గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంగళగిరిలో ఠాగూర్ తరహా 'సీన్': డాక్టర్ల నిర్వాకానికి కుటుంబ సభ్యులు షాక్!

డబ్బుల కోసం కక్కుర్తి పడే కొన్ని కార్పోరేట్ ఆసుపత్రులు.. శవాలకు కూడా ట్రీట్మెంట్ చేసి డబ్బులు గుంజుతున్నాయి. పేషెంట్ చనిపోయాడన్న విషయాన్ని దాచిపెట్టి.. ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించి లక్షల కొద్ది డ

|
Google Oneindia TeluguNews

గుంటూరు: డబ్బుల కోసం కక్కుర్తి పడే కొన్ని కార్పోరేట్ ఆసుపత్రులు.. శవాలకు కూడా ట్రీట్మెంట్ చేసి డబ్బులు గుంజుతున్నాయి. పేషెంట్ చనిపోయాడన్న విషయాన్ని దాచిపెట్టి.. ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించి లక్షల కొద్ది డబ్బులు గుంజుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలోను ఇదే ఘటన చోటు చేసుకుంది.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వరూప అనే యువతిని మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలియగానే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పరుగుతీశారు. అయితే స్వరూప ప్రాణానికి ప్రమాదమేమి లేదని డాక్టర్లు చెప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Family accuses Mangalagiri private hospital of treating 'dead' man for days.

రెండు రోజుల పాటు ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించి.. ఆపై స్వరూప చనిపోయిందని చెప్పారు. డబ్బు చెల్లించి శవాన్ని తీసుకుని వెళ్లాలన్నారు. అలా స్వరూప కుటుంబం నుంచి రూ.150లక్షలు గుంజారు. ఇంకా చెల్లించాలంటూ వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

స్వరూప చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి, ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అచ్చు ఠాగూర్ సినిమా తరహాలో జరిగిన ఈ ఘటనపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

English summary
Family accuses Mangalagiri private hospital of treating 'dead' man for days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X