వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీలో విచిత్ర సిద్దాంతం, అదే సామాజికవర్గ నేతలతో.. బతిమిలాడితేనే పార్టీలో చేరా: రఘురామకృష్ణంరాజు

|
Google Oneindia TeluguNews

వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు డిఫరెంట్.. హైకమాండ్‌పై అసంతృప్తి ఎందకు తెలియదు, కానీ బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రసాదరాజు.. రఘురామపై ఫైరయ్యారు. సీఎం జగన్ దయతోనే రఘురామ ఎంపీ అయ్యారని, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అయ్యారని మండిపడ్డారు. దీనికి రఘురామ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేపై తనదైనశైలిలో సెటైర్లు వేశారు. పనిలోపనిగా.. వైసీపీలో విచిత్ర సాంప్రదాయం ఉంది అని కూడా వివరించారు.

సొంత పార్టీ నేతల నుంచి..

సొంత పార్టీ నేతల నుంచి..

ఇటీవల రఘురామ కృష్ణంరాజు తమ ప్రభుత్వంలో జరుగుతోన్న పనులను ప్రస్తావిస్తున్నారు. తిరుపతి వెంకన్న భూముల వేలం, ఇసుక మాఫియా అక్రమాలు, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీలో అక్రమాలు, భూముల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. విషయాన్ని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్తుంటే.. సొంత పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ప్రసాదరాజు.. తీవ్రంగానే కామెంట్ చేశారు.

సిద్దాంతం ఇదీ..

సిద్దాంతం ఇదీ..

వైసీపీలో విచిత్రమైన సిద్దాంతం అమల్లో ఉంది అని రఘురామ తెలిపారు. ఇతర పార్టీ నేతలపై విరుచుకుపడాలంటే.. ఆ సామాజిక వర్గం నేతలతోనే తిట్టిస్తారని తెలిపారు. ఉదహరణకు పవన్ కల్యాణ్‌పై కామెంట్ చేయాలంటే.. కాపు సామాజికవర్గం నేతలతో మాట్లాడిస్తారని చెప్పారు. కానీ అదే సొంత పార్టీ నేతలపై కూడా అలాగే వ్యవహరిస్తున్నారని తెలిపారు. తనపై నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుతో కామెంట్ చేయించడాన్ని ఉదహరించారు. తానేం తప్పు చేశానని.. జరుగుతోన్న తప్పులను ఎత్తిచూపితే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు.

పిలిస్తేనే వచ్చా..

పిలిస్తేనే వచ్చా..

తనంతట తాను వైసీపీలోకి రాలేదని రఘురామ వెల్లడించారు. జగన్ ఫోన్ చేసి రావాలని కోరితే వచ్చానని చెప్పారు. టికెట్ ఇవ్వాలని తాను కోరలేదు అని చెప్పారు. వాస్తవానికి నరసాపురంలో టీడీపీ బలంగా ఉంది అని.. తాను తప్పు మిగతా ఎవరైనా వైసీపీ నుంచి పోటీ చేస్తే గెలిచేవారు కాదన్నారు. జగన్ బొమ్మతో ఎమ్మెల్యేలు గెలిచామని చెప్పొచ్చు.. కానీ నరసాపురం ఎంపీ పరిధిలో గల నియోజకవర్గాలకు తన పేరుతో కూడా ఓట్లు పడ్డాయని చెప్పారు. తన ఇమేజీతో ఎమ్మెల్యేలకు ఓటు బ్యాంకు వచ్చిందన్నారు. పార్టీలోకి రావాలి.. అలా అయితే తమ సీట్లు పెరుగుతాయని బతిమిలాడితేనే వైసీపీలో చేరానని పేర్కొన్నారు.

Recommended Video

AP Assembly Budget Sessions Guidelines ఇలాంటి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడూ చూసుండరు ?
ఇదివరకు కూడా..

ఇదివరకు కూడా..


గతంలోనూ వైసీపీలోకి రావాలని ఆహ్వానం పంపించారని రఘురామ తెలిపారు. కానీ ఎన్నికల ముందు మాత్రమే పార్టీలో చేరానన్నారు. వారు బతిమిలాడి రమ్మంటేనే వచ్చానే తప్పా.. తనకుతానుగా రాలేదని చెప్పారు. తనపై కామెంట్లు చేస్తున్న ప్రసాదరాజుకు ప్రమోషన్ గ్యారంటీ అని సెటైర్లు వేశారు. త్వరలో మంత్రి కాబోతున్నారని ఎత్తిపొడిచారు.

English summary
different strategy in ysrcp in andhra pradesh politics. in party same caste leaders are scolding others ycp mp raghu rama krishnam raju alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X