వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరీక్షలపై ఆందోళన: వైద్య విద్యార్థి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Distressed medical student hangs self
హైదరాబాద్: ఇంటర్నల్స్ అన్నీ క్లియర్ అయితే తప్ప ఫైనల్ పరీక్షలకు అనుమతించబోమని అధికారులు బెదిరించడంతో ఆందోళనకు గురైన 18 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో గల కామినేని వైద్య కళాశాలలో చదువుతున్న కె. సురేష్ చౌదరికి, మరి కొంత మంది విద్యార్థులకు అధికారులు పరీక్షలకు సంబంధించిన హెచ్చరికలు చేశారు.

ఇంటర్నల్స్‌లో ఉత్తీర్ణులైతేనే తుది పరీక్షలకు అనుమతిస్తామని ప్రిన్సిపాల్ శ్రుతి మోహన్ విద్యార్థులకు చెప్పారు. ప్రిన్సిపాల్‌తో సమావేశమైన తర్వాత సురేష్ చౌదరి తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. సురేష్ మేనేజ్‌మెంట్ కోటాలో సీటు పొందాడు. ఇంటర్నల్స్ రాయాలని, ఫలితాల గురించి ఆలోచించవద్దని తల్లి అతనికి చెప్పింది.

తల్లితో మాట్లాడిన తర్వాత సురేష్ రెండు గంటల పాటు గ్రూపు స్టడీ సెషన్‌లో పాల్గొన్నాడు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో తన గదికి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సురేష్ మిత్రుడు వచ్చి తలుపు తట్టినా ఎంతకీ తెరుచుకోకపోవడంతో అందరనీ అప్రమత్తం చేశాడు.

సెక్యూరిటీ సిబ్బంది వచ్చి తలుపులను బలవంతంగా తీశారు. వారికి సురేష్ ఉరేసుకున్న దృశ్యం కనిపించింది. సురేష్ ఇంటర్నల్స్‌పై దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశంతో అతని రూమ్మేట్ మరో గదిలో ఉంటున్నాడు.

English summary
An 18-year-old medical student committed suicide after the college authorities allegedly threatened not to allow him to write the final exams if he failed to clear internals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X