వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి ఎఫెక్ట్: 'సినిమా-పాలిట్రిక్స్'-పవన్ కళ్యాణ్‌కు వారసత్వంపై మాట్లాడే హక్కు ఉందా?

|
Google Oneindia TeluguNews

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార టీడీపీపై, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తున్నారు.

<strong>తమ్ముడు లోకేష్, జగన్ ఫ్యాక్షనిస్ట్!: 'బాబును అధికారంలోకి తెచ్చేందుకు మళ్లీ పవన్ డ్రామాలు'</strong>తమ్ముడు లోకేష్, జగన్ ఫ్యాక్షనిస్ట్!: 'బాబును అధికారంలోకి తెచ్చేందుకు మళ్లీ పవన్ డ్రామాలు'

ఎన్నికలు సమీపిస్తున్నందున పవన్ జోరుగా పర్యటిస్తున్నారు. జనసేనకు ఇప్పటి వరకు పటిష్టమైన నిర్మాణం లేకపోయినప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు జనసేన గట్టి పోటీని ఇస్తుందనే ఉద్దేశ్యాన్ని తన పర్యటనలు, వ్యాఖ్యల ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. పార్టీ శ్రేణుల్లో, అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

చిరంజీవి వారసుడిగా వచ్చాడంటూ వైసీపీ, టీడీపీ ఎదురుదాడి

చిరంజీవి వారసుడిగా వచ్చాడంటూ వైసీపీ, టీడీపీ ఎదురుదాడి

పవన్ కళ్యాణ్.. చంద్రబాబుపై విమర్శలు చేస్తే టీడీపీ నేతలు, జగన్‌ను టార్గెట్ చేస్తే వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు, టీడీపీ, వైసీపీ నేతల ఎదురుదాడి చర్చనీయాంశంగా మారింది. నారా లోకేష్, జగన్ వంటి వారి వారసత్వ రాజకీయాలపై జనసేనాని మాట్లాడారు. అయితే అందుకు వైసీపీ, టీడీపీ నేతలు పవన్ కూడా సినిమాల్లోకి చిరంజీవి వారసుడిగానే వచ్చారని చెబుతున్నారు.

రెండింట్లోని వారసత్వానికి తేడా గుర్తించాలి

రెండింట్లోని వారసత్వానికి తేడా గుర్తించాలి

కానీ సినిమాల్లో వారసత్వానికి, రాజకీయాల్లోని వారసత్వానికి తేడా గుర్తించాలని కొందరి వాదనగా ఉంది. రాజకీయాలు ప్రజలకు సంబంధించినవి కాగా, సినిమాలు వినోదానికి సంబంధించిన అంశాలు అనే విషయం గుర్తించాలని అంటున్నారు. రాజకీయాల్లో వారసులు నిరూపించుకోలేకపోయినా వేరే దారులు ఉంటాయని, సినిమాల్లో అందుకు భిన్నంగా ఉంటుందని అంటున్నారు. వారసత్వంగా వస్తే అభిమానులు మహా అయితే ఒకటి రెండు సినిమాలు ఆదరిస్తారని, ఆ తర్వాత సత్తా ఉంటేనే ఆదరిస్తారని చెబుతున్నారు.

రాజకీయ వారసత్వానికి, సినిమా వారసత్వానికి లంకె ఎలా?

రాజకీయ వారసత్వానికి, సినిమా వారసత్వానికి లంకె ఎలా?

సినిమా అనేది వినోదం కాబట్టి వారసత్వంగా వచ్చిన వారి వల్ల సమాజానికి వచ్చే నష్టం బహుషా ఉండదని అంటున్నారు. కానీ రాజకీయాల్లో వారసత్వంగా వచ్చి, మంచి చేయకుంటే నష్టపోయేది ప్రజలని, కాబట్టి సినిమా వారసత్వానికి, రాజకీయ వారసత్వానికి లంకె పెట్టడం ఎలా కుదురుతుందనేది కొందరి వాదన.

టీడీపీ ప్రభుత్వం అవినీతిమయమంటూ విమర్శించినా..

టీడీపీ ప్రభుత్వం అవినీతిమయమంటూ విమర్శించినా..

పవన్ పలు సమయాల్లో జగన్‌నూ టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల ఫ్యాక్షన్ పాలిటిక్స్ తేవద్దని హెచ్చరించారు. దీనిపై వైసీపీ నేతలు స్పందిస్తూ.. చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడకుండా జగన్‌ను టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. కానీ పవన్ దాదాపు ప్రతి సభలో టీడీపీ అవినీతిపై, చంద్రబాబు, లోకేష్‌లపై నిప్పులు చెరుగుతున్నారు. మొత్తంగా చంద్రబాబుపై మాట్లాడితే టీడీపీ నేతలు, జగన్‌ను అంటే వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారని, పవన్ వాస్తవం మాట్లాడినా ఒక్క మాట పడనీయడం లేదని జనసైనికులు అంటున్నారు. అవినీతి ఆరోపణలు చేస్తూ లోకేష్‌ను తమ్ముడు అని పిలిచినా వైసీపీ తప్పుబట్టడం గమనార్హమని అంటున్నారు.

కేంద్రాన్ని నిలదీద్దామని పవన్ సవాల్

కేంద్రాన్ని నిలదీద్దామని పవన్ సవాల్

పవన్ కళ్యాణ్ టీడీపీతో పాటు వైసీపీ, బీజేపీలపై కూడా సందర్భం వచ్చినప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. కానీ ఏపీలో టీడీపీ అధికారంలో ఉండటంతో దానినే ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు. ఇటీవల టీడీపీని ఉద్దేశించి అవినీతి, అక్రమాలు చేస్తే తాట తీస్తామని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఏపీకి హోదా కోసం కేంద్రాన్ని నిలదీద్దాం రావాలని, ఢిల్లీలో మోడీని ప్రశ్నించడానికి కూడా తాను సిద్ధమని ప్రకటించారు. కానీ టీడీపీ నేతలు మాత్రం బీజేపీని తాటతీస్తామని పవన్ అనలేదేమిటని అంటున్నారు. కానీ కేంద్రాన్ని నిలదీద్దాం ఢిల్లీకి వెళ్దామా అంటే సమాధానం లేదని గుర్తు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రశ్న, టీడీపీ వద్ద సమాధానం లేదా?

పవన్ కళ్యాణ్ ప్రశ్న, టీడీపీ వద్ద సమాధానం లేదా?

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి హామీ లేదు. కానీ నాలుగేళ్లు టీడీపీ ఎన్డీయేలో ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చి, ఆ తర్వాత హోదా గురించి ప్రశ్నిస్తోంది.. సభలు పెడుతోంది. కానీ అంతకుముందు నుంచే పవన్, జగన్‌లు ప్రత్యేక హోదాపై నిలదీస్తున్నారు. అప్పుడు టీడీపీ మాట మరోలా ఉంది. తాము హోదాపై లేవనెత్తినప్పుడు టీడీపీ ఏం చేసిందో తెలుసుననే పవన్ ఘాటు ప్రశ్నకు టీడీపీ వద్ద సమాధానం లేదని అంటున్నారు.

చిరంజీవి వారసుడిగా వచ్చినా, ఇక్కడ మాత్రం వేరు

చిరంజీవి వారసుడిగా వచ్చినా, ఇక్కడ మాత్రం వేరు

ఇక, పవన్ వారసత్వం గురించి చూస్తే.. చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తనను తాను నిరూపించుకున్నారని జనసైనికులు అంటున్నారు. ఇక, రాజకీయాల్లో చూస్తే చంద్రబాబు వారసుడిగా లోకేష్, వైయస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్ కొత్త పార్టీ పెట్టుకున్నారని, కానీ పవన్ రాజకీయాల కోసం చిరంజీవి పేరును ఉపయోగించుకోవడం లేదని అభిమానులు అంటున్నారు. మరోవైపు, చిరంజీవి రాజకీయాల నుంచి దాదాపు కనుమరుగవుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి దూసుకెళ్తున్నారని అంటున్నారు. కాబట్టి రాజకీయాల్లో ఆయన వారసుడిగా చెప్పలేరని అంటున్నారు. ప్రజలకు సేవ చేసే రాజకీయాలకు, వినోదం అందించే సినిమాల వారసత్వానికి చాలా తేడా ఉంటుందనేది పలువురి వాదన.

English summary
Difference between Political Inheritance and Cinema Inheritance. Why YSRCP and TDP targetting Pawan Kalyan over Cinema Inheritance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X