వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా చేయొద్దు...కేసీఆర్‌ తిట్లకు టీడీపీ నేతల నిరసనపై చంద్రబాబు సూచనలు

|
Google Oneindia TeluguNews

అయితే టిడిపి నేతల ఈ నిరసన ప్రదర్శనలపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. టిడిపి నేతలు సంయమనం పాటించాలని...నిరసన పేరుతో ఎలాబడితే అలా వ్యవహరించవద్దని తమ పార్టీ నేతలకు సూచించారు. ముఖ్యంగా కెసిఆర్ చిత్రపటాన్ని చెప్పుతో కొడుతూ కర్నూలు టిడిపి నేత బంగి అనంతయ్య నిర్వహించిన నిరసన ప్రదర్శనను చంద్రబాబు తప్పుబట్టారు. బంగి అనంతయ్య నిరసన తీరు సరికాదన్నారు.

Recommended Video

మంత్రి వర్గ సహచరులతో చంద్రబాబు అత్యవసర సమావేశం

ఎవరింట్లోనే ఐటీ దాడులతో నీకేం భయం బాబూ! నీ ఇంట్లో..: జగన్ ఎవరింట్లోనే ఐటీ దాడులతో నీకేం భయం బాబూ! నీ ఇంట్లో..: జగన్

కెసిఆర్ చేస్తున్న విమర్శలకు నిరసనగా అంటూ టిడిపి నేతలు కూడా మరీ దూకుడుగా వ్యవహరించడం సరికాదని, అప్పుడు కెసిఆర్ కు మనకు తేడా ఏముంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలిసింది. కెసిఆర్ తీరును ఆంధ్రా ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా హర్షించడం లేదని చంద్రబాబు ఈ సందర్భంగా టీడీపీ నేతలకు తెలిపారు.

Do not do that ...CM Chandrababu advised to TDP leaders protest against KCR

ఇదిలావుంటే సీఎం చంద్రబాబును చూసి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 10న అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి... అనంతరం మీడియాతో మాట్లాడారు.

సిఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగుట్ట సమీపంలోని బీటీపీ ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారని... అనంతరం రైతులతో ముచ్చటిస్తారని వెల్లడించారు. అభద్రతా భావంతోనే సిఎం చంద్రబాబు పై కెసిఆర్ ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మంత్రి కాల్వ దుయ్యబట్టారు. మరోవైపు సీఎం చంద్రబాబుపై కేంద్రప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మంత్రి కాల్వ ఆరోపించారు.

English summary
Amaravathi:CM Chandrababu pointed out and has given direction to their party leaders that they do not do hectic protests over KCR comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X