వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుజనాకు విజయసాయి చెక్ పెట్టారా? సీబీఐ రంగంలోకి దిగుతుందా? టెన్షన్లో సుజనా!

|
Google Oneindia TeluguNews

టిడిపి నుండి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి ఇరకాటంలో పడనున్నారా? విజయసాయిరెడ్డి చేసిన పనికి సుజనా ఉచ్చులో చిక్కుకున్నారా? ఆయనపై సీబీఐ దర్యాప్తు చెయ్యనుందా? ప్రస్తుతం ఈ అనుమానాలు కేంద్రం చర్యలతో కలుగుతున్నాయి.

సీఎం రమేష్, సుజన చౌదరి వైఖరిపై బీజేపీ సీనియర్లలో అసహనం: టీడీపీ అధికార ప్రతినిధులుగా..!సీఎం రమేష్, సుజన చౌదరి వైఖరిపై బీజేపీ సీనియర్లలో అసహనం: టీడీపీ అధికార ప్రతినిధులుగా..!

 సుజనా టార్గెట్ గా విజయసాయి రాష్ట్రపతికి లేఖాస్త్రం

సుజనా టార్గెట్ గా విజయసాయి రాష్ట్రపతికి లేఖాస్త్రం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి సుజనా చౌదరి టార్గెట్ గా రాష్ట్రపతికి ఓ లేఖ రాశారు. ఇక ఆయన లేఖ ఆధారంగా, బిజెపికి చెందిన రాజ్యసభ ఎంపి సుజనా చౌదరి చేసిన మనీలాండరింగ్, మోసాలపై హోం మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. ఆయనపై టీడీపీలో ఉన్న సమయంలో మనీ ల్యాండరింగ్ కు సంబంధించి పలు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ నేపధ్యంలో విజయ సాయి లేఖ ఆధారంగా కేంద్ర హోం శాఖ పరిశీలన మొదలుపెట్టింది .

సుజనా వ్యాపార సామ్రాజ్యంపై రాష్ట్రపతికి ఫిర్యాదు

సుజనా వ్యాపార సామ్రాజ్యంపై రాష్ట్రపతికి ఫిర్యాదు

వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయి రెడ్డి సెప్టెంబర్ 26 న ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్‌కు సుజనాపై ఒక లేఖ రాశారు . బిజెపి ఎంపి సుజనా చౌదరి వ్యాపార కార్యకలాపాలపై దర్యాప్తు కోరుతూ విజయసాయి రాసిన లేఖలో, విజయసాయి సుజనాను ఇంటర్నేషనల్ స్కామ్ స్టర్ గా పేర్కొన్నారు. ఇక ఆయన వ్యాపార కార్యాకలాపాలను గురించి వివరిస్తూ రాష్ట్రపతికి రాసిన లేఖలో విజయసాయి సుజనాచౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా 106 కంపెనీలకు ఓనర్ అని, ఎనిమిది కంపెనీలు మినహా మిగతావన్నీ పలు అక్రమ లావాదేవీలకు, మనీలాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలకు పాల్పడిన కంపెనీలేనని ఆరోపించారు.

 షెల్ కంపెనీలతో మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపణలు

షెల్ కంపెనీలతో మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపణలు

ఎనిమిది కంపెనీల పనితీరులో 50% వ్యాపారం భారతదేశంలోని షెల్ కంపెనీల ద్వారా జరుగుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. మరో 20% నుండి 25% సుజానా గ్రూప్ పరోక్షంగా నియంత్రించే విదేశీ షెల్ కంపెనీల నుండి ఉత్పత్తి అవుతుందని లేఖలోపేర్కొన్నారు. ఇక సుజనా అండ్ గ్యాంగ్ కు నకిలీ బిల్లులు, పుస్తకాలు మరియు బ్యాంక్ ట్రయల్స్ రూపొందించడంలో పాలుపంచుకున్న డజన్ల కొద్దీ అకౌంటింగ్ , ఫైనాన్స్ నిపుణులు హైదరాబాద్‌లో ఉన్న నాలుగైదు కార్యాలయాల్లో పనిచేస్తున్నట్లు విజయసాయి ఆరోపించారు.

ఈడీ, సీబీఐ దర్యాప్తు చెయ్యాలని కోరిన విజయసాయి... స్పందించిన సుజనా

ఈడీ, సీబీఐ దర్యాప్తు చెయ్యాలని కోరిన విజయసాయి... స్పందించిన సుజనా

బిజెపి ఎంపి సుజనా చౌదరి కార్యకలాపాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిబిఐ దర్యాప్తు చెయ్యాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఈ విషయాన్నీ డిసెంబర్ 16 నాటికి హోం మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. పరిశీలిస్తున్నట్టు తెలిపింది. అయితే సుజనా చౌదరి విజయసాయి లేఖ విషయంలో స్పందిస్తూ దేశంలో ఏ పౌరుడు రాష్ట్రపతికి లేఖ రాసినా.. రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత మంత్రిత్వశాఖకు పంపుతుంది అని తెలిపారు. అలాగే విజయసాయిరెడ్డి రాసిన లేఖ కూడా హోంమంత్రిత్వశాఖకు చేరిందని అందులో వింతేం లేదని చెప్పుకొచ్చారు.

విజయసాయిది చిల్లర ప్రయత్నం అన్న సుజనా .. సుజనాకు ఉచ్చు బిగుస్తుందా?

విజయసాయిది చిల్లర ప్రయత్నం అన్న సుజనా .. సుజనాకు ఉచ్చు బిగుస్తుందా?


తన రాజకీయ, వ్యాపార జీవితం తెరిచిన పుస్తకమని.. రాష్ట్రపతికి రాసిన లేఖకు వచ్చిన ఎక్నాలెడ్జ్ మెంట్‌ను పట్టుకుని తన ప్రతిష్టను దిగజార్చడానికి విజయసాయిరెడ్డి చిల్లర ప్రయత్నం చేస్తున్నారని సుజనా విజయసాయి మీద విమర్శలు గుప్పించారు .అయితే సుజనాపై విజయసాయి లేఖకు స్పందిస్తూ నవంబర్ 6 న, రాష్ట్రపతి సచివాలయం తదుపరి చర్యల కోసం హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. డిసెంబర్ 16 న, హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం తదుపరి చర్యల కోసం రెవెన్యూ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆదేశాలు పంపారు. దీంతో సీబీఐ రంగంలోకి దిగుతుందా? సుజనాకు ఉచ్చు బిగుస్తుందా? అన్న చర్చ జోరుగా సాగుతుంది.

English summary
YSRCP parliamentarian Vijayasayara Reddy wrote a letter to the President as Sujana Chaudhary Target. Based on his letter, the Home Ministry is focusing on money laundering and fraud committed by BJP's Rajya Sabha MP Sujana Choudhary. He has been accused of money laundering while in TDP. It is in this context that the Union Home Department has started considering the letter of Vijay Sai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X