• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రావెల్ సంస్థ‌ల రౌడీయిజం..! మ‌హిళా ప్ర‌యాణీకురాలిపై దాడి..!!

|

అమరావతి/ హైద‌రాబాద్ : ప‌రుగులు తీస్తున్న కాలంతో పోటీ ప‌డుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఆడ‌వాళ్ల పై వివ‌క్ష చూప‌డం, ఏడిపించ‌డం వంటి చ‌ర్య‌లు వెనుక‌బాటు త‌నాన్ని గుర్తు చేస్తూ వెక్కిరిస్తుంటాయి. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే దివాక‌ర్ ట్రావెల్స్ లో చోటు చేసుకుంది. అమ‌రావ‌తికి వెళ్లాల్సిన ఓ మ‌హిళ ఆ ట్రావెల్స్ లో టికెట్ బుక్ చేసుకోవ‌డ‌మే ఆమె చేసిన పెద్ద నేరంగా ప‌రిగ‌ణించాడు ఆ బ‌స్ డ్రైవ‌ర్. ఒంట‌రిగా ప్ర‌యాణిస్తున్న మ‌హిళ కావ‌డంతో అహంకార‌పూరింతంగా వ్య‌వ‌హ‌రించాడు. మ‌ద‌మెక్కిన నోటితో కొవ్వెక్కిన మాట‌లు మాట్లాడాడు. మ‌హిళ అని చూడ‌కుండా చేయి చేసుకున్నాడు. చివ‌ర‌కు స‌ద‌రు మ‌హిళ బందువుల‌తో కుక్క ను కొట్టిచ్చుకున్న‌ట్టు కొట్టించుకున్నాడు ఆ డ్రైవ‌ర్. అస‌లు పొగ‌రెక్కిన ఆ డ్రైవ‌ర్ కి, ప్ర‌యాణికురాలు మ‌ద్య ఏం జ‌రిగిందో తెలుసుకుందాం..!

దివాక‌ర్ ట్రావెల్స్ బాగోతం..! డ్రైవ‌ర్ ప్రయాణికురాలిపై తిట్ల దండకం..!!

దివాక‌ర్ ట్రావెల్స్ బాగోతం..! డ్రైవ‌ర్ ప్రయాణికురాలిపై తిట్ల దండకం..!!

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు టికెట్‌ బుక్‌ చేసుకున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్‌ చేయి చేసుకున్న ఘటన మంగళవారం దివాక‌ర్ ట్రావెల్స్ కు సంబందించిన బ‌స్ లో చోటుచేసుకుంది. ఆపై దారి పొడవునా తిడుతూ, నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు గురిచేసిన వైనంపై ఆ ప్రయాణికురాలు మ‌నో వేద‌న‌కు గురైంది. విజయవాడకు చెందిన ఉప్పలపాడు లత హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె మంగళవారం విజయవాడకు వచ్చేందుకు దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులో టికెట్‌ బుక్‌ చేశారు. ఆ బస్సు కొండాపూర్‌ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఆ సమయానికి బస్సు అక్కడికి చేరుకోకపోవడంతో ఆమె మరో స్టేజ్‌ అయిన గచ్చిబౌలికి తన మిత్రుడి సాయంతో కారులో చేరుకున్నారు.

బస్సుల్లో చోటుచేసుకున్న ఘటన..! ప్ర‌యాణీకురాలి పై చేయి చేసుకున్న డ్రైవ‌ర్..!!

బస్సుల్లో చోటుచేసుకున్న ఘటన..! ప్ర‌యాణీకురాలి పై చేయి చేసుకున్న డ్రైవ‌ర్..!!

అక్కడికి కూడా బస్సు సమయానికి రాకపోవడంతో అభీబస్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. దీంతో వారు బస్సు డ్రైవర్‌తో మాట్లాడించే ప్రయత్నం చేయగా.. టోలిచౌక్‌ దాటిందని.. లక్డీకపూల్‌ రావాలని డ్రైవర్‌ సమాధానం చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. లక్డీకపూల్‌కు చేరుకున్న లత అక్కడ బస్సు ఆపకపోవడంతో మెహదీపట్నం వరకు కారులో ఛేజ్‌ చేసి బస్సుకు అడ్డంగా నిలవగా, బస్సు డ్రైవర్‌ ఆమెను పత్రికలో రాయలేని భాషలో తిట్టడం ప్రారంభించాడు.

 శ్రుతి మించిన డ్రైవ‌ర్ ఆగ‌డాలు..! బంధువుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన మ‌హిళ‌..!!

శ్రుతి మించిన డ్రైవ‌ర్ ఆగ‌డాలు..! బంధువుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన మ‌హిళ‌..!!

ఈ మాటలు బయట ఉన్న ఆమెకు వినిపించలేదు. బస్సు ఎక్కాక ఆమెతో పాటు అతని స్నేహితుడిని సైతం ఇదే పద్ధతిన తిడుతుండటంతో ఆమె డ్రైవర్‌పై చేయి చేసుకుంది. దీంతో డ్రైవర్‌ సైతం ఆమెపై చేయి చేసుకుని, బూతులు తిట్టాడు. ఇదంతా బస్సులో ప్రయాణిస్తున్న కొందరు వీడియో కూడా తీశారు. ఇదే విషయంపై ఆమె 100కు ఫోన్‌ చేయగా వారు సూర్యరావుపేట పోలీసులకు సమాచారం అందించగా, వారు ఆమెతో ఫోన్‌ మాట్లాడి, ఇక్కడ బస్సు ఆపితే అందరూ ఇబ్బంది పడతారని, కాబట్టి మీరు విజయవాడకు వెళ్లాక అక్కడే కేసు నమోదు చేయాలని సూచించారు.

 బెజవాడలో డ్రైవర్‌కు దేహశుద్ధి..! మ‌దమెక్కిన డ్రైవ‌ర్ ను చిత‌క‌బాదిన ప్రయాణికురాలి బంధువులు..!

బెజవాడలో డ్రైవర్‌కు దేహశుద్ధి..! మ‌దమెక్కిన డ్రైవ‌ర్ ను చిత‌క‌బాదిన ప్రయాణికురాలి బంధువులు..!

ఆ తర్వాత ఆమె వీడియోను, జరిగిన విషయాన్ని లత తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పగా ఆమె బంధువులంతా గవర్నరుపేటలోని మమతా హోటల్‌ సమీపంలో బస్సు ఆగగానే డ్రైవర్, అతని సహాయకుడిపై విరుచుకుడి దేహశుద్ధి చేశారు. అనంతరం వారిద్దరితో ఆమె కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించారు. ఇలాగే ఎవరితోనూ వ్యవహరించకూడదని డ్రైవర్‌కు బుద్ధి చెప్పినట్లు లత తండ్రి మీడియాకు వివరించారు.

English summary
The driver of a woman passenger was booked for a ticket to Vijayawada through Diwakar Travels. while travelling hyderabad to vijayawada the bus driver abused the women for without reason. Then traveling across the road, the passenger was worried about the drivers behavior.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X