హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ హత్య కేసు : రక్తం మరుగుతోంది... న్యాయం జరిగింది... ఎన్‌కౌంటర్‌పై జనసేనాని స్పందన

|
Google Oneindia TeluguNews

దిశ ఎన్‌కౌంటర్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. దిశ సంఘటన జరిగిన రోజు రాత్రి తలచుకుంటేనే రక్తం మరిగిపోతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ సమయంలో దిశ ఎంత నరకం చూసిందోనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటనతో ఆక్రోశంతో రక్తం మరిగిపోతుందని వ్యాఖ్యానించారు. దేశం మొత్తం ఇలాంటీ తక్షణ న్యాయాన్ని కోరుకోవడానికి వారి ఆవేదనే కారణమని అన్నారు. కాగా ఈ ఎన్‌కౌంటర్‌తో సమస్య సద్దమణగలేదని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదని అన్నారు.

దిశ నిందితులకు శిక్ష.. మరి మానస నిందితుల పరిస్థితి, ఒక్కరు కాదు నలుగురు, పేరెంట్స్దిశ నిందితులకు శిక్ష.. మరి మానస నిందితుల పరిస్థితి, ఒక్కరు కాదు నలుగురు, పేరెంట్స్

సమస్య అంతం కాలేదు..భవిష్యత్‌లో జరకుండా చర్యలు

సమస్య అంతం కాలేదు..భవిష్యత్‌లో జరకుండా చర్యలు

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత యావత్ భారత దేశం పోలీసులకు అండగా నిలబడింది. ఈ నేపథ్యంలోనే దిశ సంఘటనను తీవ్రంగా ఖండించిన జనసేన అధినేత ఎన్‌కౌంటర్ పై స్పందించారు. మహిళల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని ఆయన హెచ్చరించారు. దిశ సంఘటనతో దేశం మొత్తం ఆవేశంతో తక్షణ న్యాయం కోరుకుందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం జరిగిన ఎన్‌కౌంటర్‌తో అన్ని సమస్యలకు ఫుల్ ‌స్టాప్ పడిందని భావించద్దని ఆయన అన్నారు. దేశంలో ఏ ఇతర మహిళకు కూడ ఇలాంటీ పరిస్థితి రాకూడదని కోరుకున్నారు.

మూడు వారాల్లోనే శిక్షలు పడాలి,

మూడు వారాల్లోనే శిక్షలు పడాలి,

మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన దోషులకు మూడు వారాల్లోనే శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు సంబంధించి న్యాయస్థానాలు చొరవ చూపాలని ఆయన విజ్ఝప్తి చేశారు. మహిళల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని శిక్షలు బహిరంగానే అమలు పరచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నేరాల స్థాయిని బట్టి, వాటిని బహిరంగానే అమలు చేయాలని ,చివరకు అది మరణశిక్ష అయినా బహిరంగగానే చేపట్టాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నిర్భయ చట్టం వచ్చిన అత్యాచారాలు ఆగలేదు..

నిర్భయ చట్టం వచ్చిన అత్యాచారాలు ఆగలేదు..

ఇక నిర్భయ ఉదంతం తర్వాత కఠిన చట్టాలను తీసుకువచ్చినా..మహిళలపై లైంగిక నేరాలు, హత్యలు ఆగలేదని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ మరిన్ని కఠిన చట్టాలకు కేంద్రం చర్యలు చేపట్టాలని అన్నారు. దిశ లాంటీ సంఘటనలు కఠిన చట్టాలనే కోరుకుంటున్నాయని చెప్పారు. చట్టాలు పూర్తిగా యువతులు, మహిళల వైపు చూడాలంటేనే భయపడే విధంగా చట్టాలు రూపోందించాలని ఆయన కోరారు. కఠిన చట్టాల అమలు కోసం మేధావులు ముందుకు రావాలని , ఇందుకోసం ఇతర దేశాల్లో చట్టాలు ఎలా ఉన్నాయో అధ్యయనం చేయాలని అన్నారు. దిశ కేసులో ప్రజలు కోరుకున్నట్టుగా న్యాయం జరిగిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటున్నాని తెలిపారు.

English summary
Janasena chief Pawan Kalyan reacted on encounter of Disha accused. if we think that day incident the blood will boil he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X