విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐవైఆర్ కృష్ణారావు విశాఖపట్టణం ఎంపి సీటు అడిగారా?...బిజెపి ఒప్పుకుందా?...ఔనంటున్నారు!

|
Google Oneindia TeluguNews

విజయవాడ:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు బిజెపిలో చేరి 24 గంటలు కూడా గడవక ముందే అప్పుడే తాను పోటీ చేయాలనుకుంటున్న సీటు విషయమై ఆ పార్టీ అధిష్టానం నుంచి హామీ పొందినట్లు ప్రచారం జరుగుతోంది.

బిజెపిలో చేరే ముందే తాను ఎక్కడ నుంచి పోటీచేయాలనుకునే విషయమై స్పష్టతతో ఉన్న ఐవైఆర్‌ తాను ఎందుకు అక్కడ నుంచి పోటీచేయాలనుకుంటున్నానో, అక్కడ తనకు సీటు ఇస్తే ఎలా గెలవగలనో అవన్నీ అధిష్టానానికి చెప్పి ఒప్పించారట. ఇంతకీ ఆ స్థానం విశాఖపట్టణం లోక్ సభ నియోజకవర్గం. అయితే అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపిగా బిజెపి కే చెందిన హరిబాబు ఉన్నారుగా అనే ప్రశ్న ఉత్పన్నం కాగా...ఈసారి ఆ సీటు ఆయనకు అక్కడి టికెట్ ఇవ్వడం లేదని టాక్.

ఐవైఆర్‌ కృష్ణారావు

ఐవైఆర్‌ కృష్ణారావు

మాజీ ఎపి సిఎస్ ఐవైఆర్‌ కృష్ణారావు రాజకీయ అడుగులు చాలా వేగంగా పడుతున్నాయనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారినట్లు తెలిసింది. బిజెపిలో చేరకముందే తన రాజకీయ ప్రస్థానంపై స్పష్టత కలిగిఉన్న ఐవైఆర్ బిజెపిలో చేరడంతోనే అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారట. తన రాజకీయ ఆరంగ్రేటం సీటుగా 'విశాఖపట్నం' లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎంచుకున్న ఆయన...ఆ విషయమై బిజెపి అధిష్టానాన్ని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించి సఫలీకృతులయ్యారని అంటున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

టిడిపి, బిజెపి

టిడిపి, బిజెపి

గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా 'కంభంపాటి హరిబాబు' పోటీలోకి దిగి వైసిపి నాయకురాలు విజయమ్మ పై ఘనవిజయం సాధించారు. అయితే వివిధ కారణాల రీత్యా ఈ సారి ఆయనకు అక్కడ టిక్కెట్‌ ఇవ్వడంలేదని...ఈ క్రమంలో ఐవైఆర్‌ ఆ సీటు గురించి అడుగగా అన్ని కోణాల్లో ఆలోచించిన బిజెపి ఆయన అభ్యర్థన పట్ల సానుకూలంగానే స్పందించిందని ప్రచారం జరుగుతోంది.

ఆల్రెడీ విశాఖపట్టణం పార్లమెంట్ నియోజకవర్గం పరిథిలో బిజెపికి పట్టు ఉందని...దీంతో 'ఐవైఆర్‌' చెప్పిన ఈక్వేషన్లే కాకుండా...స్వతహాగా కూడా బిజెపికి అక్కడ అడ్వాంటేజ్ ఉండటంతో ఐవైఆర్ అక్కడ గెలుపొందుతారని బిజెపి కూడా విశ్వాసంతో ఉందట. దీంతో అమిత్‌షా నుంచి ఐవైఆర్‌ అభ్యర్థిత్వానికి ప్రాధమికంగా ఆమోదముద్ర పడినట్లు అనుకుంటున్నారు.

వై.ఎస్‌.జన్మోహన్‌రెడ్డికి

వై.ఎస్‌.జన్మోహన్‌రెడ్డికి

ఐవైఆర్ బిజెపి తరుపున ఇక్కడ నుంచి పోటీ చేస్తే ప్రతిపక్ష వైకాపా కూడా లోపాయికారీ సహకారం అందిస్తుందని, ఆ విషయం కూడా ఐవైఆర్ బిజెపి అధిష్టానానికి వెల్లడించారని అంటున్నారు. వైకాపా అధినేత వై.ఎస్‌.జన్మోహన్‌రెడ్డికి 'ఐవైఆర్‌ కృష్ణారావు' సన్నిహితంగా మెలుగుతారనేది అందరికీ తెలిసిన విషయమేనని, పైగా సిఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఐవైఆర్ వివిధ రకాలుగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో జగన్ అందుకు ప్రతిగా ఆయనకు తన మద్దతు ఇవ్వడం గ్యారెంటీ అని ఎపి బిజెపి నేతలు కూడా భావిస్తున్నారు.

విశాఖ నుంచి

విశాఖ నుంచి

అంతేకాదు ఐవైఆర్‌ విశాఖ నుంచి పోటీ చేస్తే ఆయనకు జనసేన పార్టీ కూడా మద్దతు ఇస్తుందని...అందుకు పవన్ కల్యాణ్ తో ఐవైఆర్ కు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఖచ్చితంగా తోడ్పడతాయని వారు విశ్లేషిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ ఆ మధ్యలో వేసిన 'జాయింట్‌ ఫైండింగ్‌ కమిటీ'లో 'ఐవైఆర్‌' ఒక సభ్యుడే కాకుండా ఐవైఆర్ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఇన్ని అనుకూల అంశాల దృష్ట్యా ఐవైఆర్ కు విశాఖ బిజెపి ఎంపీ సీటు దక్కడం ఖాయమని ఆయన మద్దతుదారులే కాదు వ్యతిరేకులు అంగీకరిస్తున్నారట...అయితే ఈ ప్రచారంలో ఎంతమేరకు వాస్తవం ఉందనేది తేలాలంటే మరి కొద్ది కాలం వేచిచూడక తప్పదు.

English summary
Former chief secretary of the Andhra Pradesh government, IYR Krishna Rao, has been expecting Visakhapatnam BJP MP seat...and The BJP is agreed to give that seat to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X