• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నాళ్లుంటానో: ధర్మాన ప్రసాద రావు ఆసక్తికర వ్యాఖ్య

By Srinivas
|

Dharmana Prasad Rao
శ్రీకాకుళం: మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యుడు ధర్మాన ప్రసాద రావు ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు! తాను కాంగ్రెసు పార్టీలో ఎన్నాళ్లుంటానో చెప్పేలనని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇక కొనసాగలేనని, అసెంబ్లీలో సమైక్యవాణి వినిపించిన తర్వాత పార్టీ నుంచి వైదొలుగుతానని ధర్మాన చెప్పారట.

రెండు రోజుల క్రితం శ్రీకాకుళంలోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన సర్పంచులతో ధర్మాన భేటీ అయ్యారు. ధర్మాన కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెసు పార్టీని వీడాలనుకుంటున్నట్లుగా వారికి చెప్పినట్లుగా సమాచారం.

అందరూ సహకరించాలని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రోజులు ఉంటానో కూడా చెప్పలేనని వారితో అన్నారట. సమైక్యాంధ్ర కోసం తన నిర్ణయాన్ని సమర్థించాలని ధర్మాన కోరగా, మెజార్టీ సర్పంచులు ఆమోదం తెలిపారట కూడా.

కాగా, ఇటీవల ధర్మాన ప్రసాద రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరులోగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారనే వార్తలు వచ్చాయి.

English summary
It is said that Former Minister and Congress senior 
 
 MLA Dharmana Prasada Rao may join YSR Congress Party 
 
 soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more