• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టిడిపి కార్యాలయానికి డిఎల్: అభ్యర్థుల కసరత్తు

By Pratap
|

DL Ravindra Reddy
కడప: కడప జిల్లా మైదుకూరు శాసనసభ్యుడు, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి మంగళవారంనాడు మైదుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతారంటూ గత రెండు రోజులుగా జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మైదుకూరు టిడిపి కార్యాలయానికి వెళ్లారు. మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో డీఎల్ పాల్గొన్నారు. డీఎల్ త్వరలో టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై ఆయన సోమవారం మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓ సైకో అని, అలాంటి వారికి చెక్ పెట్టాలంటే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతివ్వాలని ఆయన అన్నారు. అపుడే సీమాంధ్రను స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా మార్చుకోగలమన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. తమ నియోజకవర్గంలోని 15 ఎంపిటిసి స్థానాలకు గాను 13 స్థానాలను గెలుచుకుని కార్యర్తలు సత్తాచాటాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని అనుచరులు, కార్యకర్తలతో చర్చించారు.

అంతేకాకుండా తాను తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై నాలుగైదు రోజుల్లో స్పష్టత ఇస్తానని డిఎల్ చెప్పారు. ఇదే అంశంపై స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former minister and Congress MLA has participated in a meeting held in Telugudesam party office at Maidukuru in Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more