అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ అప్పు ఎంతో తెలుసా..? 8 కి.మీ పరిధి కోసం లక్ష కోట్లా..? అసెంబ్లీలో సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

రాజధాని కోసం లక్షా 9 వేల కోట్ల ఖర్చుచేయాల్సి వస్తోందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు లాగా యుద్ధప్రతిపాదికన పనిచేసిన రాజధాని నిర్మాణానికి వందేళ్లు పడుతోందని చెప్పారు. అదీ లక్ష కోట్ల వ్యయం అంచనా ఉంటే.. పెరిగితే మరింత ఆలస్యమవుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.2.57 లక్షల కోట్లకు చేరిందని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సమయంలో రాజధాని కోసం మరో లక్ష కోట్లు ఖర్చుచేయడం భారం అని పేర్కొన్నారు.

అప్పుల కుప్ప

అప్పుల కుప్ప

చంద్రబాబు నాయుడు హయాంలో చేసిందేమీ లేదని అప్పులే మిగిల్చారని జగన్ గుర్తుచేశారు. కార్పొరేషన్లకు రూ.57 వేల కోట్ల బకాయి చెల్సించాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం దిగిపోయే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి అందజేసిన మొత్తం ఇంది అన్నారు. దీంతో పాటు వివిధ సంస్థలకు రూ.39 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. విద్యుత్ సంస్థలకు కూడా బకాయి చెల్లించలేదని చెప్పారు.

కార్పొరేషన్లకు కూడా..

కార్పొరేషన్లకు కూడా..

చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టే వరకు 2893 కోట్లు ఉన్న అప్పు.. మార్చి 2019 వరకు అది 21 వేల కోట్లకు చేరిందన్నారు. కానీ అప్పులు ఉన్నాయని ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకొలేదని సీఎం జగన్ చెప్పారు. ప్రజలను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కానీ రాజధాని కోసం లక్ష కోట్లు వ్యయం అవసరం లేదని, ఉత్తరాంధ్రలో రాజధాని మారిస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

8 కి.మీ కోసం..

8 కి.మీ కోసం..


8 కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్లు ఖర్చుచేయడం మంచిది కాదని ఆలోచనకు వచ్చామని చెప్పారు. ఈ మేరకు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హై పవర్ కమిటీ నివేదిక అందజేశాయని సీఎం జగన్ చెప్పారు. ప్రాజెక్టులకు పెద్దపీట వేయాలనుకొంటున్నామని.. దీంతో రైతుల సాగుకు ఇబ్బంది ఉండదన్నారు.

English summary
do you know ap lend ap cm jagan ask.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X