వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపి నుండి ధ‌ర్మాన ఔట్..! చెక్ పెట్ట‌నున్న జ‌గ‌న్..! కార‌ణం అదే అంటున్న నాయ‌కులు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

వైసీపి నుండి ధ‌ర్మాన ఔట్..! కార‌ణం అదే..!!

హైద‌రాబాద్ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వ‌చ్చిప‌డిందంటే ఇదే..! ఏపిలో జ‌రుగుతున్న అనేక వివాదాస్ప‌ద కార్య‌క్ర‌మాల‌కు అదికార పార్టీకి చెందిన నేత‌లు కార‌ణంగా నిల‌వ‌డ‌మే కాకుండా అనుకోని చిక్కుల‌ను కూడా కొనితెచ్చుకుంటారు. తాజాగా విశాఖ భూ కుంభ‌కోణంలో మంత్రి గంటా శ్రీ‌నివాస రావు పేరు బ‌య‌ట‌కు వ‌స్తుంద‌నుకున్న త‌రుణంలో అనూహ్యంగా వైసీపి నేత ధ‌ర్మాన ప్ర‌సాద రావు పేరు తెర‌మీద‌కు రావ‌డంతో ఆ పార్టీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది. దీంతో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పై చర్య‌లు తీసుకుని పార్టీయ స‌చ్చీల‌త‌ను కాపాడుకోవాల‌ని పార్టీ అదిష్టానం భ‌విస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ధ‌ర్మాన ప్ర‌సాద రావు పై చ‌ర్య‌లు తీసుకునేందుకు పార్టీ అదినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రంగం సిద్దం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

విశాఖ భూ కుంభ‌కోణంలో ధ‌ర్మాన పేరు..! తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న వైసీపి అదిష్టానం..!!

విశాఖ భూ కుంభ‌కోణంలో ధ‌ర్మాన పేరు..! తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న వైసీపి అదిష్టానం..!!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారని సమాచారం. అలాగే పార్టీలో క్రియాశీలంకంగా లేనివారిని పక్కన పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం నేత ధర్మాన ప్రసాదరావుకు జగన్ చెక్ చెప్పనున్నారని లోట‌స్ పాండ్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుఏగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో పేరుమోసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తదనంతరకాలంలో ధర్మాన తన వాగ్దాటితో ఆనాటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మెప్పు పొందడ‌మే కాకుండా అత్యంత ప్రియ శిశ్యుడిగా పేరుతెచ్చుకున్నారు.

దివంగ‌త వైయ‌స్ హ‌యాంలో కీల‌క నేత‌గా ధ‌ర్మాన‌..! త‌ర్వాత ఢీలా ప‌డిపోయిన ప్ర‌సాద‌రావు..!!

దివంగ‌త వైయ‌స్ హ‌యాంలో కీల‌క నేత‌గా ధ‌ర్మాన‌..! త‌ర్వాత ఢీలా ప‌డిపోయిన ప్ర‌సాద‌రావు..!!

ఈ నేపధ్యంలోనే వైఎస్ హయాంలో కీలకమైన పలు శాఖలను ధర్మాన నిర్వహించారు. కాగా వైఎస్ దివంగతులయ్యాక ధర్మానకు కష్టాలు మొదలయ్యాయనే చ‌ర్చ జ‌రిగింది. వైఎస్ ఉన్న సమయంలో ధర్మాన శ్రీ‌కాకులం జిల్లాలో చక్రం తిప్పారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆ సమయంలోనే ధర్మాన టీడీపీని ముప్పుతిప్పలు పెట్టారనే వార్తలు వినిపిస్తుంటాయి. దీనికితోడు 2009 లో కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు రావడం వెనుక ధర్మాన కృషి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతుంటారు. వైఎస్ మరణించాక ధర్మాన డీలా పడినట్టు వార్త‌లు వినిపించాయి. 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన ధర్మాన శ్రీకాకులం అసెంబ్లీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

సిట్ నివేదిక‌లో ధ‌ర్మాన పేరు..! చ‌ర్య‌లు తీసుకుంటేనే శ్రేయ‌స్క‌రం అంటున్న ముఖ్య‌నేత‌లు..!!

సిట్ నివేదిక‌లో ధ‌ర్మాన పేరు..! చ‌ర్య‌లు తీసుకుంటేనే శ్రేయ‌స్క‌రం అంటున్న ముఖ్య‌నేత‌లు..!!

దీంతో శ్రీకాకుళం జిల్లాలో పార్టీని గెలిపించలేదన్న కారణంతో జగన్, ధర్మానను కొన్నాళ్ళు పక్కన పెట్టారనే వార్తలు వినిపించాయి. దీనికితోడు టీడీపీ పెద్దలతో ధర్మాన మంతనాలు సాగిస్తున్నానే అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వ్యాపించాయి. అయినప్పటికీ జగన్, ధర్మానకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. అలాగే శ్రీకాకులంలో పార్టీని గాడిన పెట్టమని జ‌గ‌న్ ధర్మానకు ఆదేశాలు జారీచేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే తాజాగా విశాఖ భూ కుంభకోణాలపై వచ్చిన సిట్ నివేదికలో ధర్మాన పేరు రావడంతో స్థానికంగా సంచలనంగా మారింది. ఇదే అంశం వైసీపిని కుదిపేస్తోంది.

 విశాఖ భూకుంభ‌రోణంతో ధ‌ర్మాన‌కు లింకులు..! చెక్ పెట్టేందుకు అదిష్టానం చ‌ర్య‌లు..!!

విశాఖ భూకుంభ‌రోణంతో ధ‌ర్మాన‌కు లింకులు..! చెక్ పెట్టేందుకు అదిష్టానం చ‌ర్య‌లు..!!

దీనిని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ధర్మానపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే ధర్మాన చేసిన అక్రమాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయని, ఇక ఆయనకు శిక్షలు పడడం తప్పదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికితోడు ధర్మాన పనితీరు పై అసంతృప్తిగా ఉన్న జగన్ ఇప్పుడు ఆయనకు చెక్ పెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీకి పూర్తి స్థాయిలో న‌ష్టం జ‌ర‌గ‌క ముందే ధ‌ర్మాన ప్ర‌సాద రావు పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనికితోడు ధర్మానకు రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ దక్కడం కూడా కష్టమనే చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
YSR Congress chief Jagan has been doing more and more strategically in the wake of elections in the AP. It is reported that the only way to win in next elections in ap. Lotus Pond talks about the issue of Dharmana, Party chief Jagan mohan reddy takes actions against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X