• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లగడపాటి ఎన్నికల నిబంధన ఉల్లంఘించారా..? ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..?

|
  ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన లగడపాటి.. ఈసీ చర్యలు ! || Oneindia Telugu

  మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శనివారం సాయంత్రం మీడియా సమావేశం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన తెలిసో తెలియకో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారా..? కోడ్ అమల్లో ఉండగా టీజర్ వదిలి పరోక్షంగా కంప్లీట్ పిక్చర్ చెప్పేశారా..? లగడపాటి ప్రెస్‌మీట్‌తో మీడియా కూడా ఇబ్బందుల్లో పడనుందా.. అసలు ఎన్నికల సంఘం నజర్ వేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..? లగడపాటి తెలివిగా ఎక్కడ వ్యవహరించారు అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

  ఆంధ్రా ఆక్టోపస్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారా.?

  ఆంధ్రా ఆక్టోపస్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారా.?

  లగడపాటి రాజగోపాల్... ఎన్నికలు వస్తే చాలు ఈ పేరు తెగ హడావుడి చేస్తుంది. లగడపాటి రాజకీయనాయకుడిగా కంటే ఎన్నికల ఫలితాలు పసిగట్టడం ద్వారానే పాపులర్ అయ్యారు. అందుకే ఆయనకు ఆంధ్రా ఆక్టోపస్ అనే మరో పేరుంది. ఇక శనివారం లగడపాటి రాజగోపాల్ ప్రెస్ మీట్ పెట్టి ఫలితాలపై చిన్నపాటి టీజర్ వదిలాడు. అయితే లగడపాటి ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇది తన అంచనా మాత్రమే అని చెప్పి లగడపాటి చాలా తెలివిగా వ్యవహరించారు.

  రీపోలింగ్ ఉందని తెలిసీ ప్రభావితం చేసే ప్రయత్నం చేశారా..?

  రీపోలింగ్ ఉందని తెలిసీ ప్రభావితం చేసే ప్రయత్నం చేశారా..?

  ఏపీలో సైకిల్ సవారీ చేస్తుందని తెలంగాణలో కారు జోరు కొనసాగుతుందని లగడపాటి చెప్పారు. ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ ఉందని తెలిసి కూడా ఏపీలో టీడీపీ సత్తా చాటుతుందని ఎలా చెబుతారనే వాదన వినిపిస్తోంది. కచ్చితంగా రీపోలింగ్‌లో ఈ ప్రభావం కనిపిస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదికూడా రాజగోపాల్ ప్రెస్‌మీట్ పెట్టింది ఎక్కడో కాదు... సచివాలయంలో ఉండే ఎన్నికల సంఘం నుంచి కూతవేటు దూరంలోనే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. అంతేకాదు ఇవి సర్వే ఫలితాలు కాదని తన అంచనా మాత్రమే అని తెలివిగా చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు.

  ఎన్నికల సంఘం లగడపాటి కామెంట్స్‌ను పరిశీలిస్తుందా..?

  ఎన్నికల సంఘం లగడపాటి కామెంట్స్‌ను పరిశీలిస్తుందా..?

  చంద్రగిరిలో రీపోలింగ్ ఉన్న నేపథ్యంలో లగడపాటి జోస్యంను ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుందా.. ఒక వేళ తీసుకుంటే ఎలా స్పందించే అవకాశం ఉందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతం ప్రజాప్రతినిధి కాదు.. పోనీ ఏపార్టీతో ఆయనకు సంబంధం లేదు. అలాంటి సమయంలో ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఒకవేళ నిజంగానే చర్యలు తీసుకోవాల్సి వస్తే కేవలం జరిమానా విధించడమో, లేక జైలుశిక్ష విధించడమో చేస్తుందా...? అది కేవలం తన అంచనా మాత్రమే అని స్పష్టంగా చెప్పుకొచ్చిన లగడపాటి మాటలకు కన్విన్స్ అయి వదిలేస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఎన్నికల కోడ్ మీడియాకు కూడా వర్తిస్తున్న నేపథ్యంలో ప్రెస్‌మీట్‌ను మొత్తం కవర్ చేసిన మీడియాపై కూడా ఈసీ చర్యలు తీసుంటుందా లేదా ఏమైనా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.

   వదిలింది చిన్న టీజరే..కానీ పిక్చర్ మాత్రం కంప్లీట్‌గా చెప్పేశారు

  వదిలింది చిన్న టీజరే..కానీ పిక్చర్ మాత్రం కంప్లీట్‌గా చెప్పేశారు

  లగడపాటి రాజగోపాల్ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పోలింగ్‌ కంటే ముందు ప్రజాకూటమి గాలి వీస్తోందంటూ చెప్పారు. అయితే తన అంచనాలు తప్పడంతో చతికిలపడ్డారు. దాన్నుంచి కవర్ చేసుకునేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయంటూ విశ్లేషించారు. ఇక తాజాగా శనివారం మరోసారి తన అస్త్రాన్ని ప్రయోగించారు. చెప్పకనే ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు చెప్పేశారు. అంతేకాదు సంఖ్య చెబితే కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిసీ... చాలా జాగ్రత్త పడ్డారు. చిన్న టీజర్ ద్వారా ఓవరాల్‌గా ఒక పిక్చర్ అయితే ఇచ్చారు కానీ అసలైన సంఖ్య ఏంటి అనేది పోలింగ్ ముగిశాక చెబుతానని చిన్న ట్విస్ట్‌తో తన సమావేశాన్ని ముగించారు. అయితే లగడపాటి ప్రెస్‌మీట్‌పై ఎన్నికల సంఘం నిఘా పెట్టిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

  English summary
  Former MP Lagadapati Rajagopal who held a press meet at vijayawada said that TDP would make into power in AP and TRS will win the majority seats. Now a debate is going on whether Rajagopal had violated the election code. Will EC take a note of it and issue notices to Lagadapati is the news now making rounds.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X