కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజమే: భూమా అఖిల ప్రియపై విరుచుకుపడిన ఏవి సుబ్బారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియతో తనకు విభేదాలున్న మాట వాస్తవమేనని భూమా నాగిరెడ్డి సన్నిహిత మిత్రుడు, ఎపిఆర్ఐసి మాజీ చైర్మన్ ఎవీ సుబ్బారెడ్డి చెప్పారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

Recommended Video

జైట్లీ, గడ్కరీలకు చంద్రబాబు లేఖ

భూమా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభలో గుంటనక్కలు తనను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నాయని అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలపై ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో స్పందించారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదననెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా...

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా...

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునే ప్రసక్తి లేదని ఎవి సుబ్బారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో టిడిపిని బలోపేతం చేసేందుకు, చంద్రబాబు, నారా లోకేష్ నాయకత్వాలను పటిష్టపరిచేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆళ్లగడ్డలో ఈ నెల 29వ తేదీన ఎవీ హెల్ప్ లైన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

గుంటనక్కల గుట్టు విప్పుతా...

గుంటనక్కల గుట్టు విప్పుతా...

ఆ రోజు అన్ని విషయాలపై స్పష్టత ఇస్తానని, గుంటనక్కల గుట్టు విప్పుతానని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీని వీడే సమస్య లేదని అన్నారు. భూమా వర్ధంతి సభకు తనకు పిలుపు రాలేదని ఆయన అఖిలప్రియపై మండిపడ్డారు. ముఖ్యమంత్రితో తనకు సత్సంబంధాలున్నాయని చెప్పారు. తనకు ఏ పదవి ఇవ్వాలో ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని చెప్పారు.

ఆ తర్వాత విభేదాలు...

ఆ తర్వాత విభేదాలు...

భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు పెరిగాయి. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డిని కలుపుకుని పనిచేయాలని చంద్రబాబు అఖిలప్రియను ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం నంద్యాలలో పార్టీ కార్యకర్తలు, నేతలతో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ హాజరయ్యారు. కానీ అఖిలప్రియ డుమ్మా కొట్టారు.

భూమాకు ఏవి అత్యంత సన్నిహితుడు

భూమాకు ఏవి అత్యంత సన్నిహితుడు

భూమా నాగిరెడ్డికి, ఏవి సుబ్బారెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసినవే. ఒకరికి తెలియకుండా మరొకరు ఎటువంటి వ్యవహారాలు కూడా నడిపేవారు కారు. భూమా మరణం తర్వాత ఆ కుటుంబంతో ఏవి సుబ్బారెడ్డి సంబంధాలు దెబ్బ తిన్నాయి.

English summary
The Telugu Desam party leader AV Subba Reddy agreed that he was having differences with Andhra Pradesh minister Bhuma Akhila Priya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X