వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీకి వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే షాక్, కారణం ఇదే! అధినేత డోంట్ కేర్!!

By Srinivas
|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గం ఆధిపత్యం కొనసాగుతుండటంతో ఎమ్మెల్యే జయరాములు రాజీనామాకు సిద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. జయరాములు 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే మొదటి నుంచి టీడీపీలో ఉన్న సీనియర్ల ఆధిపత్య ధోరణిని ఆయన తట్టుకోలేకపోతున్నారట.

కర్నాటకలో బీజేపీ ఓడిపోవాలని నేనెందుకు చెప్తా!: సుజన షాకింగ్, టీడీపీని వీడటంపై..కర్నాటకలో బీజేపీ ఓడిపోవాలని నేనెందుకు చెప్తా!: సుజన షాకింగ్, టీడీపీని వీడటంపై..

తాను రాజీనామా చేస్తానని ఆయన చెప్పినప్పటికీ అధిష్టానం పట్టించుకోలేదని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ఇటీవల మారుతోన్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం గల్లా అరుణ కుమారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు జయరాములు అసంతృప్తితో ఉన్నారు.

 పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు

పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు

అంతకుముందు ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత సుబ్బారెడ్డి మధ్య విభేదాలు. పార్టీలో వరుస విభేదాలు చంద్రబాబుకు తలనొప్పిని తీసుకు వస్తున్నాయి. దీంతో ఆయన నేతలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు వెలుగు చూస్తున్నాయి.

 విజయమ్మ ఆధిపత్యం

విజయమ్మ ఆధిపత్యం

చాలాకాలంగా బద్వేల్ నియోజకవర్గంలో విజయమ్మదే ఆధిపత్యం. ఆ తర్వాత ఈ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ అయింది. దీంతో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై వైసీపీ నుంచి పోటీ చేసిన జయరాములు గెలిచారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. దీంతో టీడీపీలో ఇప్పుడు మూడు గ్రూపులు తయారయ్యాయని అంటున్నారు. సీనియర్ నేత విజయమ్మ, గత ఎన్నికల్లో పోటీ చేసిన విజయజ్యోతి, ఎమ్మెల్యే జయరాములుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

వైసీపీ నుంచి వచ్చిన జయరాములు

వైసీపీ నుంచి వచ్చిన జయరాములు

వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జయరాములు గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలో విజయమ్మ ఆధిపత్యం కనిపించడమే అందుకు కారణమని అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ పెద్దలు, మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేదని, అందుకే అప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారని అంటున్నారు.

రాజీనామా చేస్తానని హెచ్చరిక

రాజీనామా చేస్తానని హెచ్చరిక

దీంతో తాను రాజీనామా చేస్తానని జయరాములు చేస్తానని చెబుతున్నారట. రాజకీయంగా ఆయనకు అనుభవం లేకపోవడం వల్లే ఇతర టీడీపీ నేతల ఆధిపత్యం కొనసాగుతోందని భావిస్తున్నారట. ఈ కారణంగా ఆయన హెచ్చరికలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

English summary
Differences in Badvel Telugudesam. Differences between Vijayamma and Jayaramulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X