విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఐఏఎస్ అధికారులే టీడీపీని భ్రష్టు పట్టించారు: మహానాడు సాక్షిగా బయటపడ్డ విబేధాలు

|
Google Oneindia TeluguNews

టీడీపీ సొంత పండగ మహానాడు సాక్షిగా తెలుగు తమ్ముళ్ల మధ్య విబేధాలు బయటపడ్డాయి. తొలిసారిగా టెక్నాలజీ వినియోగించి మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ గ్రాండ్‌గా నిర్వహిస్తోంది. జూమ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న ఈ వేడుకలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన తప్పిదాలను శాప్ మాజీ ఛైర్మెన్ పీఆర్ మోహన్ ప్రస్తావించారు. చంద్రబాబు పక్కన ఉండేవాళ్లే ఆయన్ను తప్పుదోవ పట్టించారంటూ ప్రతి ఒక్కరి పేర్లను ఈ సందర్భంగా ఆయన బహిరంగంగా ప్రస్తావించారు.

మహానాడు వేళ టీడీపీకి భారీ షాక్: ఏడుగురు ఎమ్మెల్యేలు జంప్: జగన్ తో భేటీ..ముహూర్తం ఖరారు..!మహానాడు వేళ టీడీపీకి భారీ షాక్: ఏడుగురు ఎమ్మెల్యేలు జంప్: జగన్ తో భేటీ..ముహూర్తం ఖరారు..!

చంద్రబాబు చుట్టున్న వారే...

చంద్రబాబు చుట్టున్న వారే...

తాను ఒకప్పుడు బాగానే బతికినట్లు చెప్పిన పీఆర్ మోహన్ పార్టీ కోసం సర్వం ధారపోశానని ఇప్పుడు అప్పుల పాలైనట్లు చెప్పారు. అయినా సరే పార్టీ మీద ప్రేమ మమకారంతో ఇంకా పనిచేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు తనకు శాప్ ఛైర్మెన్ పదవి ఇచ్చి గౌరవించారని అయితే ఆ తర్వాత ఇచ్చే జీవోలు లేదా రావాల్సిన జీవోలను చంద్రబాబు చుట్టూ ఉండే వారే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆప్తుడైన సతీష్ చంద్ర, రాజమౌళి, పీఎస్ శ్రీనివాస్ ప్రద్యుమ్న వంటి వారు జీవోలను అడ్డుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు పీఆర్ మోహన్. చంద్రబాబును కార్యకర్తలు కలవాలంటే సతీష్ చంద్ర అడ్డుకునేవారని అధినేత దృష్టికి తీసుకొచ్చారు. అప్పటి చంద్రబాబు చుట్టూ ఉన్న ఆఫీసర్లే టీడీపీని నాశనం చేశారని మండిపడ్డారు. 2019లో చంద్రబాబు దగ్గరకు రావాలని ప్రయత్నించగా పోలీసులు లాగిపడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు పీఆర్ మోహన్.

చంద్రబాబును కార్యకర్తలకు దూరం చేశారు

చంద్రబాబును కార్యకర్తలకు దూరం చేశారు


చంద్రబాబును కార్యకర్తలకు దూరం చేసింది అధికారులే అని చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ఆ విగ్రహానికి పూజలు చేయాలన్నా, టెంకాయ కొట్టాలన్న సామాన్య కార్యకర్తలు అప్పులు పాలవుతున్నారని ధ్వజమెత్తారు. డబ్బులు సంపాదించుకున్న నేతలు మాత్రం ఖర్చు చేసేందుకు వెనకాడుతున్నారు. పాదయాత్రలో చంద్రబాబుతో పాటు తిరిగిన వారికి పదవులు రాలేదని చెప్పారు. నియోజకవర్గ ఇంఛార్జులు వద్దని కమిటీలు వేయాలని ఈ సందర్భంగా పీఆర్ సూచించారు. నియోజకవర్గపు ఇంఛార్జీలు నియంతలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అంతా తమ సామ్రాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పీఆర్ మోహన్ ధ్వజమెత్తారు.

 కార్యకర్తలను నేతలు విస్మరించారు: చినరాజప్ప

కార్యకర్తలను నేతలు విస్మరించారు: చినరాజప్ప

ఇదిలా ఉంటే మాజీ మంత్రి చినరాజప్ప పార్టీ సంస్థాగత తీరు తెన్నులపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చినరాజప్ప పలువురు పార్టీ నేతల తీరును తప్పుబట్టారు. కార్యకర్తల బాగోగులను చూసుకోవాలని చంద్రబాబు చెప్పినప్పటికీ ఎవరూ వారిని పట్టించుకోలేదని అందుకే వారు సైలెంట్ అయిపోవడంతో పార్టీ ఓడిపోయిందని చెప్పారు. పార్టీ అధికారం కోల్పోగానే కొందరు నేతలు వెళ్లిపోయారని చెప్పిన చినరాజప్ప వారినెవరినీ తిరిగి పార్టీలోకి తీసుకోమని తేల్చేశారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిలు సీఎం జగన్‌ను కలిశారు. వీరిగురించి చినరాజప్ప ప్రస్తావించారు.

 బాగా పనిచేస్తున్నవారికి ప్రమోషన్స్ ఎక్కడ..?

బాగా పనిచేస్తున్నవారికి ప్రమోషన్స్ ఎక్కడ..?

పార్టీ మారిన వారంతా కనుమరుగయ్యారని గుర్తు చేసిన చినరాజప్ప వైసీపీ తీర్థం పుచ్చుకున్న జూపూడి ప్రభాకర్, కారెం శివాజీలు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారని ప్రభుత్వంలో ఉంటేనే మాట్లాడతారా లేకుంటే వాయిస్ వినిపించరా అని ప్రశ్నించారు. కొందరు నేతల తీరు సరిగ్గా లేదని చెప్పిన చినరాజప్ప మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. బాగా పనిచేస్తున్న వాళ్లను చంద్రబాబు ప్రమోట్ చేయాలని చినరాజప్ప కోరారు. అదే సమయంలో ఎవరు పనిచేస్తున్నారో ఎవరు పనిచేయడం లేదో చంద్రబాబు చూస్తూ ఉండాలని కోరారు. ఎప్పటికీ పార్టీ బలం కార్యకర్తలే అని చెప్పిన చినరాజప్ప పదవుల్లో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా ఉండటం మంచిదికాదని హితవు పలికారు.

English summary
The differnces in TDP surfaced amid the ongoing Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X