• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సున్నిత‌మైన అంశం ప‌ట్ల రాద్దాంతం వ‌ద్దు..! ఇక ఆపండి..! వైసీపి క్యాడ‌ర్ కు ముఖ్య‌నేత‌ల సూచ‌న‌..!!

|

హైద‌రాబాద్ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైందా? సున్నిత‌మైన అంశం ప‌ట్ల అతిగా స్పందించి ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిందా..? అన‌వ‌స‌ర‌వు అంశం ప‌ట్ల జోక్యం చేసుకుని నాలిక క‌రుచుకుందా..? టీడీపీ నాయకులు వైసీపీపై విరుచుకుపడిన తీరు ఆ నాయకులను డిఫెన్స్‌లో పడేసిందా? మోతాదుకు మించి స్పందించామని పార్టీ నేతలు గుస‌గుస‌లాడుకుంటున్నారా..? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అదికార ప్ర‌తిప‌క్షాల మ‌ద్య ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లతో ఏపీలోనూ రాజకీయం వెడేక్కుతోంది. ఇంత‌కి సున్నిత‌మైన అంశం అని తెలిసిన‌ప్ప‌టికి వైసీపి నేత‌లు ఎందుక‌లా స్పందించారు..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

ఏపిలో భ‌వోద్వేగాలు..! క్యాష్ చేసుకునే ప‌నిలో టీడిపి, వైసీపి..!!

ఏపిలో భ‌వోద్వేగాలు..! క్యాష్ చేసుకునే ప‌నిలో టీడిపి, వైసీపి..!!

తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువడిన త‌ర్వాత ఏపీలోని పలు జిల్లాలో వైసీపీ నేతలు రోడ్ల మీదకు వచ్చి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉంది. వైసీపీ, జనసేన పార్టీలు అసలు పోటీ జోలికే వెళ్లలేదు. కూకట్‌పల్లి సహా పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వైసీపీ బహిరంగంగానే మద్దతు ప్రకటించింది. ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు స్థానిక నాయకులు.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వ‌చ్చిందంటే ఇదే..!సంబ‌రాలతో సందిగ్దంలో ప‌డిన వైసీపి..!!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వ‌చ్చిందంటే ఇదే..!సంబ‌రాలతో సందిగ్దంలో ప‌డిన వైసీపి..!!

గెలిచిన వెంటనే వైసీపీకి బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్ర‌ముఖంగా ప్రాచూర్యం పొందాయి. అయితే ఏపీలో పలుచోట్ల వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకోవడాన్ని టీడీపీ తిప్పికొట్టింది. ఈ పరిణామాన్ని ప్రత్యేకహోదా సెంటిమెంట్‌తో ముడిపెట్టింది. ఏపీకి ప్రత్యేకహోదా వద్దన్న టీఆర్ఎస్‌కు, ఏపీ ప్రజలను తిట్టిపోసే కేసీఆర్‌కు వైసీపీ ఎలా మద్దతిస్తుందని పలువురు టీడీపీ నేతలు నిలదీశారు. వారు గెలిస్తే ఏపీలో సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలు చేసిన ఈ వ్యాఖ్యల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో కూడా మంచి స్పంద‌న వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణ‌లో టీఆర్ఎస్ ను బ‌ల‌ప‌రిచిన వైసీపి..! త‌ప్పుబ‌డుతున్న టీడిపి..!!

తెలంగాణ‌లో టీఆర్ఎస్ ను బ‌ల‌ప‌రిచిన వైసీపి..! త‌ప్పుబ‌డుతున్న టీడిపి..!!

తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడి పండగ చేసుకోవడం ఏంటని వైసీపి నేత‌ల‌ను టీడిపి నేత‌లు సూటిగా నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జగన్ వ్యవహరిస్తున్నారనీ, ఏపీ వ్యతిరేకులతో జగన్ చేతులు కలుపుతున్నారనీ బహిరంగంగానే ఆ పార్టీకి చెందిన మరికొందరు సీనియర్లు తప్పుబట్టారు. టీడీపీ నాయకుల ప్రచారంతో వైసీపీ ఇబ్బందుల్లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. కొందరు తటస్థులు సైతం వైసీసీ వ్యవహారంపై పెదవి విరుస్తున్నారు. వైసీపీ, జనసేన, టీఆర్ఎస్ పార్టీలు మోదీ డైరెక్షన్‌లో పనిచేస్తున్నాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీఆర్ఎస్‌తో చేతులు కలిపిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీంతో వైసీపీ వ్యూహకర్తలు మేల్కొని న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌ను పూనుక‌రున్నారు.

టీఆర్ఎస్ వైసీపి బందాన్ని ప్ర‌త్యేక హోదా తో కొట్టిన టీడిపి..! ఆత్మ ర‌క్ష‌ణ‌లో వైసీపి..!!

టీఆర్ఎస్ వైసీపి బందాన్ని ప్ర‌త్యేక హోదా తో కొట్టిన టీడిపి..! ఆత్మ ర‌క్ష‌ణ‌లో వైసీపి..!!

తెలంగాణలో కూటమికి పట్టిన గతే ఏపీలో చంద్రబాబుకూ పడుతుందని విమర్శలు పెంచారు. అసలు రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌తో టీడీపీ ఎలా పొత్తుపెట్టుకుంటుందని ఎదురుదాడికి దిగారు. ఇలా ఇరు పార్టీల నాయకుల పరస్పర ఆరోపణలు- విమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కింది. వైసీపీపై మూకుమ్మడి దాడికి దిగిన టీడీపీ నేతలు సైతం విమ‌ర్శ‌లకు ప‌దును పెంచారు. అయితే ప్రత్యేకహోదా అంశం ఆంధ్రాప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నందున అత్యుత్సాహం పనికిరాదని పార్టీ శ్రేణులకు వైసీపి సీనియ‌ర్ నేత‌లు హితబోధ చేస్తున్నట్టు స‌మాచారం. టీడీపీ నేతలు మాత్రం దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుని వైసీపీని దోషిగా నిలబెట్టేందుకు శాయశక్తులా కృషిచేస్తున్న‌ట్టు పెద్ద యెత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో వైసీపి ముఖ్య‌నేత‌లు పార్టీ శ్రేణుల వ‌ల్ల ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్న త‌ప్పుడు సంకేతాల‌కు బ్రేకులు వేసే ప‌నిలో ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది.

English summary
AP politics has been warmed with criticism of both parties' leaders. TDP leaders, who landed in the attack on the YCP, also increased sharp criticism. However, the senior state leaders are advised to inform the Party's rank that the special category is linked to the Andhra Pradesh sentiment. And advising the cadre that Dont over react on that issue negatively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X