హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యుత్ బిల్లు మోగనుంది!: రూ.3.72 వరకు పెంపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Discoms submit tariff hike proposal to APERC
హైదరాబాద్: భారీగా విద్యుత్ ఛార్జీల పెరగనున్నాయి. ప్రజలపై రూ.9,319 కోట్ల భారం పడనుంది. ఎపిఈఆర్‌సికి డిస్కంలు వివరాలు సమర్పించింది. పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై భారం పడనుంది. రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపేలా 2014-15 సంవత్సరానికి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ(ఈఆర్‌సి)కు అందజేశాయి.

తమకున్న నష్టాలన్నీ పూడ్చుకొని ప్రతీ యూనిట్‌పై కనీసం ఐదు పైసల లాభం వచ్చేలా ఛార్జీలను పెంచాలని డిస్కంలు కోరాయి. త్వరగా ప్రతిపాదనలు పంపాలని సర్కారు కూడా తొందరపెట్టడంతో కన్సల్టెంట్ల సహకారంతో లెక్కలు కట్టి గతేడాది కంటే రెట్టింపు విద్యుత్ చార్జీలను ప్రతిపాదిస్తూ బంతిని ఈఆర్‌సీ కోర్టులోకి బుధవారం నాడు నెట్టేశాయి.

డీజిల్, పెట్రోలు, వంటగ్యాస్, నిత్యావసర సరకుల ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడిని విద్యుత్ చార్జీల పెంపు కోలుకోలేని దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది. సగటు జీవికి విసనకర్రలు, కిరోసిన్ బుడ్డిలే దిక్కయ్యేలా డిస్కంలు వ్యవహరిస్తున్నాయి.

రాష్ట్రంలో మొత్తం 2.54 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులుంటే ఉచిత విద్యుత్ పరిధిలోకి వచ్చే 30 లక్షల మంది రైతులను మాత్రం వదిలిపెట్టి మిగిలిన అన్ని వర్గాలకూ దిమ్మదిరిగేలా చార్జీలను పెంచడానికి డిస్కంలు ప్రతిపాదించాయి. కనిష్ఠంగా 50 పైసలు, గరిష్ఠంగా 3.72 రూపాయల వరకు పెంచాలని ఈఆర్‌సిని కోరాయి.

English summary

 If the discoms have their way, domestic power consumers drawing more than 150 unit a month will have to pay an additional Re 1 per unit from next April. The hike on those consuming less than 150 units a month will be an additional 50 paise per unit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X