ఓ వైపు బాబు, మరోవైపు..: పాదయాత్రకు ముందు జగన్‌కు కొత్త తలనొప్పి

వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రకు ముందు తలనొప్పులు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే జగన్ పాదయాత్ర రోజే ఆయనకు గట్టి షాకివ్వాలని టీడీపీ చూస్తోంది.

అనకాపల్లి: వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రకు ముందు తలనొప్పులు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే జగన్ పాదయాత్ర రోజే ఆయనకు గట్టి షాకివ్వాలని టీడీపీ చూస్తోంది. 22 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు.

Recommended Video

    శ్రీవారిని దర్శించుకున్న జగన్:మళ్లీ వివాదం ! ఎందుకంటే? | Oneindia Telugu

    మరికొంతమంది నేతలు పాదయాత్ర ప్రారంభమయ్యే ఈ నెల 6న టీడీపీలో చేరాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తద్వారా జగన్, వైసీపీ మానసికస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని తెలుస్తోంది. టీడీపీ ప్లాన్ అలా ఉంటే, పార్టీలోని విభేదాలు ఆయనకు మరో చిక్కు తెచ్చి పెడుతున్నాయని తెలుస్తోంది.

    వేర్వేరుగా ప్రజా సంకల్ప యాత్ర కార్యక్రమం

    వేర్వేరుగా ప్రజా సంకల్ప యాత్ర కార్యక్రమం

    జగన్ ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆ పార్టీ నాయకులు శనివారం అనకాపల్లిలో చేపట్టిన కార్యక్రమాలలో పార్టీలో ఉన్న వర్గ విభేదాలు బయటపడ్డాయి. అనకాపల్లిలో పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయి కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహించాయి.

     కాంగ్రెస్ నుంచి ఓ నేత చేరినప్పుడు విభేదాలు

    కాంగ్రెస్ నుంచి ఓ నేత చేరినప్పుడు విభేదాలు

    కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ దిలీప్ కుమార్ వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి అనకాపల్లి పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన అమర్‌కు అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. దిలీప్ కుమార్ పార్టీలో చేరినప్పుడు అమర్ నుంచి సరైన పిలుపు రాకపోవడంతో పట్టణ అధ్యక్షులు జానకిరామరాజు వర్గం దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి.

    కేడర్ ఆందోళన

    కేడర్ ఆందోళన

    ఇప్పుడు జగన్ తలపెట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని నాయకులు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం గమనార్హం. జానకిరామరాజు ఆధ్వర్యంలో ఓ వర్గం, పార్టీ పట్టణ యువజన విభాగం ఆధ్వర్యంలో మరో వర్గం ఆలయాల్లో వేర్వేరుగా పూజలు చేసి, ర్యాలీలు నిర్వహించారట. ఇలా గ్రూపులు గ్రూపులు విడిపోవడంపై కేడర్ ఆందోళన చెందుతోందట.

    గ్రూపులుగ్రూపులుగా

    గ్రూపులుగ్రూపులుగా


    అయితే అమర్ వీరి కార్యక్రమాలకు మద్దతు ప్రకటించారని, కానీ సమన్వయం చేయలేకపోయారని అంటున్నారని ప్రచారం సాగుతోంది. పాదయాత్రకు ముందు ఇలా గ్రూపులు గ్రూపులుగా ఉంటే నష్టం జరుగుతుందని కేడర్ ఆందోళనగా ఉందట.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+