• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిడిపి,బిజెపిల మధ్య ప్రత్యక్ష పోరు ప్రారంభమా?...పరిస్థితులు అలానే!

|

అమరావతి: మిత్రపక్షాలు ఇక శత్రుపక్షాలుగా మారినట్లేనా?...ఇన్నాళ్లూ కుటుంబ కలహాలుగా భావించిన భాగస్వామ్య పార్టీలు ఇక వైరి వర్గాలుగా మారి ఎదురెదురుగా తలపడబోతున్నాయా?...ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈ ఉపోద్ఘాతం ఏ రెండు పార్టీలను ఉద్దేశించో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అవును ఆ రెండు పార్టీలు టిడిపి,బిజెపిలే...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములైన ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు బుధవారం చేసుకున్నపరస్పర విమర్శలు చూస్తే ఇక మిత్రపక్షాలు విడిపోయే సమయం వచ్చినట్లే అనిపిస్తోంది.

  BJP Ready To End Alliance With TDP

  వీరు తమ పార్టీల రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా విడిపోవాలని నిర్ణయించుకొని ఇలా తెగదెంపులు మాటలు మాట్లాడుతున్నారా? లేక...నిజంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న మాటల వల్ల మిత్ర బంధం తెగిపోయే పరిస్థితి వస్తోందా?...అసలు ఇంతకీ టిడిపి, బిజెపి నేతలు బుధవారం ఏమన్నారు? ఎందుకు అలా అన్నారు?...చూద్దాం...

  సైంధవుల్లా పనిచేస్తున్నబిజెపి నేతలు:టిడిపి

  సైంధవుల్లా పనిచేస్తున్నబిజెపి నేతలు:టిడిపి

  బిజెపి నేతలు సైంధవుల్లా పనిచేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. అమరావతిలో రాజధాని కడతారా?...మయసభ నిర్మిస్తారా? అంటూ బీజేపీ నేతలు అవహేళన చేస్తోందని ఆయన మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 1500 కోట్లు ముష్టి వేసిందని ఆయన ద్వజమెత్తారు. రాజధానికి రూ. 39 వేల కోట్లతో 6 నెలల క్రితమే డీపీఆర్‌ ఇచ్చామని ఆయన అన్నారు. రూ. లక్ష కోట్లతో రోడ్లు ఎక్కడ వేశారో బీజేపీ నేతలు చెప్పాలని ఆయన అన్నారు. అదే నిజమైతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన సవాల్ చేశారు. అవసరమైతే కేంద్రమంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

   ఈ టిడిపి ఎమ్మెల్సీ మాటలు చూస్తే...అవసరమైతే అంటే...

  ఈ టిడిపి ఎమ్మెల్సీ మాటలు చూస్తే...అవసరమైతే అంటే...

  ఈ టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాటలు చూస్తే...ఒక మిత్రపక్షం నేత...తమ భాగస్వామ్య పార్టీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తే...వ్యవహారం పూర్తిగా చెడిందనడానికి ఇంక ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏ విషయంలో అయితే ప్రస్తుతుం ఈ రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు వచ్చాయే అవే విషయాలకు సంబంధించి పతాక స్థాయిలో...ఈ వ్యాఖ్యల్లో విమర్శలు...ఆరోపణలు రెండూ ఉన్నాయి. ఇక టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ గతంలోనే బిజెపిపై దూకుడుగా విమర్శలు చేసినందుకు అధినేత నుంచి అక్షింతలు వేయించుకున్నవారే. అయితే ప్రస్తుత సందర్భంలో ఆయన ఇంతలా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారంటే అధినేత చంద్రబాబు అనుమతి లేకుండా మాట్లాడి ఉంటారని భావించలేం...

  మరి బిజెపి నేతలు ఏమంటున్నారంటే...అన్నీ అవాస్తవాలేనంట!

  మరి బిజెపి నేతలు ఏమంటున్నారంటే...అన్నీ అవాస్తవాలేనంట!

  మరోవైపు బిజెపి నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ఎపి ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. అదికూడా ప్రత్యేకించి మరోసారి చంద్రబాబును టార్గెట్ చేస్తూ...ఇంకా చెప్పాలంటే చంద్రబాబును బుక్ చేస్తూ మాట్లాడారు. సోమూ వీర్రాజు ఏమన్నారంటే...కేంద్రంపై టిడిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నిధులను కేటాయించిందని, ఇంకా పదిహేను శాతం మాత్రమే నిధులు ఇవ్వాల్సి ఉందని ఆయన తేల్చిచెప్పారు.

  అసలు రాష్ట్రంలో అమలవుతున్న పథకాల్లో 80 శాతం కేంద్రప్రభుత్వ నిధులతో జరుగుతున్నవేనని స్పష్టం చేశారు. పోలవరం ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుందని పార్లమెంట్‌లో స్పష్టం చేశామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులతో సంతృప్తి చెందిన సీఎం చంద్రబాబు గతంలో పత్రికాముఖంగా స్పందించిన వార్తల క్లిప్పింగ్స్‌ను వీర్రాజు చదివి మరీ వినిపించారు...ఏ రాష్ట్రం సాధించని నిధులు మనమే సాధించామని ఒకసారి, కేంద్రం అన్నీఇచ్చింది...ఇంతకు మించి అడగలేమని ఇంకోసారి సీఎం గతంలో అన్నారని పత్రికల్లో క్లిప్పింగ్స్ చూపించారు. మరి అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు కేంద్రం ఏమి చేయలేదని ఎలా అంటున్నారని ఆయన స్ట్రయిట్ గా అడిగేశారు.

  దీంతో వ్యవహారం ముదిరిపాకాన పడిందా?...లేక కేవలం రాజకీయం రక్తి కట్టించడానికేనా?

  దీంతో వ్యవహారం ముదిరిపాకాన పడిందా?...లేక కేవలం రాజకీయం రక్తి కట్టించడానికేనా?

  ఇప్పుడు ఈ టిడిపి ఎమ్మెల్సీ వర్సెస్ బిజెపి ఎమ్మెల్సీ సీరియస్ వ్యాఖ్యలను అంతే సీరియస్ గా తీసుకొని పట్టించుకుంటే ఈ రెండు పర్టీల మధ్య విభేధాలు తారాస్థాయికి చేరినట్లే కనిపిస్తుంది. అంతేకాదు...ఇక తెంగతెంపులకు కూడా రెడీనే అన్నట్లుగా కూడా అనిపిస్తోంది. మిత్రపక్షాలు, భాగస్వామ్య పార్టీలైన ఈ రెండు పార్టీలు...అంశాలవారీగా...ఇంత బహిరంగంగా...ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాకా...మళ్లీ తూచ్...అదేం లేదు...అంతా బాగానే ఉంది...అనేట్లయితే జనం ఖచ్చితంగా వీరిని అసహ్యించుకునే పరిస్థితి ఉంటుంది. లోగుట్టు పెరుమాళ్లకెరుక అనే చందంగా కాకుండా ఆవేశంతోనో..లేక ఆలోచనతోనేనో ...గానీ జనాలకు తెలియాల్సిందందా వీరు తెలియజెప్పేశారు...కాబట్టి ఈ రెండు పార్టీల పోకడ చూస్తే ఇక విడాకులు తప్పని పరిస్థితి తప్పదేమో అనిపిస్తోంది...లేక...మళ్లీ రాజకీయం చెయ్యబోతే ప్రజలే ఆ చర్యలను తిప్పికొట్టే పరిస్థితి కనిపిస్తోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Despite being the ruling party in Andhra and partner in the central government, the Telugu Desam party is trying to take over the political alternative place by criticizing its ally BJP?...For that BJP also try to counteringrepel their ally TDP effort?...The words of the two parties leaders remain like that...So, what will happen?...
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more