గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రక్తమోడిన రహదారులు: 9మంది మృతి, 30మందికి గాయాలు

గుంటూరు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరపురంలో ఆటో బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతిచెందారు. సుమారు 20మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను గురజాల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన మరిన్ని వ

|
Google Oneindia TeluguNews

గుంటూరు: జిల్లాలోని గురజాల మండలం జంగమహేశ్వరపురంలో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతిచెందగా, సుమారు 20మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను గురజాల ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డు మార్గం సరిగా లేని కారణంగా ఆటో బోల్తా పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, సహాయక చర్యలను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు.

ట్రాక్టర్‌ బోల్తా: ముగ్గురు కూలీలు మృతి

different road accidents: 9 killed

ప్రకాశం జిల్లా కంభం మండలంలోని తురిమెళ్ల వెళ్లే మార్గంలోని కంభం, పోరుమామిళ్ల గ్రామాల మధ్య మూలమలుపులో ట్రాక్టర్‌ బోల్తాపడి ముగ్గురు కూలీలు మృతిచెందారు. పది మందికిపైగా కూలీలు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న కంభం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతులను, క్షతగాత్రులను కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జంగంగుంట్లకు గ్రామానికి చెందిన 25మంది కూలీలు తురిమెళ్ల గ్రామం వద్ద పొగాకు ఆకులు కోసుకుని ట్రాక్టర్‌లో జంగగుంట్లకు వస్తుండగా మలుపు వద్ద ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కిందపడ్డ కూలీలపై పొగాకు పడింది.

దీంతో ఊపిరి ఆడక ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను సన్నపురెడి పోలల్‌రెడ్డి(40), కొందూరి నాగేంద్ర(35), దాసరి శ్రీరాములు(40)గా గుర్తించారు. మిగిలిన కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామానాయక్‌ తెలపారు.

English summary
Nine persons died and 25 more others were injured in two different places accidents on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X