అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్: టెలిగ్రాఫ్ చట్టం 1885 ఏం చెబుతోంది?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద చిచ్చునే రాజేసాయి. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టవడం, ఆ తర్వాత చంద్రబాబు వాయిస్‌తో ఆడియో టేపులు మీడియాలో విడుదలయ్యాయి.

దీంతో చంద్రబాబు ఫోన్ సంభాషణను టీర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా ట్యాప్ చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, అలాంటిదేమీ లేదని, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ మాకు పట్టలేదని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ నేఫథ్యంలో ఫోన్ ట్యాపింగ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఫోన్ ట్యాపింగ్‌లో టెలిగ్రాఫ్ చట్టం 1885 ఏం చెబుతోంది?

బ్రిటిష్‌ ప్రభుత్వం 1885లో 'భారత టెలిగ్రాఫ్‌ చట్టం-1885'ను రూపొందించింది. ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం చట్ట బద్దమా? కాదా..? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టెలిగ్రాఫ్ చట్టం 1885 ఏం చెబుతోంది? టెలికాం సంస్థల నిబంధనల ప్రకారం ఇటువంటి ఫోన్ ట్యాపింగులు సాధారణంగా జరుగుతూ ఉంటాయా లేదా తెలుసుకుందాం.

Do the Police Have the Right to Tap My Telephone?

టెలికం సర్వీసు ప్రొవైడర్లకు లైసెన్సులు మంజూరు చేసేటప్పుడు ఒప్పందంలో ఖచ్చితమైన నియమాల్ని పొందుపరుస్తారు. ఫోన్ ట్యాపింగ్ కోసం కావాల్సిన అనుమతుల్ని సంబంధిత అధికారుల నుంచి తీసుకున్న తర్వాత మాత్రమే ఫోన్లను ట్యాప్ చేయడం జరుగుతుంది. అయితే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో అవన్నీ జరిగాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.

చంద్రబాబు వాయిస్‌ను రికార్డు చేశారిలా...?

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాడే మొబైల్ ఫోన్‌లో కాల్ రికార్డింగ్ చేసే ఒక యాప్‌ను ఏసీబీ అధికారులు డౌన్ లోడ్ చేశారని తెలుస్తోంది. ఈ యాప్ సాయంతోనే ఏపీ సీఎం చంద్రబాబుతో జరిపిన సంభాషల్ని సైతం రికార్డు చేశారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో ఏసీబీ అధికారులు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లయితే అలాంటి రికార్డింగ్ సంభాషణల్ని కోర్టు సాక్ష్యంగా పరిగణిస్తుందా లేదా అన్న విషయంపై భిన్నాభిప్రాయలు వినిపిస్తున్నాయి.

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రజప్రయోజనాల దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతిలిచ్చినట్టుగానే రికార్డు చేసిన సంభాషణల్ని సైతం కోర్టు కీలక సాక్ష్యంగానో, ఆధారంగానో పరిగణించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
Police rely on a variety of tools to investigate crimes, including the ability to tap into a suspect's telephone conversations. While such wiretaps can produce very good evidence against potential criminals, it is also a major invasion of privacy and police must follow strict procedures when performing a wiretap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X