• search
 • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కూలీలకు వజ్రాలు దొరికాయి -కర్నూలు జిల్లా తుగ్గలిలో జోరుగా వేట -రైతుకు రూ.1.2కోట్లు -ఎగబడుతోన్న జనం

|

కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మళ్లీ ఊపందుకుంది. తొలకరి వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ఎర్ర నేలల్లో దాగి ఉన్న వజ్రాలను చేజిక్కించుకుని, తమ అదృష్టాన్ని వెతుక్కునేందుకు జనం ఎగబడుతున్నారు. కర్నూలు జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి జనం తుగ్గలి, మద్దికెర మండలాలకు వస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం ఇటీవలే ఒక రైతుకు పెద్ద వజ్రం దొరికి, దాన్ని అమ్మగా రూ.1.2కోట్లు లభించగా, తాజాగా ఇద్దరు మహిళా కూలీలకు చెరో వజ్రం దొరికింది. వివరాలివి..

  Diamond Hunt In Kurnool మహిళా కూలీలకు చెరో వజ్రం.. భూముల్లో మెరుస్తున్న వజ్రాలు || Oneindia Telugu

  భారత్‌కు అమెరికా వ్యాక్సిన్ సాయం వట్టిదేనా? ముఖేష్ బాంబు-బైడెన్ మంత్రులు బ్లింకెన్, అస్టిన్‌తో జైశంకర్ చర్చలుభారత్‌కు అమెరికా వ్యాక్సిన్ సాయం వట్టిదేనా? ముఖేష్ బాంబు-బైడెన్ మంత్రులు బ్లింకెన్, అస్టిన్‌తో జైశంకర్ చర్చలు

  రఘురామకు గాయాలపై సీఐడీ కీలక ప్రకటన -ఎంపీ కాళ్లకు పీఓపీ కట్లు -కణాలు దెబ్బతిన్నాయన్న ఎయిమ్స్రఘురామకు గాయాలపై సీఐడీ కీలక ప్రకటన -ఎంపీ కాళ్లకు పీఓపీ కట్లు -కణాలు దెబ్బతిన్నాయన్న ఎయిమ్స్

  మహిళా కూలీల అదృష్టం..

  మహిళా కూలీల అదృష్టం..

  కర్నూలు జిల్లాలోని తుగ్గలి, మద్దికెర మండలాల్లో తొలకరి వర్షాల సమయంలో వజ్రాల వేట చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. వర్షాలకు ఇక్కడి భూముల్లో వజ్రాలు మెరుస్తుంటాయి. దీంతో సూర్యోదయం కాగానే జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పొలాల్లో వాలి పోతుంటారు. తాజాగా తుగ్గలి మండలం జొన్నగిరిలో రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. బొప్పాయి తోటలో కలుపు తొలగిస్తున్న మహిళా కూలీకి వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.70 వేలకు కొనుగోలు చేశాడు. అలాగే పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న మరో మహిళా కూలికి వజ్రం లభ్యం అవగా.. పెరవలికి చెందిన వ్యాపారికి రూ.40 వేలకు అమ్మినట్లు తెలుస్తోంది.

  రాయలవారి వజ్రాలేనా? దొరికేది ఇక్కడే

  రాయలవారి వజ్రాలేనా? దొరికేది ఇక్కడే

  రాయల కాలంలో ఇక్కడ రత్నాలు, వజ్రాలను రాశులుగా పోసి అమ్మే వారని నానుడి. జొన్నగిరిని స్వర్ణగిరి అని పిలిచే వారని చెబుతారు. అశోకుడు జొన్నగిరికి రెండు కిలోమీటర్ల దూరంలో కొండలో పెద్ద బండరాళ్లపై శాసనాలను చెక్కించారు. ప్రధానంగా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, చిన్న జొన్నగిరి, రామాపురం, జి.ఎర్రగుడి, గిరిజన తండాలు, పగిడిరాయి, బొల్లవానిపల్లి, ఉప్పర్లపల్లి, పి.కొత్తూరు, చెన్నంపల్లి, గిరిగెట్ల, తుగ్గలి, ఉసేనాపురం, రాంపల్లి, రామలింగాయపల్లితో పాటు మద్దికెర మండలంలో పెరవలి, బసినేపల్లి ప్రాంతాల్లో వజ్రాలు లభ్యమవుతుంటాయి.

  ఏటా 20 నుంచి 50 వజ్రాలు..

  ఏటా 20 నుంచి 50 వజ్రాలు..

  ప్రతి ఏటా తొలకరి వానలు కురవగానే ఈ ప్రాంతంలో వజ్రాన్వేషణ కొనసాగుతుంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి జనం ఇక్కడి వచ్చి వజ్రాన్వేషణ చేస్తుంటారు. కొందరు రెండు మూడు నెలల పాటు ఇక్కడే ఉంటూ వెతుకుతారు. పొలం పనులు చేసే సమయంలోనూ కూలీలు, రైతులకు వజ్రాలు దొరుకుతుంటాయి. తెలుపు, ఎరుపు, తేనె వర్ణం వంటి రంగులలో వజ్రాలు లభిస్తుంటాయి. రూ.2వేల నుంచి లక్షల విలువ చేసే వజ్రాలు ఏటా దాదాపు 20 నుంచి 50కి పైగా దొరుకుతుంటాయి.

   పెద్ద వజ్రానికి రూ.1.20 కోట్లు..

  పెద్ద వజ్రానికి రూ.1.20 కోట్లు..

  కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లో గతంలో రూ.2వేల నుంచి రూ.37లక్షల విలువ చేసే వజ్రాలు లభ్యమయ్యాయి. అయితే అనూహ్య రీతిలో అతి పెద్ద వజ్రం మాత్రం గురువారం లభ్యమైంది. తుగ్గలి మండలం చిన్న జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ రైతుకు దాదాపు 25 క్యారెట్లకు పైగా ఉన్న పెద్ద వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.1.20 కోట్లకు కొనుగోలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వజ్రాలను కొనుగోలు చేసిన వ్యాపారులు ముంబయి, చెన్నై, బెంగళూరు తదితర రాష్ట్రాల్లో అమ్ముతారు. కాగా,

   వజ్రాల వేటపై అధికారుల పట్టింపు ఇలా..

  వజ్రాల వేటపై అధికారుల పట్టింపు ఇలా..

  లంకె బిందెలుగానీ, ఇతరత్రా భూమిలో దాగిన విలువైన వస్తులు లభ్యమైన సమయంలో ప్రభుత్వ యంత్రాంగం హడావుడి చేస్తుంది. ప్రైవేటు భూముల్లో లభ్యమైన సంపదను కూడా ప్రభుత్వంవారే స్వాధీనం చేసుకోవడం తెలసిందే. అయితే, కర్నూలు జిల్లాలో వజ్రాల వేట విషయంలో మాత్రం.. వజ్రం దొరికినట్లు ఎలాంటి ఆధారాలు దొరకక పోవడంతో అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. వజ్రం దొరికినట్లు తెలుస్తుందే తప్ప అమ్మకం తర్వాత దొరకలేదని, వజ్రం కాదన్నారని చెబుతుండడంతో అధికారులు మిన్నకుండిపోతున్నారని, వజ్రం దొరికితే పోలీసులు, రెవెన్యూ అధికారులకు వ్యాపారుల నుంచి కమీషన్‌ అందుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో వజ్రాల వేట కోసం జనం గుంపులుగా రావడం కలవరం పుట్టిస్తున్నది,

  English summary
  diamonds were found at Jonnagiri in the Tuggali area of Kurnool district in andhra pradesh. it is reported that two female laborers found two diamonds and sold it to traders. in an other incident at same place, Unconfirmed reports suggest that the farmer has sold the diamond to a local merchant for Rs 1.2 crore.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X