విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డాక్టర్ సుధాకర్ కేసులో మరో ట్వీస్ట్.. ట్రీట్మెంట్‌పై తల్లి అనుమానం.. హైకోర్టుకు ఫిర్యాదు..

|
Google Oneindia TeluguNews

మాస్కుల వివాదంలో సస్పెన్షన్‌కు గురై, ప్రస్తుతం విశాఖపట్నం మెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన కొడుక్కి అందిస్తోన్న ట్రీట్మెంట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుధాకర్ తల్లి కస్తూరీబాయి ఏపీ హైకోర్టుకు ఫిర్యాదు లేఖ రాశారు. సీబీఐ విచారణ కంటే ముందే తన కొడుకును నిజంగా పిచ్చివాడిగా మార్చేలా కుట్రలు జరుగుతున్నాయని, కాబట్టి, సీసీ కెమెరాల మధ్య నిపుణులైన ప్రైవేటు వైద్యులతో కోర్టు పర్యవేక్షణలో చికిత్స జరిపించాలని ఆమె లేఖలో విజ్ఞప్తి చేశారు.

డాక్టర్ సుధాకర్ సంచలన వాగ్మూలం.. లేడీ కానిస్టేబుల్‌తో అలా చేయించి.. అర్ధనగ్నంగా మార్చారంటూ..డాక్టర్ సుధాకర్ సంచలన వాగ్మూలం.. లేడీ కానిస్టేబుల్‌తో అలా చేయించి.. అర్ధనగ్నంగా మార్చారంటూ..

 హైకోర్టు స్పందన?

హైకోర్టు స్పందన?

డాక్టర్ సుధాకర్ కు కొనసాగుతోన్న చికిత్సపై అతని తల్లి కావేరీబాయి నేరుగా హైకోర్టు న్యాయమూర్తికే లేఖ రాయడం గమనార్హం. ఇప్పటికే సుధాకర్ అరెస్టు వ్యవహారంలో వైజాగ్ పోలీసుల తీరును తప్పుపట్టిన కోర్టు.. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం తెలిసిందే. డాక్టర్ తల్లి లేఖపై జడ్జిలు మంగళవారమే ఒక నిర్ణయం తీసుకుని, తదుపరి ఆదేశాలు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ అనుమానం కూడా ఇదే..

టీడీపీ అనుమానం కూడా ఇదే..

డాక్టర్ సుధాకర్ కేసులో ఇదే తరహా అనుమానాలు టీడీపీ నేతలు కూడా వ్యక్తం చేయడం గమనార్హం. మాస్కులు అడిగిన పాపానికి దళితుడైన డాక్టర్ సుధాకర్‌ను బలి చేసేందుకు వైసీపీ సర్కారు కుట్ర పన్నిందని, లేని పిచ్చిని తగ్గించే పేరుతో డాక్టర్ ను నిజంగానే పిచ్చివాణ్ని చేసేలా తప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారని, సుధాకర్ ను ట్రీట్ చేస్తున్న డాక్టర్లతో ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి సురేశ్ ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. సుధాకర్ కు ప్రైవేటు వైద్యులతో ట్రీట్మెంట్ చేయించాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించకపోతే టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని లేవదీస్తామని వర్ల హెచ్చరించారు. ఆయనీ కామెంట్లు చేసిన మరుసటిరోజే డాక్టర్ తల్లి హైకోర్టును ఆశ్రయించడం విశేషం.

 సీబీఐ తేల్చాల్చిన ప్రశ్నలెన్నో..

సీబీఐ తేల్చాల్చిన ప్రశ్నలెన్నో..

ఏపీ హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించడంతో డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. అరెస్టు చేసిన గంటల వ్యవధిలోనే అతను మానసిక రోగి అని నిర్ధారించడం, ఆ విషయాన్ని మీడియాకు వెల్లడించడం చర్చనీయాంశమైంది. ఈ నెల 16న డాక్టర్‌ సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తొలుత 4వ టౌన్ స్టేషన్ కు, అక్కణ్నుంచి కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. కొన్ని టెస్టులు నిర్వహించిన పిమ్మట ప్రభుత్వ మానసిక ఆస్పత్రికి తరలించగా, అక్కడి డాక్టర్లు.. సుధాకర్ ‘ఎక్యూట్‌ అండ్‌ ట్రాన్సియంట్‌ సైకోసిస్' అనే వ్యాధితో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వెంటనే ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, నిమిషాల వ్యవధిలోనే ఒక వ్యక్తి మానసిక రోగా? కాదా? అన్నది ఎలా తేలుస్తారనేదానిపై సీబీఐ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

వాగ్మూలంలో తీవ్ర ఆరోపణలు..

వాగ్మూలంలో తీవ్ర ఆరోపణలు..

హైకోర్టు ఆదేశాల మేరకు విశాఖ మెజిస్ట్రేట్.. డాక్టర్ సుధాకర్ నుంచి వాగ్మూలాన్ని రికార్డు చేశారు. అందులో ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మాస్కులు అడిగినందుకే తనపై ఉన్నతాధికారులు కక్ష కట్టారని, సస్పెన్షన్ ఉత్తర్వులను అంబులెన్స్ డ్రైవర్ తో పంపించారని, గుర్తు తెలియని వ్యక్తులు తన కొడుకు బైక్ ఎత్తుకెళ్లగా, ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వెళితే లేడీ కానిస్టేబుల్ చేయిపట్టుకుందేకాక, రివర్సులో చితకబాదారని సుధాకర్ పేర్కొన్నారు. ఈనెల 16న మరోసారి పోలీసుల కావాలనే తనను రెచ్చగొట్టారని, కారులో 10 లక్షలు కొట్టేసి, మద్యం బాటిళ్లను పెట్టి, తనపై పిచ్చివాడనే ముద్ర వేశారని స్టేట్మెంట్ లో పేర్కొన్నారు.

English summary
expressing doubts on treatment provided to doctor sudhakar in vizag mental hospital, his mother kaveribai wrote a letter to ap high court on monday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X