• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జనసేన-బీజేపీ ఎవరి దారి వారిదే..!! పవన్ అంతర్మధనం-నిర్ణయం దిశగా..!!

By Lekhaka
|

ఏపీలో పవన్ ముఖ్యమంత్రి అయినా అభ్యంతరం లేదు. 2024లో బీజేపీ-జనసేన అధికారంలోకి వస్తాయి. ఇవీ...తిరుపతి ఉప ఎన్నికల వరకూ పదే పదే బీజేపీ నేతలు చెప్పిన మాటలు. కానీ, ఇప్పుడు ఏదో తేడా కొడుతోంది. అమెరికాలో మొదలైన బీజేపీ-జనసేన పొత్తు వ్యవహారం ఢిల్లీలో ఫైనల్ అయింది. నాడ ఎన్నో ప్రమాణాలు చేసుకున్నారు. కానీ, అవేవీ ఆచరణకు నోచుకోలేదు. అమరావతిలో ఇద్దరి పొత్తు..భవిష్యత్ కార్యాచరణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సమక్షంలోనే ఇద్దరు పార్టీల నేతలు అనేక అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు.

 అమలు కాని నాటి ప్రమాణాలు..

అమలు కాని నాటి ప్రమాణాలు..

పంచాయితీ నుంచి పార్లమెంట్ దాకా కలిసి పోటీ చేయాలని..ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో కలిసి కట్టుగా సాగాలని నిర్ణయించారు. కానీ, ఈ ఏడాదిన్నార కాలంలో ఒక్క కార్యక్రమం సైతం రెండు పార్టీలు కలిపి నిర్వహించలేదు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ అసవరం ఉన్న సందర్భాల్లో ఒక విధంగా..లేకుంటే మరో విధంగా తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం జనసేనలో వ్యక్తం అవుతోంది. గ్రేటర్ బరిలోకి దిగద్దని బీజేపీ నేతలు పవన్ వద్దకు వచ్చి మరీ కోరారు. వెంటనే పవన్ కళ్యాణ్ అంగీకరించారు.

 పవన్ తో అవసరం ఉంటేనే..

పవన్ తో అవసరం ఉంటేనే..

అదే విధంగా పార్టీ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా..తిరుపతిలో పోటీకి బీజేపి ముందుకు రావటంతో పవన్ అంగీకరించక తప్పలేదు. ఆ సమయంలో పవన్ పైన బీజేపీ నేతలు ప్రశంసలు కురిపించారు. చివరకు వకీల్ సాబ్ థియేటర్ వద్దకు వెళ్లి మరీ ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. పవన్ అభిమానులను ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు. ఇక, ఆ తరువాత బీజేపీ రామతీర్దం మొదలు తాజాగా పోలవరం అంశంలో కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లే వరకు పవన్ ను కలుపుకొని పోలేదు. కనీసం సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.

ఎవరి దారి వారిదే..

ఎవరి దారి వారిదే..

జాబ్ క్యాలెండర్ నిరసనల విషయంలోనూ జనసేను పక్కన పెట్టి సొంతంగా ఆందోళన డిసైడ్ చేసింది. స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ విషయంలో పవన్ గతంలో ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు లేఖ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు కేంద్ర మంత్రులను కలిసి..స్థలాలు ఇచ్చిన వారికి న్యాయం చేయాలంటూ కోరారు. ఈ విషయంలోనూ జనసేనను కలుపుకొని పోలేదు. అదే విధంగా పవన్ కళ్యాణ్ సైతం జాబ్ క్యాలెండర్ విషయంలో సొంతగా నిరననలకు పిలుపు నిచ్చారు. రైతులకు బకాయిలు చెల్లింపు విషయంలో సొంతంగానే అజెండా సిద్దం చేస్తున్నారు.

  Pawan Kalyan The Real Trend Setter In Tollywood | #20YearsForClassicIHKushi || Oneindia Telugu
   తాజా తీరుపై జనసేనాని అంతర్మధనం..

  తాజా తీరుపై జనసేనాని అంతర్మధనం..

  ఇక, బీజేపీ తాజాగా ఏపీలోనూ మూడు ప్రాంతాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసింది. ఇలా..మూడు ప్రాంతాలుగా కమిటీలు ఏర్పాటు చేసుకోవటం బీజేపీ అంతర్గత అంశమే అయినా.. ప్రజల్లో ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని జనసేన భావిస్తోంది. తెలంగాణ బీజేపీ నేతల గురించి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు పవన్ ఓపెన్ గానే ఫైర్ అయ్యారు. జనసేన కేడర్ కు గౌదవం దక్కటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, తిరుపతి ఎన్నికల సమయంలో పవన్ వద్దకు వెళ్లి మరీ, సమావేశాలు నిర్వహించిన బీజేపీ నేతలు..ఇప్పుడు పూర్తిగా తమ కార్యాచరణ ప్రకారం ముందుకెళ్తున్నారు.

  దీంతో..వపన్ లో సైతం అంతర్మధనం మొదలైందని జనసేనలో చర్చ సాగుతోంది. మరి కొద్ది రోజులు ఇలాగే బీజేపీ నేతలు ఏకపక్షంగా వ్యవహిరిస్తూ..మైత్రిని విస్మరిస్తే.. పవన్ కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇక, ఢిల్లీ బీజేపీ నేతల నుంచి మిత్రపక్ష పార్టీగా జనసేనకు గుర్తింపు దక్కటం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో జనసేన - బీజేపీ మైత్రి ఏపీలో నామ్ కే వాస్తే అన్నట్లుగా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

  English summary
  Alliance between BJP and Janasena seem to have come to an end. Both parties are travelling on different paths, with out common platform.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X