వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందులో కోత విధించమని ఏ చట్టం చెబుతోంది: సీఎం జగన్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న

|
Google Oneindia TeluguNews

అమరావతి: కరోనావైరస్ దేశంలో విజృంభిస్తుండటంతో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇప్పటికే ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. మరికొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వేతనాల్లో కోత విధించాయి ప్రభుత్వాలు. తెలుగు రాష్ట్రాలు ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉద్యోగులు పెన్షనర్ల వేతనాల్లో కోత విధిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెన్షనర్ల పెన్షన్‌లో 50శాతం కోత విధించడాన్ని తప్పుబట్టారు ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు.

 ఆ రాష్ట్రంలో తగ్గిన కరోనావైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య... ఆ మంత్రం ఫలించిందన్న ప్రభుత్వం ఆ రాష్ట్రంలో తగ్గిన కరోనావైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య... ఆ మంత్రం ఫలించిందన్న ప్రభుత్వం

ప్రస్తుతం కోవిడ్-19 రాష్ట్రంలో విశ్వరూపం చూపుతుండటంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినందున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తమ వేతనాల్లో తాత్కాలిక కోత విధించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు పెన్షనర్లకు పూర్తిస్థాయిలో పెన్షన్ చెల్లించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. అసలే కష్టకాలంలో ఉన్న సమయంలో పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లలో కోత విధించడం సరికాదన్నారు. పెన్షనర్లకు పెన్షన్ అనేది బహుమానం కింద ఇవ్వడం లేదని వారు ప్రభుత్వంలో సుదీర్ఘ సేవలు అందించినందున వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతోందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని లేఖలో చంద్రబాబు కోరారు.

 Disburse the full pension to the pensioners, TDP chief Chandrababu writes letter to CM Jagan

ఇక డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ 1897లో లేదా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 చట్టంలో కానీ పెన్షనర్ల వేతనంలో కోత విధించాలని ఎక్కడా లేదని ప్రభుత్వానికి గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు. పెన్షన్ అనేది పెన్షనర్ల హక్కు అని చెప్పిన చంద్రబాబు... ప్రభుత్వం వారికి 50 శాతం కోత విధించడమే కాకుండా కోవిడ్-19 లాంటి కష్ట సమయాల్లో వారిని మరిన్ని కష్టాలకు గురిచేస్తోందని మండిపడ్డారు.

ఇక రిటైర్డ్ ఉద్యోగస్తులంతా 60 ఏళ్లకు పైబడినవారే ఉంటారని గుర్తు చేసిన చంద్రబాబు... 60 ఏళ్లు ఆ పైబడిన వారే ఎక్కువగా కోవిడ్-19 బారిన పడే అవకాశాలున్నాయని చెప్పారు. వారి ఆరోగ్య దృష్ట్యా వారికి మెడికల్ అవసరాలు ఎక్కువగా ఉంటాయని చంద్రబాబు చెప్పారు. కోవిడ్-19 లాంటి సమయాల్లో వృద్ధులైన పెన్షనర్లు మరింత జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పెన్షనర్ల ఆరోగ్యంను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే వారి నెలవారీ పెన్షన్ పూర్తిస్థాయిలో అంటే 100శాతం ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Recommended Video

Tested Negative People And States Situation After ICMR Advises Not to Use Rapid Testing Kits

English summary
AP Opposition leader Chandrababu naidu wrote a letter to CM Jagan to disburse the 100 percent pension to the Pensioners as it was very difficult for them to survie in these difficult times with 50percent cut in pensions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X