వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు ముద్దులు పెట్టావ్ .. ఇప్పుడు వాతలు పెడుతున్నావ్ .. జగన్ పై డొక్కా ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ సమావేశాల తరువాత ఏపీ ప్రభుత్వ వైఖరిపై టిడిపి ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఏపీ టీడీపీ కీలక నేతలు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. 60 రోజుల వైసిపి పాలన అరాచక పాలన అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 60 రోజుల్లో జగన్ 60 తప్పులు చేశాడంటూ మండిపడుతున్నారు టిడిపి నేతలు.
ఇక తాజాగా గుంటూరులో టీడీపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది . ఈ నిరసన ప్రదర్శనలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విరుచుకుపడ్డారు.

Recommended Video

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 2 రోజుల శిక్షణ విజయవంతం
60 రోజుల జగన్ పాలనలో 60 తప్పులు చేశారని మండిపడిన డొక్కా

60 రోజుల జగన్ పాలనలో 60 తప్పులు చేశారని మండిపడిన డొక్కా

ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా జగన్ సర్కార్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల తీరుకు నిరసనగా చేపట్టిన ప్రదర్శనలో 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పిన జగన్ సర్కార్ ఇప్పుడు వాటిని తూచ్ అంటుందని ఫైర్ అయ్యారు. ఇక నిరుద్యోగ భృతి ని రద్దు చేసిందని, కాపు రిజర్వేషన్ల ను రద్దు చేసిందని ,నిరుపేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ లను రద్దు చేసిందని మండిపడ్డారు. ఇలా ఒకటి కాదు 60 రోజుల జగన్ పాలనలో 60 తప్పులు చేశారని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని మండిపడిన టీడీపీ

అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని మండిపడిన టీడీపీ

ఒక్క అవకాశం ఇవ్వాలని బతిమాలుకుంటే ఎలా పరిపాలిస్తాడో అని ఓట్లేసిన ప్రజలకు జగన్ బాగానే బుద్ధి చెబుతున్నారని డొక్కా మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేస్తూ ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్ , ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజలకు వాతలు పెడుతున్నారని డొక్కా చురకలు వేశారు . జగన్ తన అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. ఏపీ ప్రజలు పొరపాటున జగన్ కు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాభివృద్ధిని 50 ఏళ్ల వెనక్కి నెట్టేస్తున్నా రని ఆయన పేర్కొన్నారు. జగన్ పాలనలో ప్రజలకు నానా కష్టాలు తప్పేలా లేవని డొక్కా అన్నారు.

సుపరిపాలన ఇదేనా జగన్ అంటూ ప్రశ్నించిన డొక్కా మాణిక్య వరప్రసాద్

సుపరిపాలన ఇదేనా జగన్ అంటూ ప్రశ్నించిన డొక్కా మాణిక్య వరప్రసాద్

జగన్ చేసే సుపరిపాలన ఇదేనా అంటూ డొక్కా ప్రశ్నించారు. జగన్ పాలనలో ఏపీలో సిమెంట్ రేట్ కంటే ఇసుక రేటు ఎక్కువగా ఉందని డొక్కా విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రాకుండా వెనక్కి పోతున్నాయని డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. ఇప్పటివరకూ జగన్ రాష్ట్రం విషయంలో సాధించిన ప్రగతి ఏంటి అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కనిపించింది అన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పుడు జగన్ హయాంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వర్గాలు వెనుకంజ వేస్తున్నాయని పేర్కొన్నారు. జగన్ పాలన చేపట్టిన నాటి నుండి అన్ని రంగాలు కుదేలయ్యాయి అని ఏపీ ప్రగతి శూన్యంగా మిగిలిందని, చీకట్లోకి రాష్ట్రాన్ని జగన్ నెడుతున్నాడని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

English summary
TDP protest held in Guntur. In that protest TDP MLC Dokka Manikavaraprasad fired on AP Chief Minister YS Jaganmohan Reddy. Dokka Manikya Varaprasad is outraged that Jagan Sarkar is embarrassing the people by not providing them with promises that are not feasible. Dokka criticized the jagan's regime's sand rate as higher than AP's cement rate. Dokka Manikavaraprasad alleged that the state's investment in the Jagan regime is backing away .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X