గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీరు గ్రేట్: చంద్రబాబుపై బాలీవుడ్ నటి దియా ప్రశంసలు, ఎందుకంటే.?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా ప్రశంసించారు. ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా కఠినంగా చట్టాలు రూపొందిస్తున్నట్లు చంద్రబాబునాయుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే.

అదే చివరి రోజు, భయపడాలి: దాచేపల్లి బాధితురాలికి బాబు గార్డియన్, నీచమంటూ జగన్ పార్టీపై ఫైర్అదే చివరి రోజు, భయపడాలి: దాచేపల్లి బాధితురాలికి బాబు గార్డియన్, నీచమంటూ జగన్ పార్టీపై ఫైర్

శనివారం దాచేపల్లి బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు.. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో జరగకుండా కఠిన శిక్షలు అమలు చేయాల్సిందేనని అన్నారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయన్న భయం ప్రతి ఒక్కరిలోనూ కలగాలన్నారు.

 dia mirza praises chandrababu

దాచేపల్లి దుర్ఘటన మానవత్వానికే మాయని మచ్చని చంద్రబాబు అన్నారు. అత్యాచారాలకు పాల్పడిన వారిని ఉరితీయాలని అన్నారు. దీన్ని ఓ ఆంగ్లపత్రిక తన కథనంలో పేర్కొంది. ఆ వార్తను దియా మీర్జా రీట్వీట్‌ చేస్తూ.. 'నాకు మీరంటే చాలా గౌరవం. మీరు చాలా మంచి వ్యక్తి' అని పోస్ట్‌ చేశారు.

బాధితురాలికి 'వ్యక్తిగతంగా చదువుకు అయ్యే ఖర్చులను నేను భరిస్తాను. తను ఉన్నత స్థానాన్ని చేరుకునే వరకు ఆమె బాధ్యతలు చేసుకుంటాను' అని చంద్రబాబు చెప్పడం చాలా గొప్ప విషయమని దియా పేర్కొన్నారు.

English summary
Bollywood Actress Dia Mirza on Saturday praised Andhra Pradesh CM Chandrababu Naidu for responding on Dachepalli incident issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X