వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ప్రీమియం బ్రాండ్ల మద్యంపై భారి తగ్గింపు

|
Google Oneindia TeluguNews

మంగళవారం నుండి ఏపీలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించనుండడంతో మద్యం ప్రియులకు భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. సోమవారం అర్థరాత్రీ వరకు ప్రైవేట్ వ్యాపారులు తమ మద్యాన్ని అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన మద్యాన్ని ఎక్సైజ్ శాఖకు వాపసు చేయాల్సి ఉంటుంది. అయితే వాపసు చేసిన మద్యానికి తిరిగి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో తమ దగ్గర ఉన్న మద్యన్ని క్యాష్ చేసుకునేందుకు మద్యం వ్యాపారులు డిస్కౌంట్స్‌ను ప్రకటించారు.

అయితే మద్యం డిస్కౌంట్‌లు సాధరణ మద్యంపై కాకుండా తమ షాపుల్లో స్టాక్ కోసం తెచ్చుకున్న ప్రీమియం మద్యంపైనే ఈ డిస్కౌంట్‌ను ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రీమియం మద్యం ధరలపై 500 నుండి 1000 రుపాయలకు డిస్కౌంట్‌ను ఇస్తున్నట్టుగా సమాచారం.దీంతో మద్యం ప్రియులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని మద్యాన్ని కొనుగోలు చేశారు. గత కొద్ది రోజులుగా ప్రభుత్వమే మద్యం షాపులపు నిర్వహిస్తుందనే సంకేతాలు రావడంతో,మద్యం వ్యాపారులు ముందు జాగ్రత్త పడ్డారు. తమ వద్ద అమ్ముడు పోయో మద్యాన్ని మాత్రమే ఎప్పటికప్పుడు స్టాక్‌ను తీసుకున్నారు.

Discount on alcohol on premium brands in AP

సాధరణ మద్యానికి ఎలాంటీ ఇబ్బంది లేకపోయినా నిబంధనల ప్రకారం తీసుకువచ్చిన ప్రీమియం మద్యం అమ్ముడు పోకపోవడంతో కొంతమంది మద్యం షాపుల యాజమానులు ఈలాంటీ డిస్కౌంట్‌లను పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని షాపుల్లో మూడు బాటిళ్లు కొనుగోలు చేసిన వారికి మరో ఫుల్ బాటిల్ కూడ ఉచితంగా ఇచ్చినట్టు సమాచారం.

English summary
Good news for alcoholics in ap. special discount have been giving on premium liquor brands .as government is going to be mainten tomorrow onwards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X