వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లుపై చర్చ...ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్న టిడిపి మంత్రులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chandrababu Naidu on Kapu Reservation Bill in AP Assembly | Oneindia Telugu

అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాపులను బీసీల్లో చేర్చి సీఎం చంద్రబాబు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం ఉదయం కాపు రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మంత్రి అచ్చెన్నాయుడు కాపు బిల్లుపై చర్చను ప్రారంభించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ మద్రాసు ప్రెసిడెన్సీ హయాంలోనే కాపులు బీసీల్లో ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాడ్డాక బీసీల లిస్టు నుంచి కాపులను తొలగించిన విషయం మంత్రి అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Discussion On Kapu Reservation Bill in Assembly

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఎవరూ అడగలేదని, పాదయాత్రలో కాపుల కష్టాలను చూసి చలించిన చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేరుస్తామని తనంతట తానుగా హామీ ఇవ్వడమే కాకుండా దాన్ని అమలు చేసి చూపించారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ బీసీ కమిషన్‌ ద్వారా శాస్త్రీయంగా అధ్యయనం చేయించి కాపులకు రిజర్వేషన్లు కల్పించడం సంతోషదాయకంగా ఉందన్నారు.

అలాగే రాష్ట్రంలో కాపులను బీసీ ఎఫ్ కేటగిరీగా కేటాయించి 5శాతం రిజర్వేషన్ వర్తించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం పట్ల ఆయన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు.

English summary
amaravathi: Andhra Pradesh (AP) Assembly today opened with a good news for Kapu community. The government has introduced a Bill for reserving 5% seats for in all fields. Bonda Uma said that this would not in any way hamper the reservations for Backward Classes or any other section. He lauded the attempts of Chandrababu to appoint a Commission, that surveyed AP, as to how far reservations to Kapus is justified. The Commission submitted its report yesterday, which has been approved by the State Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X