• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మెగాస్టార్ సేవలను ప్రభుత్వం గుర్తించలేదా: సీఎం జగన్ నిర్ణయాలకు చిరంజీవి మద్దతు: కానీ..ఇప్పుడు మాత్రం...!!

By Lekhaka
|

మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యమంత్రి జగన్. ఈ ఇద్దరికీ రాజకీయంగా ఎటువంటి మైత్రి లేదు. అదే సమయంలో శత్రుత్వం లేదు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చిరంజీవి ఆయనను పలు మార్లు కలిసారు. పలు నిర్ణయాల్లో మద్దతుగా నిలిచారు. ఆయన్ను అభినందించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క సారి కలవని చిరంజీవి గత రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్ ను రెండు సార్లు కలిసారు.

సైరా సినిమాకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వటంతో..చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి తాను కలవాలనుకుంటున్నానని ముఖ్యమంత్రికి చెప్పారు. దీంతో..సతీ సమేతంగా భోజనానికి రావాలని సీఎం ఆహ్వానించారు. దీంతో..సతీమణి సురేఖతో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన చిరంజీవి దంపతులకు అక్కడ సాదర స్వాగతం లభించింది. జగన్-భారతి దంపతులు చిరంజీవి దంపతనులను సత్కరించారు.ఆ సమయంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.

  Megastar Chiranjeevi ఆక్సిజ‌న్ బ్యాంకులు స్టార్ట్, Ram Charan పర్యవేక్షణ || Oneindia Telugu
   జగన్ చెంతకు సినీ పరిశ్రమ సమస్యలు

  జగన్ చెంతకు సినీ పరిశ్రమ సమస్యలు

  సినిమా పరిశ్రమ సమస్యలను సైతం చిరంజీవి ముఖ్యమంత్రికి వివరంచారు. దీంతో..జగన్ వీటి పరిష్కారినికి మేము సిద్దంగా ఉన్నాం..అన్నా..మీరే బాధ్యత తీసుకొని పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకురండి. విశాఖలో సినీ ఇండస్ట్రీ డెవపలమ్ మెంటకు సిద్దంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకే చిరంజీవి ..దగ్గుబాటి సురేష్, నాగార్జున, దిల్ రాజు, కళ్యాణ్ వంటి వారితో కలిసి జగన్ వద్దకు తీసుకెళ్లారు. తమ సమస్యలను..వినతులను వివరించారు. ఆ తరువాత కరోనా సమయంలోనే వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే చిరంజీవి స్పందించారు. ముఖ్యమంత్రి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేసారు. ఇక, విశాఖ నుండి రాజధాని విషయంలోనూ చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు.

  సోదరుడు పవన్ నిర్ణయం భిన్నంగా ఉన్నా..చిరంజీవి మాత్రం మూడు రాజదానుల విషయంలో జగన్ కు మద్దతుగా వ్యవహరించారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ విషయంలోనూ స్పందించిన చిరంజీవి..ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖలను సమర్ధిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మద్దతు ప్రకటించారు.

   చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులకు లభించని ప్రచారం

  చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులకు లభించని ప్రచారం

  ఇక, కర్నూలులో విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టగానే అభినందిస్తూ చిరంజీవి స్పందించారు. ఇక, కరోనా సమయంలో చిరంజీవి తన ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఏపీలోని 13 జిల్లాలు..తెలంగాణలోని 33 జిల్లాలకు ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ 150 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే దాదాపుగా ప్రక్రియ పూర్తి చేసారు. కానీ, దీనికి తగినంతగా ప్రచారం లభించలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

  ఒక ఇంజనీరింగ్ సంస్థ అందిస్తున్న సాయానికి లభించిన ప్రచారం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుకు మాత్రం లభించటం లేదనే వాదన ఉంది. ఒక వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి సేవలు అందిస్తుంటే కనీసం అభినందనలు తెలిపి.. ప్రోత్సహించాల్సిన సమయంలో మౌనం వహిస్తున్నారు.

   పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ

  పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ

  ప్రభుత్వం నుండి..లేదా మంత్రులు..కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవరూ చిరంజీవి ప్రయత్నాన్ని అభినందించటానికి ముందుకు రాలేదు. కష్టకాలంలో ప్రభుత్వం చేయాల్సిన పనులు స్వచ్చంద సంస్థ ద్వారా చేస్తున్నా...ప్రభుత్వం నుండి స్పందన రాకపోవటం పైన ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. తనకు అనేక నిర్ణయాల్లో మద్దతుగా నిలుస్తున్న చిరంజీవికి ఏపీ సీఎం సైతం మరితంగా కలుపుకుపోవటం భవిష్యత్ రాజకీయలకు సైతం అవసరమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఇదే అంశం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు కారణమవుతోంది.

  English summary
  Govt officially not recognised Chiranjeevi services in coivd itme. Previously Chiranjeevi supported CM Jagan decision in many times. Now this issue became discussion in political circles.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X