వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దరిద్రం పడితే తప్ప పోలీస్ స్టేషన్ కు వెళ్లొద్దు .. 7 నెలలు జైల్లో ఉన్న అనుభవం నాది .. కోటంరెడ్డి

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలయ్యింది. కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది. అయితే ఈ నేపధ్యంలో టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై శారీరక దాడులకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని వారిలో భరోసా నింపటానికి యాత్ర చేస్తామని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు . ఇక ఈ నేపధ్యంలో అధికార వైసీపీ నేతలు దాడుల విషయంలో ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు.

చింతమనేనికి వనజాక్షి చింత..! పొగరు తగ్గించుకుంటానంటున్న ప్రభాకర్..!!చింతమనేనికి వనజాక్షి చింత..! పొగరు తగ్గించుకుంటానంటున్న ప్రభాకర్..!!

 దాడులు జరిగితే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చెయ్యమన్న మంత్రి .. పోలీస్ స్టేషన్ కు వెళ్లొద్దు అన్న ఎమ్మెల్యే

దాడులు జరిగితే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చెయ్యమన్న మంత్రి .. పోలీస్ స్టేషన్ కు వెళ్లొద్దు అన్న ఎమ్మెల్యే

ఎక్కడ ఏమైనా గొడవలు జరిగినా, దాడులకు పాల్పడినా నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యాలని హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే . కానీ గ్రామాల్లో గొడవలు సహమని , సాధ్యమైనంత వరకు ఎవరూ పోలీస్ స్టేషన్ లకు వెళ్లకూడదని పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి . ప్రస్తుతం కోటం రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

పోలీస్ స్టేషన్ వెళ్ళటం అంటే దరిద్రం పట్టటమే అన్న ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

పోలీస్ స్టేషన్ వెళ్ళటం అంటే దరిద్రం పట్టటమే అన్న ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

ప్రతీ గ్రామంలో గొడవలు సహజంగానే ఉంటాయని అలాగని పోలీస్ స్టేషన్ కు వెళ్లొద్దని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హితవు పలికారు . ప్రతీ చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దని ఆయన పేర్కొన్నారు . పోలీస్ స్టేషన్ లో కాకుండా బయటే సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు . నెల్లూరు జిల్లా దంతూరు గ్రామంలో జరిగిన వైయస్ఆర్ రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దరిద్రం పడితే తప్ప ఎఫ్పుడో గానీ స్టేషన్ కు వెళ్లొద్దని హితవు పలికారు. గతంలో తాను కూడా వివిధ కేసుల్లో జైలు కెళ్లి వచ్చానని దాని ఫలితం తనకు తెలుసునని అనుభవంతో చెప్తున్నానని ఆయన అన్నారు.

23 కేసుల్లో 7 నెలలపాటు జైలులో ఉన్న అనుభవంతో చెప్తున్నా .. పోలీస్ స్టేషన్ కు వెళ్ళకండి అన్న కోటం రెడ్డి

23 కేసుల్లో 7 నెలలపాటు జైలులో ఉన్న అనుభవంతో చెప్తున్నా .. పోలీస్ స్టేషన్ కు వెళ్ళకండి అన్న కోటం రెడ్డి

తాను 23 కేసుల్లో 7 నెలలపాటు జైలులో ఉన్నానని దాని వల్ల చాలా నష్టపోయానని పేర్కొన్నారు. తాను ఎంత కోల్పోయానో తనకు తెలుసునన్నారు. గ్రామంలో రాజకీయ దాడులు తగ్గించుకోవాలని చెప్పి అందరం కలిసిమెలిసి ఉండాలని ఇక రాజకీయాల జోలికి వెళ్లొద్దన్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి .ప్రతీ మనిషికి గొడవలు ఉండటం సహజమని అయితే వాటిని గ్రామంలోనే పరిష్కరించుకుంటే మంచిదని ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతామో అప్పుడే దరిద్రం పడుతుందని , గ్రామపరిధి దాటి ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ కు వెళ్లారో అప్పుడే పతనం ప్రారంభమైనట్టని ఆయన అభిప్రాయం తెలియజేశారు.తగాదాల పేరుతో పోలీస్ స్టేషన్ కు వెళ్తే చాలా ఇబ్బంది పడతారని ఆయన గ్రామస్థులతో చెప్పారు.

English summary
MLA Kotam Reddy Sridhar Reddy made interesting comments on the clashes and attacks in AP. He said he had been in jail for 7 months in 23 cases and had suffered the most. He knew how much he had lost. Political grudges in the village should be reduced and all should stay together, says the politician.He said that it is natural for every man to fight, but it is better to address them in the village.He told the villagers that when they went to police station , it was worsening the situations in the village kotam reddy stated .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X