వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ డిగ్రీపై నాగబాబుదో వెర్షన్ .. పవన్ ది మరో వెర్షన్ .. ఇప్పుడు ఏపీలో ఇదో చర్చ

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలు ఏం చదువుకున్నాడు ? పవన్ కళ్యాణ్ తన చదువు గురించి చెప్పిన దానికి , నాగబాబు చెప్పిన దానికి పొంతన లేకపోవటంతో ఇప్పుడు ఏపీ ప్రజలు పవన్ విద్యాభ్యాసంపై పెద్ద చర్చ పెడుతున్నారు. అటు పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల ప్రచార సభల్లో ఒక్కో సభలో ఒక్కో రకంగా చెప్పటం , ఎన్నికల అఫిడవిట్ లో పదో తరగతి అని పేర్కొనటం వెరసి ఇప్పుడు పవన్ చదువుపై పెద్ద దుమారమే లేచింది.

ఎన్నికల ఫలితాలపై పవన్ స్పందించారు .. ఏమన్నారంటే ఎన్నికల ఫలితాలపై పవన్ స్పందించారు .. ఏమన్నారంటే

 పవన్ కళ్యాణ్ ఐటి డిగ్రీ హోల్డర్ అన్న నాగబాబు

పవన్ కళ్యాణ్ ఐటి డిగ్రీ హోల్డర్ అన్న నాగబాబు

తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిగ్రీపై సినీ నటుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . పవన్ కళ్యాణ్ ఐటి డిగ్రీ హోల్డర్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలతో వాటికి పొంతన లేకపోవటంతో ఇప్పుడు దీనిపై చర్చ జరుగుతుంది .

తన యూట్యూబ్ ఛానల్ లో నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

తన యూట్యూబ్ ఛానల్ లో నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంటర్ విద్యార్థులు చదువు కోసం ఆత్మహత్యలకు పాల్పడటంపై తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా విద్యార్థులకు, వారి తల్లి దండ్రులకు నాగబాబు ఓ సందేశాన్ని ఇచ్చారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయితే ఎందుకూ పనికి రాని వారిగా వారిని తల్లిదండ్రులు చూస్తున్నారని ఆయన అన్నారు. తల్లిదండ్రులపై న , వ్యాపారంగా మారిన విద్యావిధానంపై ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. చిరంజీవి డిగ్రీ పూర్తి చేశారని, ఇద్దరు సిస్టర్స్‌లో ఒకరు ఎంబీబీఎస్‌, మరొకరు డిగ్రీ పూర్తి చేశారని, పవన్‌ కళ్యాణ్‌ ఇంటర్‌ తరువాత ఐటీలో డిగ్రీ హోల్డర్‌ అని ఆయన చెప్పారు. ఏనాడు కూడా తమ తల్లిదండ్రులు చదువు విషయంలో ఒత్తిడి చేయలేదని అన్నారు నాగబాబు . ఇక ఇదే ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశం అవుతుంది.

ఇక ఎన్నికల ప్రచార సభల్లో తన చదువుపై పొంతనలేకుండా మాట్లాడిన పవన్ కళ్యాణ్

ఇక ఎన్నికల ప్రచార సభల్లో తన చదువుపై పొంతనలేకుండా మాట్లాడిన పవన్ కళ్యాణ్


ఎందుకంటే ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో తన విద్యాభ్యాసంపై పవన్ కళ్యాణ్ ఒక్కో సభలో విధంగా చెప్పారు. ఆయన నామినేషన్ వేసేటప్పుడు అఫిడవిట్ లో పదో తరగతి చదివానని నమోదు చేశారు. అయితే గతంలో నెల్లూరులో జరిగిన సభలో ఇంటర్మీడియట్‌ కాలేజీలో రికమండేషన్‌తో సీఈసీ తీసుకున్నానని చెప్పారు. వేరే గత్యంతరం లేక ఎమ్‌ఈసీ తీసుకున్నానని మరో సభలో చెప్పారు. స్నేహితులతో కలిసి ఎంపీసీ ట్యూషన్‌​కు వెళ్లానని మరో సభలో చెప్పారు.

ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చదివారు అన్నదే పెద్ద ప్రశ్న .. దీనిపైనే చర్చ

ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చదివారు అన్నదే పెద్ద ప్రశ్న .. దీనిపైనే చర్చ

పరస్పర విరుద్ధమైన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ఆయన ఐటీలో డిగ్రీ చేశారని నాగబాబు చెప్పటంతో అసలు ఏది కరెక్టో చెప్పలేని స్థితి నెలకొంది. మెగా బ్రదర్స్ ఎవరికి వారు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చెయ్యటంతో అసలు పవన్ కళ్యాణ్ ఏం చదివారు అన్న ఆసక్తి జనాల్లో నెలకొంది. వాళ్ళు ఏం చెప్పకుంటే ఈ పంచాయితీనే లేదు. కానీ వారు విద్యాభ్యాసం గురించి చెప్పటం అదీ ఒకరికొకరు పొంతన లేకుండా చెప్పటమే పవన్ చదువుపై చర్చకు కారణం అవుతుంది.

English summary
What did Janasena's chief Pawan Kalyan actually study? Pawan Kalyan's comment about his education and the absence of pawan what Nagababu has said is that now the AP is a big debate on Pawan's education. Even Pawan Kalyan has been described as one of the factions in each of the election meetings, in election affidavit, pawan mentioned about his study . he studeid his 10th class .and now it has got a bigger turn over Pawan's education.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X