• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య విబేధాలు .. ఆర్టీసీ విలీనం పెట్టిన పంచాయితీ

|

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్-జగన్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తాజా పరిణామాలు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. వారిరువురి మధ్య దూరం పెరిగినట్లు అధికార వర్గాలలోనూ చర్చ సాగుతుంది. తాజాగా నదుల అనుసంధానం విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలే ఇందుకు తార్కాణం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

 కేసీఆర్ కుటుంబ సినిమాలు తప్ప... ఇతర సినిమాలు అవసరం లేదా.. ? కేసీఆర్ కుటుంబ సినిమాలు తప్ప... ఇతర సినిమాలు అవసరం లేదా.. ?

నిన్నటి దాకా దోస్త్ మేరా దోస్త్ అన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

నిన్నటి దాకా దోస్త్ మేరా దోస్త్ అన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఏపీలో గత ఎన్నికల ముందు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బాసటగా నిలిచి, చంద్రబాబుపై సమరశంఖం పూరించిన కెసిఆర్, ఎన్నికల ఫలితాల తర్వాత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో దోస్తీ ప్రారంభించారు. ఇద్దరూ కలిసి పలుమార్లు భేటీ అయి ఇరు రాష్ట్రాల అభివృద్ధి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భావించి, రెండు రాష్ట్రాల సాగునీటి తాగునీటి అవసరాలను సంయుక్తంగా నెరవేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించారు.

ఏపీలో ఆర్టీసీ విలీన నిర్ణయంతో తెలంగాణాలో రచ్చ

ఏపీలో ఆర్టీసీ విలీన నిర్ణయంతో తెలంగాణాలో రచ్చ


అయితే అదలా కొనసాగుతుండగానే ఆర్టీసీని విలీనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో మంటలు రాజేసింది. ఏపీలో ఆర్టీసీని కాపాడడం కోసం ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయం తరహా నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో సైతం తీసుకోవాలని ఆర్టీసీ కార్మికుల ఆందోళన బాట పట్టారు. విలీనం ప్రధాన డిమాండ్ గా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేయడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇరకాటంలో పడ్డారు.

ఆర్టీసీ విలీనంపై జగన్ పై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ .. నదుల అనుసంధానంపై ఏపీ కీలక నిర్ణయం

ఆర్టీసీ విలీనంపై జగన్ పై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ .. నదుల అనుసంధానంపై ఏపీ కీలక నిర్ణయం

దీంతో ఆయన ఏపీలో ఆర్టీసి విలీనం పై తీసుకున్న నిర్ణయంపై తనదైన శైలిలో మాట్లాడారు. అది ఆరు నెలల తర్వాత ముచ్చట, జరిగినప్పుడు చూద్దాం అన్నట్లుగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీ వర్గాలకు ఏమాత్రం రుచించలేదు.ఇక దీనిపై జగన్ ఏం వ్యాఖ్యలు చెయ్యకున్నా కేసీఆర్ తో జాగ్రత్తగా వుండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అంతే కాదు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తో కలిసి సాగటం భవిష్యత్తులో ఇబ్బందికర పరిణామాలకు కారణం అవుతుందని భావించి నదుల అనుసంధానం విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది.తెలంగాణాతో కలిసి సాగబోమని నిర్ణయం తీసుకుంది.

జగన్ నిర్ణయాలతో కేసీఆర్ కు ఇబ్బంది ... పెరిగిన గ్యాప్

జగన్ నిర్ణయాలతో కేసీఆర్ కు ఇబ్బంది ... పెరిగిన గ్యాప్

ఇటీవల జగన్ తీసుకున్న నిర్ణయాలు కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారాయని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో ఇద్దరి మధ్య సఖ్యత కొరవడిందని చాలా క్లియర్ గా తెలుస్తుంది. జగన్ ఏపీ సీఎం అయ్యాక.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మంచి సత్సంబంధాలు నెలకొన్నాయి. సీఎం కేసీఆర్ ఏపీ కి వెళ్లడం, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ని కలవడానికి రావడం ఇలా ఒకరికొకరు స్నేహబంధంతో ముందుకు సాగాలి అనుకున్న సీఎంలు ఒక్కసారిగా రూటు మార్చారు.

  TSRTC Samme : ఆర్టీసీ కార్మికులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు..! || Oneindia Telugu
  తాజా నిర్ణయాలతో విబేధాలు సుస్పష్టం .. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో?

  తాజా నిర్ణయాలతో విబేధాలు సుస్పష్టం .. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో?

  అయితే ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారినట్లుగా తెలుస్తోంది. అలాగే కొంతమంది తెలంగాణ అధికారులను అనధికారికంగా తీసుకోవడంపై కూడా కేసీఆర్‌కు కోపం వచ్చినట్లుగా తెలుస్తుంది. పలు కారణాల చేత ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య స్నేహం దెబ్బతిన్నట్లుగా అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి . ఏది ఏమైనా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ప్రస్తుతం ఏర్పడిన విభేదాలు ఇలాగే కొనసాగుతాయి. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారిం

  English summary
  Differences between Chief Ministers of Telugu states KCR and Jagan have sprung up. The latest developments make that point clear. There has also been talk in the official circles that the distance between the two has increased. It is the opinion of the chief ministers of the two states that the latest rivers connectivity decision.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X