వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుండబద్దలు కొట్టిన బాబు: ఆ విషయం తెలిశాక!, వాళ్ల ఫైల్స్ కదలొద్దని ఆర్డర్స్..

ఆ జాబితాలో ఉన్న నేతలెవరికీ ఇకనుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి పనులు జరగకుండా చూడాలని ఆదేశాలు కూడా ఇచ్చారట.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: నంద్యాల ఉపఎన్నికను తమ ఖాతాలో వేసుకుని మంచి ఊపుమీదున్న టీడీపీ.. అదే ఊపుతో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నంద్యాల తర్వాత వరుసగా జరిగిన కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లోను తమదే పైచేయి కావడంతో.. వచ్చే ఎన్నికల్లోను గెలుస్తామన్న ధీమా ఆ పార్టీలో ఏర్పడింది.

అయితే టీడీపీకి ఇంతటి బూస్టింగ్ ఇచ్చిన నంద్యాల విజయం వెనుక ఆ పార్టీ ప్రలోభాలనే నమ్ముకుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అభివృద్ది-సంక్షేమ పథకాలను అడ్డం పెట్టుకుని ప్రజలను ఒకరకంగా బ్లాక్ మెయిల్ చేశారని ప్రతిపక్షం ఇప్పటికీ ఆరోపిస్తోంది. అలాగే కోట్లు కుమ్మరించి నంద్యాల ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారనేది మరో ఆరోపణ.

నంద్యాల గేమ్: టర్నింగ్ పాయింట్ ఇదే?.. ఓటరు నాడి పట్టేదెవరో!నంద్యాల గేమ్: టర్నింగ్ పాయింట్ ఇదే?.. ఓటరు నాడి పట్టేదెవరో!

ఈ ఆరోపణల్లో నిజమెంతనేది తెలియదు గానీ.. దీనికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నంద్యాలలో పంపిణీ చేయమని ఇచ్చిన డబ్బును స్థానిక టీడీపీ నేతలు.. తమ జేబుల్లోనే నింపుకున్నారట. ఒక్కొక్కరు కనీసం రూ.2కోట్ల వరకు వెనకేసుకున్నారని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఖర్చుల లెక్కను పరిశీలించిన సీఎం.. స్థానిక నేతలపై అనుమానం వ్యక్తం చేశారట.

do not move that files says cm chandrababu naidu to officials

ఎక్కడో తేడా కొడుతోందని భావించిన సీఎం చంద్రబాబు.. దీనిపై అంతర్గతంగా విచారణ కూడా చేయించారట. ఇంకేముంది.. నంద్యాల తమ్ముళ్లు కోట్ల కొద్ది డబ్బు మింగేసిన మాట నిజమేనని తేలిందట. విషయం తెలిసిన చంద్రబాబు వారిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు! ఆ జాబితాలో ఉన్న నేతలెవరికీ ఇకనుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి పనులు జరగకుండా చూడాలని ఆదేశాలు కూడా ఇచ్చారట. వారికి సంబంధించిన పైరవీ ఫైళ్లను పెండింగ్ లోనే ఉంచాలని, వాటిని కదలకుండా చేయాలని ఆయన ఆదేశించినట్లు చెబుతున్నారు.

English summary
AP CM Chandrababu Naidu declared that he never encourage lobbyings of Nandyala leaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X