ఎంసెట్ చిచ్చు: ఎపిలో కూడా మేమేనని జగదీష్ రెడ్డి

హైదరాబాద్: వైద్య ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎంసెట్ వివాదం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య మరింతగా ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ వైఖరిపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంంగా మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరగకముందు దౌర్జన్యం చేశారని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అదే వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనే జరగలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహిద్దామని అంటున్నవాళ్లు ముందుగా షెడ్యూల్ ఎందుకు ప్రకటించారని ఆయన అడిగారు. మేం చెబుతాం, మీరు పాటించండనే అధికార ధోరణిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. విద్యార్థుల్లో ఏ విధమైన అయోమయం లేదని, తమ రాష్ట్ర విద్యార్థులు సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టాన్ని తాము అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

Dispute on EAMCET between Telangana and AP

రాష్ట్ర విభజన నాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిల్లికజ్జాలు పెట్టుకుంటోందని ఆయన అన్నారు. ఆయన సోమవారంనాడు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక లోగోను ఆవిష్కరించారు. కేంద్రం చేసిన చట్టాలు నచ్చినా, నచ్చకపోయినా తమ ప్రభుత్వం మౌనంగా ఉంటోందని, ఎపి ప్రభుత్వమే ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తోందని ఆయన అన్నారు. ఏకపక్షంగా ఎంసెట్ షెడ్యూల్ ప్రకటించి తమను తప్పుపట్టడాన్ని ఎపి విద్యామంత్రి గంటా శ్రీనివాస రావు విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన చెప్పారు.

ఎంసెట్ సహా అన్ని సెట్ల షెడ్యూల్ కూడా విడుదల చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో ఎంసెట్ నిర్వహిస్తూనే ఎపిలో కూడా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. విభజన చట్టం ప్రకారం అన్ని హక్కులు కూడా తమకే ఉన్నాయని ఆయన అన్నారు. ఏపక్షంగా షెడ్యూల్ ప్రకటించి గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది కూడా ఎపి ప్రభుత్వమేనని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. ఎంసెట్ నిర్వహణ విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలా, కోర్టుకు వెళ్లాలా అనే విషయంపై ఆయన ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వినకపోతే కోర్టుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఎంసెట్‌ను రెండు రాష్ట్రాల్లో కూడా తామే నిర్వహిస్తామని ఎపి ప్రభుత్వం పట్టుబడుతోంది. రెండు మూడు సార్లు ఇరు రాష్ట్రాల విద్యామంత్రులు గవర్నర్ నరసింహన్‌ను కలిసినా సమస్య పరిష్కారం కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+