడి గుండాల కారణంగా బోటు మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో స్థానిక కచ్చలూరు గ్రామానికి చెందిన స్థానికులు కొందరిని కాపాడారు. దాదాపు 26 మంది ప్రాణాలతో బయట పడ్డారు. మరో 50 మంది వరకు జాడ తెలియలేదు. ఆ తరువాత ఒక్కొక్కరుగా నదిలో కొట్టుకొచ్చారు. ప్రాణాలు పోయిన పరిస్థితుల్లో వారిని బంధువులు గుర్తించారు.

ప్రాణాలో పోగొట్టుకున్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయాల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అదే విధంగా భీమా సంస్థ నుంది పరిహారం అందేలా చర్యలు తీసుకుంది. మరణించిన వారిలో ఎక్కవ మంది విశాఖతో పాటుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉండటంతో ఆ రాష్ట్ర మంత్రులు సైతం తొలి రెండు రోజుల సహాయక చర్చల్లో పాల్గొన్నారు. ఇక, ఆచూకి తెలియని వారి కోసం గాలింపు చర్యలు ఎన్ని రోజులు చేసినా ఫలితం లేక పోవటంతో బంధువుల సూచన మేరకు వారి డెత్ సర్టిఫికెట్లు జారీ చేసారు. ఇక, ఇప్పుడు బోటు బయటకు వస్తుండటంతో అందులోని ఏపీ రూం లో కొంతమంది నిర్జీవంగా కనిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, బోటు పూర్తిగా శిధిలావస్థలో ఉండటంతో ఆ శరీరాలను గుర్తు పట్టే పరిస్థితి ఉండే అవకాశం లేదు.

Dharmadi satyam team success in found the boat capsized in River Godavari and brought up to out side

ధర్మాడి సత్యంకు ఆపరేషన్ బాధ్యతలు
ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అనేక ప్రయత్నాలు చేసి బోటు ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిన సఫలం కాలేదు. దీంతో..ప్రభుత్వం మాత్రం ఎలాగైనా బోటు బయటకు తీసుకొస్తామని చెబుతూ వస్తోంది. ఆ ప్రమాదానికి కారణమైన బోటు యజమాన్యం పైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఈ ఘటన మీద ప్రభుత్వం న్యాయ విచారణ కు ఆదేశించారు. ప్రభుత్వం, ఆ తరువాత బోటు వెలికితీక పనులను ధర్మాడి సత్యం టీంకు అప్పగించారు. దాదాపు 20 రోజులుగా బోటు వెలికితీత పనులు కొనసాగిస్తున్నారు.

అయితే వర్షాకాల ప్రభావం..వరదల కారణంగా పనులు ముందుకు సాగలేదు. ఆ తరువాత బోటు ఎక్కడ ఉందో గుర్తించిన ధర్మాడి టీం కు విశాఖ నుండి వచ్చిన నేవీ టీం సమాచార విశ్లేషణలో సహకారం అందించింది. గత నాలుగు రోజులుగా ధర్మాడి టీం ఎలాగైనా బోటు బయటకు తీసుకురావాలని పట్టుదల తో ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది. రెండు రోజుల క్రితం రోప్ లకు కేవలం బోటు రెయిలింగ్ మాత్రం బయటకు వచ్చింది. ఇక, ఒక్కొక్కటిగా వస్తువు బయటకు వస్తూ ఉన్నాయి. కొద్ది సేపటి క్రితం బోటు మొత్తంగా శిధిలావస్థలో ఉన్న బోటును నీటి మీదకు తీసుకొచ్చారు. ఒడ్డు మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో..ప్రభుత్వం ధర్మాడి టీం కు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసింది.

English summary
Dharmadi satyam team success in found the boat capsized in River Godavari and bought up the boat out side. After 38 days boat come out with heavy struggle. This boat capsized leading to the death of several tourists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X