రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో దిశా పోలీస్ స్టేషన్ రగడ .. పోలీసులకు తలనొప్పిగా మారుతున్న ఫిర్యాదులు.. రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టం 2019 లో భాగంగా రాజమండ్రిలో దిశా పోలీస్ స్తేష ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రిలో దిశా పోలీస్ స్టేషన్ ఫిబ్రవరి 8వ తేదీ శనివారం ప్రారంభించారు . ఇక అప్పటి నుండి దిశా పోలీస్ స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఇదే ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది .

దిశ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌.. నేటి నుండి ఏపీలో ప్రత్యేకంగా మహిళలు, బాలికల భద్రత దిశ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌.. నేటి నుండి ఏపీలో ప్రత్యేకంగా మహిళలు, బాలికల భద్రత

 పార్లమెంటులో దిశ చట్టం ఆమోదం పొందక ముందే మొదలైన పోలీస్ స్టేషన్

పార్లమెంటులో దిశ చట్టం ఆమోదం పొందక ముందే మొదలైన పోలీస్ స్టేషన్

ఇక అసలు విషయం ఏమిటంటే ఏపీలో దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభం కావటంతో ఏపీలో బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ పోలీసులు పార్లమెంట్ లో దిశా చట్టం బిల్లు ఆమోదం పొందలేదు కాబట్టి ఆ చట్టం ప్రకారం ఏమీ చెయ్యలేని పరిస్థితి నెలకొంది. పార్లమెంటులో దిశ చట్టం ఆమోదం పొందకపోవడంతో బాధితులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు . గతంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులే... దిశ పీఎస్‌కు రావడంతో వాటిని నమోదు, చేయాలా వద్దా..? నమోదు చేస్తే దిశా చట్టం కింద చర్యలు తీసుకోవటం సాధ్యం కాదు కదా అని తలలు పట్టుకుంటున్నారు.

Recommended Video

Good Morning India: 3 Minutes 10 Headlines : YS Jagan To Meet Modi, Amit Shah
దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభంతో ఫిర్యాదులు .. పోలీసులకు తలనొప్పి

దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభంతో ఫిర్యాదులు .. పోలీసులకు తలనొప్పి

ఇక ఇలా దిశా పోలీస్ స్టేషన్ ఏర్పాటు జరిగిందో లేదో అప్పుడే రెండు వరకట్న వేధింపుల కేసులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాయి. అయితే వారికి సాధారణ గృహిణుల కేసులు కావడంతో సర్ది చెప్పి వెనక్కి పంపించారు. ఇన్నీసుపేటకు చెందిన మౌనికాదేవి , నెహ్రూ నగర్‌కు చెందిన జ్యోతిర్మయి ఇద్దరూ భర్త , అత్తింటివారు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన క్రమంలో పోలీసులు వారికి నచ్చజెప్పి పంపారు. కానీ ఆ తర్వాతే అసలు తలనొప్పి మొదలైంది .

సోషల్ మీడియాలో అసభ్య ప్రచారంపై దిశా యాక్ట్ పెట్టాలన్న టీడీపీ ఎమ్మెల్యే .. ఇంకా దిశా యాక్ట్ అమలులోకి రాలేదన్న పోలీసులు

సోషల్ మీడియాలో అసభ్య ప్రచారంపై దిశా యాక్ట్ పెట్టాలన్న టీడీపీ ఎమ్మెల్యే .. ఇంకా దిశా యాక్ట్ అమలులోకి రాలేదన్న పోలీసులు

తనపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులని పెడుతున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఫిర్యాదు చేసేందుకు వెళ్ళారు . నిందితులపై దిశ చట్టం కింద కేసులు నమోదు చేయాలని పోలీసుల్ని కోరారు భవానీ . అయితే దిశా చట్టం ఇంకా అమల్లోకి రాలేదని సమాధానం చెప్పడంతో అందరూ షాక్ కు గురైనట్టు తెలుస్తుంది. దీంతో టీడీపీ నేతలు- డీఎస్పీకి మధ్య చర్చ జరిగింది. ఎమ్మెల్యే భవానీ మాత్రం పోలీస్ స్టేషన్ ను ఆర్భాటంగా ప్రారంభించి దిశ పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే ఇంకా చట్టం అమల్లోకి రాలేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 దిశ పీఎస్‌ ప్రారంభం పేరుతో సీఎం అబద్ధపు ప్రచారం అని మండిపడుతున్న టీడీపీ .. ఇరకాటంలో పోలీసులు

దిశ పీఎస్‌ ప్రారంభం పేరుతో సీఎం అబద్ధపు ప్రచారం అని మండిపడుతున్న టీడీపీ .. ఇరకాటంలో పోలీసులు

దిశ పీఎస్‌ ప్రారంభం పేరుతో సీఎం అబద్ధపు ప్రచారం చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక ఇదే వ్యవహారం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. పార్లమెంట్ లో చట్టం ఆమోదం పొందకముందే దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభించటం తో పోలీసులు ఇప్పుడు తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే భవాని రాజకీయ దురుద్దేశంతో ఫిర్యాదు చేశారని అడిషనల్ ఎస్పీ లతా మాధురి పేర్కొంటున్నారు. ఇక ఈ వ్యవహారంతో పోలీసులు దిశా చట్టం క్రింద కేసులు నమోదు చెయ్యలేక , సాధారణ పోలీస్ స్టేషన్ గా చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు.

English summary
Raja Mahendravaram city MLA Adirreddi Bhavani went on to complain that she was trolled in social media with abusive posts .Bhawani asked the police to register cases under the Disha Act against the accused. However, it seems that everyone has been shocked by the reply that the DISHA act has not been implemented yet. Since the Disha Bill was not passed in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X