తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైభవంగా మనగుడి, నాలుగు రాష్ట్రాల్లో(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా ఆరవ విడత చేపట్టిన మనగుడి పూజలు విజయవంతంగా ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1100 ఆలయాల్లో కార్తీక మాస విశిష్టతను చాటుతూ భక్తుల్లో మరింతగా భక్తిభావాన్ని పెంపొందించారు.

భారతీయ సంప్రదాయాలను, ఆధ్యాత్మిక భావాలను పరిరక్షించేందుకు దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఆరో విడత ‘మన గుడి' కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. పద్మావతీ అమ్మవారి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని టిటిడి జెఇవో పి.భాస్కర్ ప్రారంభించారు.

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ సంయుక్తాధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల లోని 54 వేల ఆలయాల్లో 6వ విడత మనగుడి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

అన్ని ఆలయాల్లో ఉదయం 5 గంటల నుంచి నామ సంకీర్తనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆయా ఆలయ సంప్రదాయ రీతిలో అభి షేకం, అర్చన, సామూహిక పారాయణం, వస్త్ర సమర్పణ జరిగింది.

తిరుమల నుంచి వచ్చిన పసుపు, కుంకుమతో పాటు కంకణాలు, అక్షింతలు, ప్రసాదాలను ఆయా ఆలయాల దేవ తల ముందుంచి పూజలు నిర్వహించి భక్తులకు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల 50 లక్షల కంకణాలను ఈ శుభదినాన భక్తులు ధరించారు.

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో మధుకేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం మనగుడి కార్యక్రమం జరిగింది. ఆలయ మేనేజర్ సి.హెచ్.ప్రభాకరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి అందజేసిన పసుపుకుంకాలు, అక్షింతలను భక్తులకు పంపిణీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నగరంలో గల కైలాసగిరి ఆలయంలో మనగుడి కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కెఇ కృష్ణమూర్తి పాల్గొన్నారు. తెలంగాణాలోని మెదక్‌ జిల్లాలో గల పుల్లోర్‌ బండలోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన మన గుడి ఉత్సవంలో ఆ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని దుర్గసముద్రం గ్రామంలోగల శ్రీవల్మికేశ్వరస్వామి ఆలయంలో జరిగిన మన గుడి కార్యక్రమంలో టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ ఛైర్మన్ జేసీ శర్మ, తిరుపతి జేఈవో పోలా భాస్కర్‌ పాల్గొన్నారు.

టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌ సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్‌ వద్దగల శ్రీవీరాంజనేయస్వామి ఆలయంలో నిర్వహిం చిన మనగుడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మనగుడి కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 8500 ఆలయాల్లో ఉత్సవం నిర్వహించడం జరిగింది.

ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం

చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని దుర్గసముద్రం గ్రామంలోగల శ్రీవల్మికేశ్వరస్వామి ఆలయంలో జరిగిన మన గుడి కార్యక్రమంలో టీటీడీ జేఈవో పోలా భాస్కర్‌ మాట్లాడుతున్న దృశ్యం.

ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం


చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని దుర్గసముద్రం గ్రామంలోగల శ్రీవల్మికేశ్వరస్వామి ఆలయంలో జరిగిన మన గుడి కార్యక్రమంలో టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ ఛైర్మన్ జేసీ శర్మ గోమాతకు పూజ చేస్తున్న దృశ్యం.

ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం


చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని దుర్గసముద్రం గ్రామంలోగల శ్రీవల్మికేశ్వరస్వామి ఆలయంలో జరిగిన మన గుడి కార్యక్రమంలో టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ ఛైర్మన్ జేసీ శర్మ గోమాతకు పూజ చేస్తున్న దృశ్యం.

ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం

చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని దుర్గసముద్రం గ్రామంలోగల శ్రీవల్మికేశ్వరస్వామి ఆలయంలో జరిగిన మన గుడి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు.

 ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం


చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని దుర్గసముద్రం గ్రామంలోగల శ్రీవల్మికేశ్వరస్వామి ఆలయంలో జరిగిన మన గుడి కార్యక్రమంలో టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ ఛైర్మన్ జేసీ శర్మ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం

చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని దుర్గసముద్రం గ్రామంలోగల శ్రీవల్మికేశ్వరస్వామి ఆలయంలో జరిగిన మన గుడి కార్యక్రమంలో టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ ఛైర్మన్ జేసీ శర్మ లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేస్తున్న దృశ్యం.

 ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం


తిరుమల నుంచి వచ్చిన పసుపు, కుంకుమతో పాటు కంకణాలు, అక్షింతలు, ప్రసాదాలను ఆయా ఆలయాల దేవ తల ముందుంచి పూజలు నిర్వహించి భక్తులకు వితరణ చేశారు.

ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం


చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని శేషపురంలో జరిగిన మన గుడి కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ జేఈవో పోలా భాస్కర్‌ దంపుతులు.

 ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం


చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని శేషపురంలో జరిగిన మన గుడి కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ జేఈవో పోలా భాస్కర్‌ దంపుతులు.

ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం


పసుపు, కుంకుమతో పాటు కంకణాలు, అక్షింతలు, ప్రసాదాలను ఆయా ఆలయాల దేవ తల ముందుంచి పూజలు నిర్వహించిన టీటీడీ జేఈవో పోలా భాస్కర్‌ దంపుతులు.

ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం


చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని శేషపురంలో జరిగిన మన గుడి కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ జేఈవో పోలా భాస్కర్‌ దంపుతులు.

 ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం


చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని శేషపురంలో జరిగిన మన గుడి కార్యక్రమంలో "మనగుడి" కాగితాలను భక్తులకు పంచుతున్న టీటీడీ జేఈవో పోలా భాస్కర్‌ దంపుతులు.

 ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం


చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని శేషపురంలో జరిగిన మన గుడి కార్యక్రమంలో ఓ భక్తుడికి కంకణం కడుతున్న టీటీడీ జేఈవో పోలా భాస్కర్‌.

ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం

చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని శేషపురంలో జరిగిన మన గుడి కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ జేఈవో పోలా భాస్కర్‌ దంపుతులు.
ఘనంగా ముగిసిన

ఘనంగా ముగిసిన "మనగుడి" కార్యక్రమం


పసుపు, కుంకుమతో పాటు కంకణాలు, అక్షింతలు, ప్రసాదాలను పంచుతున్న టీటీడీ జేఈవో పోలా భాస్కర్‌.

English summary
The divine grandeur of the most auspicious day of Karthika Pournami enhanced with the sixth phase of 'Managudi' spiritual programme jointly organized by TTD along with AP Endowments department in the states of AP, TS, TN and Karnataka today. Tens of thousands of devotees took part in the Tulsi Pooja and Gau Pooja that was being conducted at various temples across the state apart from Karthika Deepotsavam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X