వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌కు దమ్ములేదు, బీజేపీ నిపా వైరస్: డొక్కా, 'జగన్ పాలకొల్లులో పోటీ చేస్తే..'

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని నిపా వైరస్‌తో పోల్చారు. వైసీపీ, జనసేనలు దగాకోరు పార్టీలన్నారు.

Recommended Video

పవన్‌పై టీడీపీ నేతల భిన్న స్పందన!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లే ఏపీకి పెట్టుబడుల వరద పారుతోందని డొక్కా చెప్పారు. ముఖ్యమంత్రి శ్రమను కేంద్రం నీరుగార్చే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ విలువలను తుంగలో తొక్కి రాష్ట్రాల హక్కులను హరిస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఏపీకి మాత్రమే కాదని, దేశానికే అవసరం లేదని ఆయన చెప్పారు.

Dokka Manikya Vara Prasad takes on Pawan Kalyan, YS Jagan and BJP

వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలకు కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేదని డొక్కా చెప్పారు. చంద్రబాబును, మంత్రి నారా లోకేష్‌ను నిత్యం విమర్శించటం, తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వైసీపీ, జనసేనలు దగాకోరు పార్టీలు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నిపా వైరస్ వంటిది అని మండిపడ్డారు.

జగన్ పాలకొల్లులో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు

తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని దోచేసిన ఘనత జగన్‌దని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. చంద్రబాబును కానీ, తనను కానీ విమర్శించే అర్హత జగన్‌కు లేదన్నారు. జగన్ ఉండాల్సింది జనాల మధ్య కాదని, మెంటల్ ఆసుపత్రిలో అన్నారు. రాత్రిపగలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నామన్నారు.

నాకింతమంది కొడుకులా, తెలియదు: జేసీ వివాదాస్పదం, లోకేష్‌ని బాబు సీఎం చేయాలనుకుంటున్నారు కానీనాకింతమంది కొడుకులా, తెలియదు: జేసీ వివాదాస్పదం, లోకేష్‌ని బాబు సీఎం చేయాలనుకుంటున్నారు కానీ

లోటు బడ్జెట్‌లో కూడా ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్నామన్నారు. జగన్ రాష్ట్రాన్ని దోచేస్తో, ఆయన అనుచరులు గుళ్లను, గోపురాలను దోచేశారన్నారు. పాలకొల్లులో జగన్ పోటీ చేస్తే ఆయనకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. డిపాజిట్ దక్కితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.

English summary
Telugudesam Party leader Dokka Manikya Vara Prasad takes on Jana Sena chief Pawan Kalyan, YSRCP chief YS Jagan and BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X