వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఔనా?...నిజమా?...ఎపి ప్రభుత్వం ఆ లాయర్ కు గంటకు రూ.33 లక్షలు చెల్లిస్తుందా?

|
Google Oneindia TeluguNews

అమరావతి:సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న ఒక పోస్ట్ రాజకీయ శ్రేణుల్లోనే కాదు...సాధారణ ప్రజానికంలోనూ చర్చనీయాంశంగా మారింది. అది హై కోర్టు విభజనకు సంబంధించి తెలంగాణా ప్రభుత్వంపై ఎపి గవర్నమెంట్ సుప్రీం కోర్టులో వేసిన ఒక కేసు విషయమై న్యాయవాదికి చెల్లిస్తున్న భారీ ఫీజు విషయం.

రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ నడుమ ఉమ్మడి హైకోర్టును విభజించే అంశం విషయమై వాజ్యం నడుస్తోంది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలు ఏకంగా సుప్రీం కోర్టులో న్యాయపోరాటానికి దిగాయి. ఈ క్రమంలో ఈ కేసును ఎపి ప్రభుత్వం తరుపున వాదిస్తున్న న్యాయవాది ఫాలి నారిమన్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గంటకు 33 లక్షల రూపాయలు చెల్లిస్తోందట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని

ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల హైకోర్టు గా ఉన్న ఉమ్మడి ధర్మాసనంను వెంటనే విభజించి ఏ రాష్ట్రానికి, ఆ రాష్ట్రం హైకోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణా ప్రభుత్వం కోరుకుంటోంది. ఆ మేరకు రాష్ట్రం రెండుగా విడిపోయినా హైకోర్టు విభజన చేయకుండా జాప్యం చేస్తున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన ధనగోపాల్‌రావు ధర్మాసనంలో పిల్ దాఖలు చేశారు.

ఆ పిల్‌పై అప్పటి ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని డివిజన్‌ బెంచ్‌ వెలువరించిన తీర్పులో "ఏపి హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భూభాగంలోనే ఉండాలి...వేరే రాష్ట్ర భూభాగంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటుకు చట్టం ఒప్పుకోదు...ఏపి హైకోర్టు ఏర్పాటుకు సమయం తీసుకున్నప్పటికీ శాశ్వత ప్రాతిపదికపైనే ఉండాలి. తాత్కాలిక పద్ధతిపై ఉండకూడదు..'' అని తీర్పు వెలువరించారు.

ఉమ్మడి హై కోర్టును

ఉమ్మడి హై కోర్టును

ఈ క్రమంలో డివిజన్ బెంచి చెప్పిన తీర్పును తిరిగి సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరఫు అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి వాదించగా, అందుకు బదులుగా హై కోర్టు భవనం కోసం పలుసార్లు కేంద్రాన్ని నిధులు కోరామని...సంబంధిత రాష్ట్ర భూభాగంలోనే హైకోర్టు ఉండాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది కాబట్టి...గత తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని అన్నారు.

ఇదిలావుంటే ఇప్పటికిప్పుడు ఉమ్మడి హై కోర్టును విభజిస్తే ఎపి హై కోర్టుకు కూడా ప్రస్తుత హై కోర్టులోనే వసతి కల్పించగలమని తెలంగాణా ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ క్రమంలో ఎపి ప్రభుత్వం మాత్రం తాము భవనాలు సిద్దం చేస్తున్నామని, అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని...అప్పుడే ఉమ్మడి హై కోర్టు విభజన చేయాలని, నిబంధనలు కూడా అదే చెబుతున్నట్లు వాదిస్తోంది.

సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు

ఈ మేరకు సుప్రీం కోర్టులో ఈ కేసును వాదించడానికి సీనియర్ అడ్వకేట్ ఫాలి నారిమన్ ను ఎపి ప్రభుత్వం అపాయింట్ చేసుకుంది. అందుకు సంబంధించి ఈ జీవో నెంబర్ 259 ని కూడ జారీ అయింది. ఆ క్రమంలో ఈ అడ్వకేట్ కు ఎపి ప్రభుత్వం చెల్లించే మొత్తం...గంటకు అక్షరాలా 33 లక్షల రూపాయలని తెలిసింది. ఆ ప్రకారం ఆయన ఈ కేసు విషయమై ఎన్ని గంటలు కోర్టులో ఉంటే అన్ని 33 లక్షలు ఎపి ప్రభుత్వం చెల్లించాల్సివుంటుంది. ఇప్పటికే ఎన్నో నెలల నుండి నడుస్తున్న ఈ కేసు ఇంకెన్ని నెలలు, సంవత్సరాలు నడుస్తుందో చెప్పడం కష్టం.

హైకోర్డు

హైకోర్డు

అయితే ఇలా పంతానికి పోయి అనవసర ఖర్చ పెట్టే బదులు గా ఒకవేళ కోర్టు విభజన జరగడానికి వీలుగా ఎపిలోనే భవన సదుపాయాన్ని చూపడమో, లేకుంటే నిబంధనలు అంగీకరిస్తే ఇంకా ఎపికి హక్కు ఉన్న హైదరాబాద్ లోనే ఆ హైకోర్డు విభాగం ఏర్పాటుచేసేందుకు ఎపి ప్రభుత్వం అంగీకరించి ఉంటే పోయేదని, అంతేతప్ప అనవసర వివాదం కోసం ప్రజాధనాన్ని ఇంత పెద్ద ఎత్తున వెచ్చించడం సరికాదని...ఆ డబ్బేదో ఎపిలో హై కోర్టు భవనాల నిర్మాణానికి వినియోగించి ఉంటే సరిపోయేదని టిడిపి వ్యతిరేకులు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో న్యాయవాదికి చెల్లింపుల సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం.

English summary
A recent post in social media on AP Government has become a debate. It is about AP government huge fees payments to the Lawyer regarding the High Court division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X