వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీచర్స్ విస్కీ తాగుతూ టీచర్స్ డే సెలబ్రేషన్సా?: ఉపాధ్యాయులపై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు

|
Google Oneindia TeluguNews

అమరావతి: వివాదాలను తన జేబులో పెట్టుకుని తిరిగే దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు ఇండస్ట్రీలో పేరుంది. ఆయన తీసే సినిమాలు గానీ.. చేసే కామెంట్లు గానీ ఆయన మనస్తత్వానికి అద్దం పడుతుంటాయి. మొన్నామధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఓ సంచలనానికి తెర తీశారు. ఆ తరువాత కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మరో వివాదాస్పద సినిమాను తీస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉందీ మూవీ. తాజాగా- మరో వివాదానికి ఆయన కేంద్రబిందువు అయ్యారు. పవిత్రమైన గురుపూజోత్సవం నాడు ఉపాధ్యాయులను కించపరిచేలా కామెంట్స్ చేశారు.

మునకేసిన ముంబై: 200 సంవత్సరాల తరువాత తొలిసారి! నాలుగు రోజుల్లో 499 మిల్లీమీటర్లుమునకేసిన ముంబై: 200 సంవత్సరాల తరువాత తొలిసారి! నాలుగు రోజుల్లో 499 మిల్లీమీటర్లు

టీచర్లపై సెటైర్లు సంధించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్.. సంచలనంగా మారింది. టీచర్లందరూ టీచర్స్ విస్కీ తాగుతూ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారా? అని ప్రశ్నించారు ఆర్జీవీ.

Director Ram Gopal Varma made controversial comments on Teachers Day Celebrations

ఈ కామెంట్ కు టీచర్స్ 50 విస్కీ బోటిల్ గల ఫొటోను జత చేస్తూ గురువారం ఉదయం ఆయన వరుస ట్వీట్లను సంధించారు. తనకు చదువు చెప్పడానికి ప్రయత్నించిన ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఫెయిల్ అయ్యారని, తప్పు వారిదేనని అన్నారు. తనను మంచి విద్యార్థిగా తీర్చిదిద్దలేకపోయిన టీచర్లందరూ చెడ్డవారేనని చెప్పారు. తనను ఒక మంచి విద్యార్థిగా, మానవత్వం ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దడంలో తనకు చదువు చెప్పిన టీచర్ల ప్రయత్నాలు విఫలం అయ్యాయని అన్నారు.

అందుకే- ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఏం సందేశం ఇవ్వాలో తనకు తెలియట్లేదని చెప్పారు. తాను చెడ్డ విద్యార్థిని అయినప్పటికీ.. ఓ మంచి విద్యార్థిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది కాదా? అని ప్రశ్నించారు. ఈ లెక్కన చూసుకుంటే.. తనకు విద్యను బోధించిన ప్రతి ఉపాధ్యాయుడు కూడా చెడ్డవాడేనని అని ట్విస్ట్ ఇచ్చారు.

English summary
One of the most renowned directors of all time Ram Gopal Varma has a unique way of celebrating Teachers Day. Ram Gopal Varma has a very unique style of remembering his teachers. He took to his social media feed and posed a unique question to them. In the picture, we can see him in a backdrop of Teacher's Whisky.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X