• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మరి దేవుడికి విషం పెడుతున్నామా?...."కొబ్బరినూనె విషం" వివాదంపై వీరమాచినేని స్పందన

By Suvarnaraju
|

నెల్లూరు:కొబ్బరి నూనె విషం అంటూ జరుగుతున్న ప్రచారంపై వీరమాచినేని డైట్ సృష్టికర్త వీరమాచినేని రామకృష్ణారావు ఘాటుగా స్పందించారు. ఈ ప్రచారం వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

నెల్లూరు జిల్లా కేఆర్‌ పీపాళెం, పులికాట్‌నగర్‌ ఉద్యోగుల కాలనీలో పునరావాస కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఆహార ఆరోగ్య అవగాహన సదస్సులో ఆయన ఈ విషయమై మాట్లాడుతూ కొబ్బరి నూనె విషమంటూ ప్రచారం చేస్తున్నవారిపై మండిపడ్డారు. కొబ్బరి నూనె విషమైతే మరి దేవుడికి కొబ్బరిని నైవేద్యంగా ఎందుకు పెడుతున్నామని వీరమాచినేని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఒక అప్పలమ్మ...వ్యాఖ్యలు

ఒక అప్పలమ్మ...వ్యాఖ్యలు

కొబ్బరి నూనె విషమంటూ కొందరు వైద్యులు చేస్తున్న వ్యాఖ్యలు, కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలపై వీరమాచినేని రామకృష్ణారావు మాట్లాడుతూ..."రెండు నెలల క్రితం అమెరికాలోని ఓ అప్పలమ్మ కొబ్బరి నూనె విషమని వ్యాఖ్యానించడం...50 రోజుల తరువాత మనవాళ్లు అదేదో నిజమని వార్తలు వ్రాయడం, ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది"...అన్నారు.

ఎన్నో దేశాల్లో...వాడతారు

ఎన్నో దేశాల్లో...వాడతారు

"కేరళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కొబ్బరినూనె వాడతారన్నది జగమెరిగిన సత్యం... అలాగే అరబ్‌ దేశాలు, కొరియా, చైనా వంటి దేశాలలో తల్లిపాల తరువాత చిన్న పిల్లలకు కొబ్బరినూనెతో తయారైన ఆహారాన్ని ఇస్తుంటారు...తల్లిపాల తరువాత చిన్నపిల్లలు ఆరాయించుకునే శక్తి సామర్థ్యాలు కొబ్బరినూనెతో వస్తాయి... ఇంతమంది వాడుతుండగా పనీపాట లేక ఒక అప్పలమ్మ ఏదో చెబితే దానిని మీడియా భూతద్దంలో చూపుతుండటం దురదృష్టకరం"...అని వీరమాచినేని ఆవేదన వ్యక్తం చేశారు.

దేవుడికి నైవేద్యం...ప్రసాదం

దేవుడికి నైవేద్యం...ప్రసాదం

మనలో ప్రతి ఒక్కరం దేవుడికి కొబ్బరికాయ కొడుతామని...ఆ కొబ్బరికాయను దేవుడికి నైవేద్యంగా పెట్టి మనమే తింటున్నప్పుడు ఆ కొబ్బరికాయలో విషం ఉండాలి కదా...తద్వారా మనకు ఏమైన అవ్వాలికదా...అయినా కొబ్బరికాయలో విషం ఉందని తెలిస్తే దేవునికి మనం కొబ్బరికాయ కొడుతామా?...కొబ్బరిలో విషం లేనప్పుడు కొబ్బరి నూనెలో ఎలా ఉంటుందని వీరమాచినేని ప్రశ్నించారు.

రీఫైండ్‌ ఆయిల్స్...విషం

రీఫైండ్‌ ఆయిల్స్...విషం

ప్రస్తుతం మనం ఆహార పదార్థాల తయారీకి వాడుతున్న రీఫైండ్‌ ఆయిల్స్ తోనే అనారోగ్యం పాలవుతున్నామని వీరమాచినేని చెప్పారు. ఆ నూనెల్లో రసాయనాలు కలుపుతున్నారని ఆయన ఆరోపించారు...అంతేకాని కొబ్బరి నూనె విషం కాదన్నారు. ఎవరి ఆరోగ్యం వారిచేతుల్లోనే ఉందని...కొలస్ట్రాల్‌, డయాబిటిక్‌ సమస్యల విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన వివరించారు. వీరమాచినేని ముఖ్య అతిధిగా హాజరైన ఈ ఆరోగ్య అవగాహన సదస్సుకు జనం భారీ సంఖ్యలో హాజరవడం గమనార్హం. కార్యక్రమం అనంతరం షార్‌ యూనియన్‌ వీరమాచినేని రామకృష్ణారావుకు జ్ఞాపికను అందజేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nellore: Is coconut oil poisoned?...Veeramachineni Diet creator Veeramachinenine Ramakrishna Rao reacted strongly over this controversy. He participated in food awareness programmes held at KRP palem, Pulicat Nagar Employees colony in Nellore District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more