• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ సర్కారుకు కోర్టుల కళ్లెం ఇందుకే.. ఎంపీ గల్లా అనూహ్య కామెంట్లు.. సీఎంకు కన్నా, ఉమ చురకలు..

|

రాజధాని తరలింపు నుంచి ఆఫీసులకు రంగులేసే అంశం దాకా.. జగన్ సర్కారు జారీ చేసిన జీవోలు, తీసుకున్న విధాన నిర్ణయాలపై ఆంధప్రదేశ్ హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా శుక్రవారం ఒక్కరోజే మూడు కీలక అంశాలపై హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించిన న్యాయస్థానం.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తేసింది, అలాగే, పంచాయితీ భవనాల రంగులకు సంబంధించిన జీవో 623ను కొట్టేసింది.

ప్రతిపక్షం ఫైర్..

ప్రతిపక్షం ఫైర్..

కోర్టు తీర్పులపై అధికార పక్షం మౌనంగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు స్వాగతించారు. అదే క్రమంలో కోర్టు తీర్పులపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అనూహ్య కామెంట్లు చేయగా, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా సీఎం జగన్ కు ఓ లేఖరాశారు.

డా.సుధాకర్ తల్లి సంచలన వ్యాఖ్యలు.. చెంచాగాళ్ల కుట్ర.. పిచ్చెవరికో సీబీఐ తేల్చుతుందంటూ..

హైకోర్టుకు థ్యాంక్స్..

హైకోర్టుకు థ్యాంక్స్..

చట్టం అంటే మాత్రం గౌరవంలేని జగన్ సర్కారును నియంత్రణలో ఉంచుతున్నందుకుగానూ న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు వెలువరిస్తున్న తీర్పుల సంఖ్య మరింత పెరిగిందని, శుక్రవారం నాటికి మరో 3 తీర్పులు జత కలిశాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్న టీడీపీ ఎంపీ.. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపై ట్విటర్ వేదికగా స్పందించారు.

ఇకనైనా కుట్రలు మానండి..

ఇకనైనా కుట్రలు మానండి..

‘‘హైకోర్టు వరుసగా మొట్టికాయలు వేస్తోంది. ఇప్పటికైనా తాము అనుసరిస్తున్న పంథా సరైనది కాదని జగన్ సర్కారు తెలుసుకోవాల్సిన అవసరముంది. అధికారం చేపట్టిన నాటి నుంచి కుట్ర రాజకీయాలు, ప్రతీకార ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. ఆ రకమైన ఆలోచనా ధోరణిలో తీసుకునే నిర్ణయాలు, చర్యల ద్వారా అధికార పక్షం ఎంతో విలువైన న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేస్తోంది. తద్వారా పన్నులు చేస్తోన్న జనం డబ్బులు కూడా వేస్టవుతున్నాయి. అన్నింటికీ మించి, ఏపీ అభివృద్ధి, ప్రజాసంక్షేమం కుంటుపడిపోతున్నది..''అని జయదేవ్ ఫైరయ్యారు.

సీఎంకు కన్నా లేఖ..

సీఎంకు కన్నా లేఖ..

మాస్కులు అడిగిన పాపానికి నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావును ప్రభుత్వం సస్పెండ్ చేయడం దారుణమని, హైకోర్టు తీర్పు తర్వాతైనా ఆయనపై సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. డాక్టర్ వ్యవహారంలో పోలీసులు నిబంధనలు పాటించలేదన్న విషయంలో కోర్టు తీర్పుతో స్పస్టమైపోయిందని, ప్రశ్నించే వ్యక్తులపై ఇలాంటి చర్యలు సబబు కాదని కన్నా హితవు పలికారు. డాక్టర్ సుధాకర్ అంశంతోపాటు పీజీ మెడికల్‌ అడ్మిషన్లలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటూ సీఎంకు కన్నా శుక్రవారం లేఖ రాశారు.

  TDP MP Galla Jayadev Supports CM Jagan's Comment On Covid 19
  అందుకే సీబీఐ ఎంక్వైరీ..

  అందుకే సీబీఐ ఎంక్వైరీ..

  సీఎం జగన్ అసమర్థత వల్ల ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని, డాక్టర్ సుధాకర్ కేసులో మూడు జిల్లాల పోలీసు యంత్రాంగం విఫలమైన కారణంగానే హైకోర్టు ఆ వ్యవహారాన్ని సీబీఐ ఎంక్వైరీకి అప్పగించిందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ‘‘హైకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రభుత్వానికి చెంపపెట్టు. డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఎక్కడా గాయాలు లేవని చెప్పారు. కానీ జడ్జి విచారణలో అది తప్పని తేలింది. కాబట్టే సర్కారు నివేదికను పక్కన పెట్టి సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. సీఎం తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర డీజీపీ ఇప్పటికే రెండు సార్లు హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది''అని ఉమ విమర్శించారు.

  English summary
  responding to ap high court orders on doctor sudhakar and other cases, tdp mp galla jayadev said Judiciary which keeps the ysrcp Govt which do not respect the law in check. bjp kanna laxminarayana, tdp devineni uma also slams cm jagan
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X