వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా పాజిటీవ్ వస్తే అసెంబ్లీకి రావొద్దు.!ఏపీలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలకు టెస్టులు.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరికొద్ది గంటంలో ప్రారంభం కాబోతున్న శాసన సభ సమావేశాలకు హాజరయ్యే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ సిబ్బందికి కరోనా వైరస్ పాజిటీవ్ పరీక్షలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది ఏపి ప్రభుత్వం. కరోనా పాజీటీవ్ లక్షణాలు కనిపిస్తే సదరు ప్రజాప్రతినిధిని ఏంచేయాలన్న అంశాన్ని కూడ నిర్ధారించింది వైసిపి ప్రభుత్వం. అంతే కాకుండా దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోను కరోనా పాజిటివ్ కేసులు శరవేగంతో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శాసన సభా సమేవేశాు నిర్వహించడం సాహసోపేతమైన నిర్ణయంగా చర్చ జరుగుతోంది. అంతే కాకుండా శాసనసభ సమావేశాలంటే ఏకంగా 175 మంది ఎమ్మెల్యేలతో పాటు వారి సిబ్బందికూడా హాజరవుతుంటారు.

 Do not come to the assembly if Corona Positive.!Tests for MLAs available in AP.!

అంతే కాకుండా శాసనసభ సచివాలయ సిబ్బంది, మంత్రులు, ముఖ్యమంత్రి అనుచర గణం, విపక్ష నేతల అనుచర గణం, వారికి తోడు ప్రజాప్రతినిధుల భద్రత కోసం వేలాది సంఖ్యలో పోలీసు బలగాలు మొహరిస్తుంటాయి. ఇలాంటి విపత్కర సమయంలో కరోనా నియంత్రణ ఎలా సాధ్యమవుతుందనే అంశంపై ఏపి ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. అందుకే ముందస్తు చర్యగా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయం తీసుకున్న వెంటనే అమరావతిలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలకు వైద్య పరీక్షలు నిర్వమించడం మొదలు పెట్టింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఏపీ ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించింది. గుంటూరులోని ఐబీ అతిధి గృహంలో ఎమ్మెల్యేలు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ వైద్యులు. తేడా అనిపిస్తే ప్రజా ప్రతినిధులను హోం క్వారంటైన్ కు పంపించేదుకు ఏపి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

English summary
Do not come to the assembly if Corona Positive.!Tests for MLAs available in AP.!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X