వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ తో యుద్దానికి పవన్ సై : కాపు అంశం-ఆ వార్నింగ్ ల వెనుక : అక్కడే వైసీపీ చేతికి చిక్కారు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ లో రాజకీయంగా వైసీపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేదికగా జగన్ సర్కార్ పైన గొడవ పడటానికి సిద్దమంటూ ప్రకటించారు. తన కారణంగా ఏపీ లో సినీ ఇండస్ట్రీని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందనే విధంగా పవన్ వ్యాఖ్యానించారు. తేజు గురించి జరుగుతున్న ప్రచారం గురించి ప్రస్తావిస్తూనే..రాజకీయ అంశాల గురించి చెప్పుకొచ్చారు.
వివేకానందరెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారు..

కోడి కత్తితో ఒక నాయకుడిని పొడవడం వెనకున్న కుట్ర... ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణం ఇలాంటి వాటి మీద కథనాలు ఇవ్వండి. మీకు ధైర్యం ఉంటే రాజకీయ హింసపై మాట్లాడాలని సూచించారు. వైసీపీ నాయకులూ చిత్ర పరిశ్రమను వైపు కన్నెత్తి చూడొద్దు.. కాలిపోతారని హెచ్చరించారు.

పేర్ని నాని పైన పవన్ తీవ్ర వ్యాఖ్యలు

పేర్ని నాని పైన పవన్ తీవ్ర వ్యాఖ్యలు

తన సినిమాలు ఆపేస్తే భయపడిపోతారని వైసీపీ నాయకులు అనుకుంటున్నారని చెబుతూ.. తన పేరు చెప్పి ఇండస్ట్రీని చావగొడుతున్నారని ఆక్రోశించారు. సన్నాసి మంత్రి' అంటూ పేర్ని నానిపై మండిపడ్డారు. చిరంజీవి అంటే సోదర భావన అని ఆ సన్నాసి అంటారు. సోదిలో సోదర భావన... చిత్ర పరిశ్రమకు ఉపయోగపడని సోదర భావన ఎందుకంటూనే.. వైసీపీ నాయకులు ఉపరాష్ట్రపతి వెంకయ్యపైనా నీచంగా మాట్లాడారు... భారత ప్రధాన న్యాయమూర్తిపైనే దాడులు చేశారు. వీళ్లకు సినిమా పరిశ్రమ ఒక లెక్కా.. వారి లక్ష కోట్ల ముందు రెండువేల కోట్ల విలువైన పరిశ్రమ ఎంత.. అని వ్యాఖ్యానించారు.

అప్పులు తెచ్చుకొనేందుకే ఆన్ లైన్ టిక్కెట్లు అంటూ

అప్పులు తెచ్చుకొనేందుకే ఆన్ లైన్ టిక్కెట్లు అంటూ

ఏపీ సర్కారు వద్ద డబ్బుల్లేవు. సినిమా టికెట్ల డబ్బులు ఖజానాకు వెళితే... ఆ ఆదాయాన్ని బ్యాంకులకు చూపించి కొత్త అప్పులు తీసుకోవచ్చు. లోన్ల కోసమే సినిమా పరిశ్రమ డబ్బులు వాడుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. తాను గొడవ పడటానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నానని చెప్పారు. చిరంజీవి అలా ప్రాధేయపడతాడేమిటని అందరూ అంటారని.. ఆయనది మంమంచి మనసని చెప్పిన పవన్.. అలా ప్రాధేయపడాల్సిన అవసరంలేదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడిన వాళ్లు... వైసీపీ రాగానే ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సినిమా ఈవెంట్ లో సామాజిక అంశాల ప్రస్తావన

సినిమా ఈవెంట్ లో సామాజిక అంశాల ప్రస్తావన

రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు.. బోయలకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం లభించడంలేదు.. ఇన్ని రకాల సమస్యలు పెట్టుకుని... సినిమా వాళ్లపైనే ఎందుకు మాట్లాడుతున్నారు.. అని పవన్‌ ప్రశ్నించారు. ఇడుపులపాయలో నేలమాళిగల్లో టన్నుల కొద్దీ డబ్బులుంటాయని అంటారని... దానిమీద మాట్లాడాలని సూచించారు. అయితే, తాజాగా ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ సమావేశంలో వచ్చే ఎన్నికల కోసం సంసిద్దులవుతున్నట్లుగా సంకేతాలిచ్చారు. దీంతో..పవన్ సినిమా సమస్యలు అంటూనే రాజకీయ అంశాల పైన మాట్లాడినట్లు కనిపిస్తోంది.

కాపు రిజర్వేషన్ల అంశం పవన్ ప్రస్తావించటం వెనుక

కాపు రిజర్వేషన్ల అంశం పవన్ ప్రస్తావించటం వెనుక

కాపు రిజర్వేషన్ల విషయంలో పాదయాత్ర సమయంలో జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇక, తాజాగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు వర్తిస్తుందని.. అదే విధంగా కాపు కార్పోరేషన్ ద్వారా నిధులు ఇస్తున్నామని తాజాగా జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ అంశం ప్రస్తావించటం వెనుక పవన్ కొత్త వ్యూహం సిద్దం చేస్తున్నారనే విషయం స్పష్టం అవుతోంది. వైసీపీని టార్గెట్ చేసేందుకు ఈ అంశాన్ని అస్త్రంగా మార్చుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, టిక్కెట్లు అమ్మి లోన్లు తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారన్న పవన్ ఆరోపణల పైన మంత్రులు గట్టిగానే రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

అక్కడే పవన్ లాజిక్ మిస్... వైసీపీకి చిక్కారా

అక్కడే పవన్ లాజిక్ మిస్... వైసీపీకి చిక్కారా

అది సినిమా పరిశ్రమ నుంచి ప్రతినిధులుగా వచ్చిన చిరంజీవి-నాగార్జున-దిల్ రాజు వంటి వారే ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి ఇచ్చారంటూ మంత్రి పేర్ని నాని స్పష్టం చేసారు. తాజాగా ప్రభుత్వంతో సమావేశమైన సినీ పరిశ్రమ నిర్మాతలు సైతం ఈ అంశాన్ని తామే ప్రతిపాదించామని స్పష్టం చేసారు. మోహన్ బాబు పైన పవన్ గట్టిగానే మాట్లాడారు. సినీ వజ్రోత్సవం సమయం నుంచి మెగా వర్సెస్ మంచు అన్నట్లుగా మారిన పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతోంది. తిరిగి పవన్ వ్యాఖ్యలతో మోహన్ బాబు సైతం రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

జగన్ తో యుద్దానికి సిద్దమైనట్లేనా

జగన్ తో యుద్దానికి సిద్దమైనట్లేనా

వీళ్లు లక్ష కోట్లు సంపాదించాలా.. మేము అడుక్కు తినాలా అంటూ పవన్ ఆవేశంతో ఊగిపోయారు. సంపద క్రియేషన్ చేతకాదంటూ విరుచుకుపడ్డారు. తాము కష్టపడితే ప్రభుత్వం టిక్కెట్లు అమ్ముకుంటుందా అని ప్రశ్నించారు. అయితే, పవన్ ఆ ప్రతిపాదన సినీ ఇండస్ట్రీ నుంచే వచ్చిందనేది ఉద్దేశ పూర్వకంగానే విస్మరించినట్లుగా కనిపిస్తోంది. కాపుల రిజర్వేషన్ల గురించి ఇక పవన్ భవిష్యత్ లోనూ డిమాండ్ చేస్తారా..తన డిమాండ్ స్పష్టం చేస్తారా అనేది ఆసక్త కర అంశంగా మారింది.

ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది

ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది

ఈ వ్యాఖ్యల పైన రియాక్ట్ అయ్యేందుకు మంత్రులు..వైసీపీ నేతలు సిద్దమవుతున్నారు. అదే విధంగా సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకే వైసీపీ ప్రభుత్వంతో చర్చలు జరిపిన వారు సైతం ఈ వ్యాఖ్యలతో ఢిఫెన్స్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ఇటు పవన్ కు సమాధానం ఇస్తూనే.,..ఏపీ ప్రభుత్వం ఏ రకంగా ఈ ఆరోపణల పైన రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. అదే విధంగా జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా సామాజిక వర్గాల అంశాలు..అదే విధంగా తనను ప్రభుత్వం టార్గెట్ చేస్తుందనే అంశాల పైన ప్రభుత్వం ఇచ్చే సమాధానం పైన ఆసక్తి నెలకొని ఉంది.

English summary
It looks like Pawan Kalyan had missed the logic while declaring war on AP CM Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X