దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా ఆందోళన
తూర్పు గోదావరి జిల్లా పంపాద్రిపేటలో తలపెట్టిన దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమౌతోంది.ప్రభుత్వ వైఖరికి....పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా వామపక్షాలు ఆందోళనబాటపట్టాయి. దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా ఆందోళన చేస్తున్న గ్రామస్థులకు మద్దతుగా నిల్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుపై పోలీసులు జులుం ప్రదర్శించారంటూ వామపక్షాలు మండిపడ్డాయి. పరిశ్రమ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామంటూ వామపక్షపార్టీలు సీపీఐ, సీపీఎంల శుక్రవారం రాజమండ్రిలో ప్రదర్శన నిర్వహించాయి.
సీపీఎం తరపున నగరంలోని నందంగనిరాజు జంక్షన్ వరకూ...ర్యాలీనిర్వహించి...ధర్నా చేశారు . మరోవైపు సీపీఐ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటుచేశాయి. మత్స్యసంపదను నిర్వీర్యం చేయడమే కాకుండా...2 వేల మంది గ్రామస్థుల్ని నాశనం చేయడానికే ఈ పరిశ్రమ పుట్టిందంటూ ఆరోపించాయి వామపక్షాలు. వాయు, నీటికాలుష్యాన్ని పెంచే ఈ పరిశ్రమను ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. పెద్దఎత్తున గ్రామస్థులు ఆందోళన బాట పడుతున్నా...ప్రభుత్వం మొండివైఖరిని విడనాడటం లేదన్నారు. పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని వామపక్షాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications