వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ ను ప్రచారం ఆపమంటున్న డాక్టర్లు ..ససేమిరా అంటున్న పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

ఒకపక్క ఏపీలో ఎండల వేడితో పాటు పొలిటికల్ హీట్ కూడా తారాస్థాయికి చేరుతుంది. సభలు, సమావేశాలు , రోడ్ షో లతో నేతలు ప్రజలమద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన టీడీపీ , వైసీపీ లతో పాటు జనసేన కూడా ఎన్నికల ప్రచారంలో ముందు వరుసలో ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కు ప్రజల మద్దతు ఓటు బ్యాంకుగా మారుతుందో లేదో కానీ ఆయన సభలకు మాత్రం జనం పోటెత్తుతున్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా పవన్ మాత్రం తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

అనారోగ్యానికి గురైన పవన్ .. ప్రచారం పూర్తిగా ఆపాలని డాక్టర్ల సలహా

అనారోగ్యానికి గురైన పవన్ .. ప్రచారం పూర్తిగా ఆపాలని డాక్టర్ల సలహా

అసలే ఎండాకాలం కావటంతో ప్రచారం నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రచారం చెయ్యటంలో బిజీగా ఉండి సమయానికి భోజనం కూడా చెయ్యకుండా ఆరోగ్యం పాడుచేసుకున్నారు. వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన పవన్ ను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. కానీ డాక్టర్ల సలహా పక్కన పెట్టి మరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్.

డాక్టర్ల సలహా పట్టించుకోని పవన్ .. ప్రజలపై కమిట్మెంట్ అలాంటిది అంటున్న చెర్రీ రామ్ చరణ్

డాక్టర్ల సలహా పట్టించుకోని పవన్ .. ప్రజలపై కమిట్మెంట్ అలాంటిది అంటున్న చెర్రీ రామ్ చరణ్

ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా నిలిపివేయాలని వైద్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌కు సూచించారని సినీ నటుడు రామ్‌చరణ్ ప్రకటించారు. కానీ, ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారని ఆయన ప్రకటించారు. ప్రజల కోసం బాబాయి కమిట్మెంట్ అలాంటిది అని రామ్ చరణ్ తేజ్ చెప్పుకొచ్చారు . ఈ మేరకు రామ్ చరణ్ ఫేస్‌బుక్‌లో జనసేన చీఫ్ పవన్‌ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఆదివారం నాడు విజయవాడలో పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆయనను కలుసుకొన్నట్టుగా ఆయన వివరించారు. పవన్ కళ్యాణ్ చాలా నీరసంగా ఉన్నారని ఆయన వివరించారు.

నాన్న కోసం నర్సాపురం ప్రచారంలో పాల్గొన్న మెగా హీరో వరుణ్ తేజ్ ..జనసేన శ్రేణుల్లో జోష్నాన్న కోసం నర్సాపురం ప్రచారంలో పాల్గొన్న మెగా హీరో వరుణ్ తేజ్ ..జనసేన శ్రేణుల్లో జోష్

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పవన్ .. నేడు, రేపు మాత్రమే ప్రచారానికి అవకాశం

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పవన్ .. నేడు, రేపు మాత్రమే ప్రచారానికి అవకాశం

ఎన్నికల ప్రచారానికి నేడు, రేపు మాత్రమే సమయం ఉన్న కారణంతో పాటు, పవన్ కళ్యాణ్ కు ఉన్న పొలిటికల్ కమిట్‌మెంట్ కారణంగా డాక్టర్లు ఇచ్చిన సలహాను కూడ వదిలేశారు పవన్ కళ్యాణ్. పెందుర్తి, అనకాపల్లిలో నిర్వహించే ఎన్నికల సభల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకొన్నారని ఆయన ప్రకటించారు.పవన్‌తో పాటు డాక్టర్ల బృందం పర్యటిస్తామని కోరినా ఆయన అదేమీ వద్దని చెప్పారు. త్వరగా పవన్ కళ్యాణ్ కోలుకోవాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.అంతేకాదు ప్రజలకు సేవ చేయాలనే పవన్ కోరిక విజయవంతం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.మొత్తానికి చివరి రెండు రోజులపాటు ప్రచారంలో బాబాయికి బాసటగా రామ్ చరణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

English summary
Film actor mega hero Ramcharan announced that Pavan Kalyan, Janesena cheif, had advised to stop his election campaign due to his sickness . But Pavan Kalyan's decision to continue the election campaign has been announced. Ram Charan Tej said that the uncle pavan kalyan's Commitment for the people was like that. To this extent, Ram Charan shared a photo with Janasena chief Pavan Kalyan in Facebook. He met Pavan Kalyan at Vijayawada on Sunday and he said that Pavan's health condition is very bad .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X