వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్’పై ఇంత రాద్దాంతమా?: జలీల్ ఖాన్ స్పందన

బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుందంటూ ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో వింతగా వాదించిన తెలుగుదేశం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన వ్యాఖ్యలపై తాజాగా వివరణ ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుందంటూ ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో వింతగా వాదించిన తెలుగుదేశం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన వ్యాఖ్యలపై తాజాగా వివరణ ఇచ్చారు. కాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో సంచలనమే సృష్టించింది. పలువురు నెటిజన్లు ఆయన వ్యాఖ్యలపై పెద్ద పెద్ద జోకులే వేసుకున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆ వీడియోపై జలీల్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన వివరణను ఓ వీడియో ద్వారా తెలియజేశారు. గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్నింటినీ తాను గమనిస్తున్నానని, తనను ఇంతగా హైలైట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని జలీల్ ఖాన్ అన్నారు.

తాను మెట్రిక్యులేషన్ (10వ తరగతి) చదువుకున్నానని, సెకండ్ క్లాస్‌లో పాస్ అయ్యానని చెప్పారు. తర్వాత పీయూసీ(ప్రీ యూనివర్సిటీ కోర్సు)లో జాయిన్ అయ్యానని, కానీ, వ్యాపారంలో మంచి ఆఫర్ రావడంతో చదువును డిస్ కంటిన్యూ చేశానని వివరించారు. ఎన్నికల అఫిడవిట్‌లో కూడా తన చదువు మెట్రిక్యులేషన్ అనే పేర్కొన్నానని చెప్పారు.

బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్: ఎమ్మెల్యే వింత సమాధానాలు(వీడియో)బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్: ఎమ్మెల్యే వింత సమాధానాలు(వీడియో)

Discontinued PUC and took up business: Jaleel Khan

తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో వాస్తవాలే చెప్పానని... కానీ, ముందు తాను చెప్పింది డిలీట్ చేసి, తర్వాత చెప్పింది హైలైట్ చేశారని జలీల్ ఖాన్ మండిపడ్డారు. పైచదువులు మీరెందుకు చదవలేదు, ఏం చదవాలనుకున్నారు అనే ప్రశ్నకు బదులుగా... బీకాం చదవాలని అనుకున్నానంటూ చెప్పానని తెలిపారు.

పీయూసీలో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉన్నట్టే... బీకాంలో కూడా ఫిజిక్స్ ఉంటుందని అనుకున్నానని చెప్పారు. వాస్తవానికి తాను ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పానని, కానీ అనేకసార్లు అడిగితే కాదనలేక ఇచ్చానని చెప్పారు. ఇంటర్వ్యూ తీసుకున్న వారు మా గౌరవాన్ని కాపాడాల్సి ఉంటుందని అన్న ఆయన.. ఇలా చేయడమేంటని అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ తాము ఏదైనా తప్పు మాట్లాడినా దాన్ని సరిదిద్దుకోవాలని... ఇలా రాద్ధాంతం చేయకూడదని హితవు పలికారు.

English summary
Vijayawada West MLA Sk. Jaleel Khan — who landed in a soup after a short video of him claiming graduation in Bachelor of Commerce with Mathematics and Physics went viral — has finally come out clean with his academic qualifications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X